breaking news
Free transactions
-
యూపీఐ పేమెంట్లపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) పేమెంట్లపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీఐ ద్వారా పూర్తిగా ఉచిత డిజిటల్ లావాదేవీల శకం శాశ్వతంగా ఉండకపోవచ్చని సూచిస్తూ భవిష్యత్తులో యూపీఐ ఇంటర్ఫేస్ను ఆర్థికంగా సుస్థిరం చేయాల్సిన అవసరం ఉందన్నారు మల్హోత్రా.ప్రస్తుతం ఉచితంయూపీఐ వ్యవస్థ ప్రస్తుతం వినియోగదారులకు ఉచితమని, బ్యాంకులు, ఇతర భాగస్వాములకు సబ్సిడీ ఇవ్వడం ద్వారా ఖర్చులను ప్రభుత్వం భరిస్తోందని ఆయన అన్నారు. ‘మనకు విశ్వవ్యాప్తంగా సమర్థవంతమైన వ్యవస్థ అవసరం. ప్రస్తుతానికి ఎలాంటి ఛార్జీలు లేవు. యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో బ్యాంకులు, ఇతర భాగస్వాములకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది’ అన్నారు.ఉచితం శాశ్వతం కాదుడిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలను కొనసాగించాలంటే ఎవరోఒకరు ఖర్చును భరించాల్సి ఉంటుందని, ఉచిత యూపీఐ లావాదేవీలు శాశ్వతంగా ఉండవని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. 'సహజంగానే కొన్ని ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. ఏ ముఖ్యమైన మౌలిక సదుపాయాలైనా ఫలాలు ఇవ్వాలి. ఏ సేవ అయినా నిజంగా నిలకడగా ఉండాలంటే, దాని ఖర్చును సమిష్టిగా గానీ లేదా వినియోగదారు గానీ చెల్లించాలి' అని వ్యాఖ్యానించారు.మౌలిక సదుపాయాలపై భారంయూపీఐ లావాదేవీలు గత కొన్నేళ్లుగా విపరీతమైన వృద్ధిని సాధించాయి. గ్లోబల్ పేమెంట్స్ దిగ్గజం వీసాను అధిగమించాయి. గత జూన్‌లో 1839 కోట్ల యూపీఐ లావాదేవీల ద్వారా రూ .24.03 లక్షల కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయి. దీంతో వేగవంతమైన చెల్లింపులలో భారత్ గ్లోబల్ లీడర్‌గా మారింది. అయితే, ఈ పెరుగుదల బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వంటి బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. యూపీఐ లావాదేవీలు ఉచితం కావడంతో వాటి ద్వారా ఎటువంటి ఆదాయ ప్రవాహం లేకపోవడం వల్ల ఇది ఆర్థికంగా నిలకడలేని నమూనాగా మారింది. -
ఈ బ్యాంకుల్లో అపరిమిత ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్..!
ముంబై: ఎటీఎం లావాదేవీలపై బ్యాంకులు ఇంటర్‌ఛేంజ్ ఫీజు వసూలు చేసుకోవచ్చునని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా గత కొన్ని రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో బ్యాంకు ఖాతాదారులపై మరింత భారం పడనుంది. ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ ట్రాన్సాక్షన్ పరిమితి దాటితే ట్రాన్సాక్షన్ ఫీజును వసూలు చేయనున్నాయి. పరిమితికి మించి లావాదేవీలు జరిపితే ఒక్కో లావాదేవీకి రూ. 20 నుంచి రూ.21 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలు 2022 జనవరి 1, నుంచి అమలులోకి రానున్నాయి. బ్యాంకు ఖాతాదారులు తమ సొంత బ్యాంకు ఏటీఎం నుంచి 5 ఉచిత ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చును. ఇతర బ్యాంకు ఏటీఎంలో మెట్రో నగరాల్లో 3 సార్లు, గ్రామీణ ప్రాంతాల్లో 5 ఉచిత లావాదేవీలను నిర్వహించవచ్చును. కాగా కొన్ని బ్యాంకులు తమ ఖాతాదారుల కోసం అపరిమిత ఎటీఎం లావాదేవీలు జరుపుకోవచ్చునని ప్రకటించాయి. ఇండస్ఇండ్, ఐడీబీఐ వంటి ప్రైవేటు బ్యాంకులు ఈ ఆఫర్‌ను తమ కస్టమర్లకు అందిస్తున్నాయి. ఐడీబీఐ బ్యాంకు ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన వాటికి పూర్తిగా అపరిమిత ఉచిత ఎటీఎం లావాదేవీలను జరుపుకోవచ్చును. కాగా ఐడీబీఐ బ్యాంక్ ఆర్బీఐ నిర్దేశించిన కనీస ఉచిత పరిమితులకు అనుగుణంగా ఉచిత ఎటీఎం లావాదేవీలను అందిస్తుంది. బ్యాంక్ తన స్వంత ఎటిఎంలలో 5 ఉచిత లావాదేవీలను, ఇతర బ్యాంక్ ఎటిఎంలలో, ఆరు ప్రధాన మెట్రో నగరాల్లో మూడు ఉచిత లావాదేవీలను కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని ఐడిబిఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జోర్టీ చాకో పేర్కొన్నారు. ఇండస్ఇండ్ బ్యాంక్ తన బ్యాంకు ఖాతాదారులకు దేశవ్యాప్తంగా ఏ బ్యాంక్ ఏటీఎం నుంచైనా అపరిమిత ఉచిత ఏటీఎం లావాదేవీలను అందిస్తోందని ఇండస్ఇండ్ బ్యాంక్ తన వెబ్సైట్ పేర్కొంది. సేవింగ్స్ ఖాతాలో రూ.25వేల కంటే ఎక్కువ సగటు బ్యాలెన్స్ నిర్వహిస్తోన్న అకౌంట్ హోల్డర్లకు సిటీ బ్యాంకు కూడా అపరిమిత ఉచిత లావాదేవీలను అందిస్తోంది. ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ దిగ్గజం ఎస్బీఐ తన ఖాతాదారులకు రూ.1 లక్ష కంటే ఎక్కువ బ్యాలెన్స్ కలిగి ఉన్న వారికి ఏ ఏటీఎంలోనైనా అపరిమిత ఉచిత ట్రాన్సాక్షన్ ఇవ్వనుంది. చదవండి: గోల్డ్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్! -
స్వైప్ మిషన్స్ ఎక్కడ..?
జిల్లాలో కనిపించని నగదు రహిత లావాదేవీలు పట్టించుకోని వ్యాపారవర్గాలు ఇబ్బందులు పడుతున్న జనం కొనసాగుతున్న నగదు కష్టాలు జిల్లాలో స్వైప్ మిషన్లు కనిపించడంలేదు. కలెక్టర్ శరత్ పలుచోట్ల సమావేశం నిర్వహించి నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించాలని.. ప్రతి ఒక్కరూ స్వైప్ మిషన్లు వినియోగించాలని కోరినా ఫలితం కానరావడంలేదు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలపై అందిస్తున్న రాయితీలు జనం దరిచేరడంలేదు. సుమారు 55 రోజులు దాటినా జనాన్ని నగదు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. జగిత్యాల: జిల్లా కేంద్రంలో నగదు లావాదేవీలపై వ్యాపారులు మక్కువ చూపుతున్నారు. కాని వ్యాపార కేంద్రాల్లో మాత్రం స్వైప్ మిషన్లు కనిపించడం లేదు. ఇప్పటికే కలెక్టర్ శరత్ వర్తక సంఘం వ్యాపారులతో సమావేశం నిర్వహించి నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని, ప్రతి ఒక్కరు స్వైప్ మిషన్లు వాడాలని సూచించారు. అయినా జిల్లాలో కనీసం 50 శాతం మేరకైనా నగదు రహిత లావాదేవీలను జరగడం లేదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లావాదేవీల చెల్లింపులపై అనేక రాయితీలు çకల్పించినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. స్వైప్ మిషన్లు కరువుతో ఇబ్బందికరంగా మారింది. చౌక ధరల దుకాణాల్లో.. చౌకధరల దుకాణాల్లో సైతం నగదు రహిత సేవలు జరపాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. డెబిట్, రూపే కార్డులలో కొనుగోలు చేయాలని ఆదేశించినప్పటికీ ఇప్పటి వరకు చౌక ధరల దుకాణాల్లో అమలు కావడం లేదు. సూపర్మార్కెట్లలో.. జిల్లా కేంద్రంలో సూపర్మార్కెట్లలో కూడా స్వైప్ మిషన్లు లేకపోవడంతో నగదు లావాదేవీలే కొనసాగుతున్నాయి. కొందరు రూ.2 వేల సరుకులు తీసుకుంటేనే ఇస్తున్నారు. లేకుంటే చిల్లర లేవంటూ పంపిస్తున్నారు. దీంతో చేసేదేమీలేక వారు రూ.2 వేలు పెట్టి సరుకులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పెట్రోల్ బంక్‌ల్లో... జిల్లాలో ముఖ్యంగా పెట్రోల్‌బంక్‌లలో స్వైప్ మిషన్లు ఏర్పాటు చేయకుండా నగదు ఉంటేనే పెట్రోల్ పోస్తున్నారు. రూ.2 వేల నోటు తెస్తే కనీసం రూ.500 నుంచి రూ.వెయ్యి పోసుకుంటేనే చిల్లర ఇస్తున్నారు. లేదంటే పెట్రోల్ లేదనే సమాధానం చెబుతున్నారు. విద్యుత్ శాఖలో.. విద్యుత్ చెల్లింపుల్లో సైతం నగదుగానే తీసుకుంటున్నారు. స్వైప్ మిషన్లు ఏర్పాటు చేయడం లేదు. దీంతో వారు సైతం చిల్లర లేకపోవడంతో వచ్చేనెలలో జమ చేసుకోవచ్చంటూ అధిక మొత్తంలో విద్యుత్ బిల్లులను తీసుకుంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో.. ముఖ్యంగా జిల్లా కేంద్రానికి ప్రతి ఒక్కరు ఏదో ఒక పని మీద వస్తుంటారు. ఆర్టీసీ బస్సుల్లోనే విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతులు వస్తారు. వీరి వద్ద చిల్లర లేకపోవడంతో బస్సు కండక్టర్లు దింపేస్తున్నారు. వీటిలో కూడా స్వైప్ మిషన్లు ఏర్పాటు చేస్తామన్నప్పటికీ ఇప్పటికైతే ఏర్పాటు చేయలేదు. మద్యం షాపుల్లో.. జిల్లాలో ముఖ్యంగా మద్యం షాపుల్లో, బార్ అండ్ రెస్టారెంట్లలో అత్యధికంగా వ్యాపారం జరుగుతూ ఉంటుంది. సుమారు రూ.లక్షకు పైగానే జరుగుతాయి. ఇందులో సైతం స్వైప్ మిషన్లు ఏర్పాటు చేయకుండా నగదుగానే తీసుకుంటున్నారు. ముందుగా వచ్చిన వినియోగదారులకు డబ్బులుంటేనే కూర్చోవాలని, లేదంటే స్వైప్ మిషన్లు లేవని పంపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. స్పందించని సంబంధిత శాఖ అధికారులు ప్రతి శాఖ అధికారులు వారి ఆధీనంలో ఉన్న వాటిలో స్వైప్ మిషన్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిచోట ఇప్పటి వరకు జిల్లాలో స్వైప్‌మిషన్లు ఏర్పాటు చేసిన దాఖలు లేవు. వ్యాపారులు, వివిధ రకాల వ్యాపారాలు చేసే వారిపై ఒత్తిడి తీసుకురాకపోవడంతో నగదుకే మొగ్గుచూపుతున్నారు. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రతిచోట స్వైప్ మిషన్లు ఏర్పాటు చేసేలా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.