breaking news
fraudulent announcements
-
మోసపూరిత ప్రకటనలతో జాగ్రత్త: ఎల్ఐసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తమ సంస్థ పేరుతో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న మోసపూరిత ప్రకటనల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) హెచ్చ రించింది.‘కంపెనీ సమ్మతి లేకుండా మా సీనియర్ అధికారి, మాజీ అధికారుల ఫొటోలు, లోగో, బ్రాండ్ పేరును దురి్వనియోగం చేయడం ద్వారా నిర్దిష్ట వ్యక్తులు/సంస్థలు వివిధ సామాజిక మాధ్యమాల్లో మోసపూరిత ప్రకటనల్లో అనధికార పద్ధతిలో నిమగ్నమై ఉన్నాయని మా దృష్టికి వచి్చంది. పాలసీదారులు, ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలి. అటువంటి మోసపూరిత ప్రకటనల యూ ఆర్ఎల్ లింక్‌లను ఎల్ఐసీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో నివేదించండి’ అని ఎల్ఐసీ కోరింది. -
ఏకపక్షంగా వ్యవహరించొద్దు
సీపీఎం నేత తమ్మినేని సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భూసర్వేకు సిద్ధమవడం మంచి పరిణామమేనని సీపీఎం పేర్కొంది. అయితే రాష్ట్రంలో వందల, వేల ఎకరాలు కబ్జాకు గురవుతుంటే పట్టించుకోకపో వటం శోచనీయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. గురువారం ఎంబీ భవన్లో ఎమ్మెల్యే సున్నం రాజయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, బి.వెంకట్‌తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. భూ సర్వేపై ఆర్భాటపు ప్రకటనలు చేయకుండా విధి విధానాలు రూపొందించాలని తమ్మినేని సూచించారు. సర్వేపై ఏకపక్షంగా నిర్ణ యాలు చేయకుండా విపక్షాలను విశ్వాసం లోకి తీసుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ సంద ర్భంగా రైతులపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడులు, అణచివేత సరికాదని అన్నారు. కృష్ణా నీటిని కర్ణాటక ఏకపక్షంగా విని యోగించుకోవడంపై ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు స్పందిం చాలని జూలకంటి డిమాండ్ చేశారు.