breaking news
Four teenagers
-
మైనర్ బాలికపై నలుగురు అత్యాచారం
-
జల్సాల కోసం గొలుసు చోరీలు
-
జల్సాల కోసం గొలుసు చోరీలు
ఏలూరు (సెంట్రల్): జల్సాల కోసం గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు యువకులు, ఒక మైనర్ బాలుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 562 గ్రాముల బంగారు వస్తువులను, నేరాలకు ఉపయోగించిన మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఒకరు పాలిటెక్నిక్, ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ఉన్నారు. ఏలూరులోని తన కార్యాలయంలో బుధవారం కేసు వివరాలను ఎస్పీ భాస్కర్‌భూషణ్ విలేకరులకు వివరించారు. నిడమర్రు మండలం బావాయిపాలెంకు చెందిన మండపాక నాగేంద్ర కృష్ణబాబు (20) ఇంటర్మీడియెట్ చదువుతూ మధ్యలో మానివేశాడు. వ్యసనాలకు బానిసై మోటార్ సైకిల్‌పై వెళుతూ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేవాడు. కొంతకాలం తర్వాత గణపవరం వెలమపేటకు చెందిన చిప్పాడ వంశీ (20), తోటవారి వీధికి చెందిన శెట్టి సాయికుమార్ (20), గణపవరం మండలం వరదరాజపురం గ్రామానికి చెందిన సూరిబోయిన వెంకట విజయ్‌కుమార్ (19), మరో మైనర్ బాలుడితో కలిసి గ్యాంగ్‌గా ఏర్పడ్డాడు. వీరంతా మోటార్‌సైకిళ్లపై తిరుగుతూ ఒంటరిగా వెళుతున్న మహిళల మెడలోని బంగారు వస్తువులను దొంగిలించేవారు. ఇలా తాడేపల్లిగూడెం, తాడేపల్లిగూడెం రూరల్, పెంటపాడు, నల్లజర్ల, ఇరగవరం, తణుకు రూరల్, భీమవరం, కాళ్ల, కొవ్వూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో సుమారు 26 చోరీలకు పాల్పడ్డారు. బంగారు వస్తువులను అమ్మి వచ్చిన సొమ్ములతో విలాసవంతంగా గడిపేవారు. కృష్ణబాబు ప్లాన్ ప్రకారమే.. దొంగతనాలు చేసే విషయంలో ముఠా నాయకుడు కృష్ణబాబు ప్లాన్ ప్రకారమే మిగిలిన వారు నడుచుకునేవారు. కృష్ణబాబు దొంగతనానికి వెళ్లినప్పుడల్లా ఒకరిని వెంట తీసుకువెళ్లేవాడు. రెండు రోజులపాటు ఆయూ ప్రాంతాల్లో నిఘా పెట్టి పరిశీలించేవారు. ఆ తర్వాత సమయం చూసుకుని ఒంటరిగా వెళుతున్న మహిళలను టార్గెట్ చేసేవారు. చోరీలు చేసి వచ్చిన సొత్తును అమ్మి జల్సాలు చేసుకునేవారు. వీరిలో వంశీ భీమవరంలో పాలిటెక్నిక్, సారుుకుమార్, విజయ్‌కుమార్ తాడేపల్లిగూడెంలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. మైనర్ బాలుడు ఇంటి వద్ద ఉంటూ కూలి పనులకు వెళుతుంటాడు. దొరికిందిలా.. తాడేపల్లిగూడెంలోని యాగరపల్లి ఓవర్ బ్రిడ్జ్‌పై బుధవారం పోలీసులు తనిఖీ చేస్తుండగా దొంగతనానికి వెళ్లి తిరిగి వస్తున్న కృష్ణబాబు మరో యువకుడు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో వీరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. చోరీల విషయూలు బయటపడటంతో మిగిలిన యువకులు, మైనర్ బాలుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 26 కేసులకు సంబంధించి సుమారు రూ.14 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కొవ్వూరు డీఎస్పీ ఎన్.వెంకటేశ్వరరావు, తాడేపల్లిగూడెం టౌన్ సీఐ కె.శ్రీనివాసరావు, ఎస్సైలు సీహెచ్ కొండలరావు, క్రైమ్ ఎస్సై ఎంవీ పురుషోత్తమ్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఇద్దరు దొంగలు అరెస్ట్ చాగల్లు పోలీసుస్టేషన్ పరిధిలో దుకాణాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి రూ.1.30 లక్షలు, రూ.85 వేల విలువైన దుస్తులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ భాస్కర్‌భూషణ్ తెలిపారు. చాగల్లు మండలం చంద్రవరం గ్రామానికి చెందిన ఆకుల నందిరాజు, మల్లవరం గ్రామానికి చెందిన రాయుడు నరేష్ చాగల్లులోని పలు వస్త్ర దుకాణాలు, సెల్షాపుల్లో చోరీలకు పాల్పడ్డారు. స్థానికులకు వీరిపై అనుమానం కలగడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలు బయటపడ్డారుు. దొంగతనాలను చేధించిన నిడదవోలు సీఐ ఎం.బాలకృష్ణ, చాగల్లు ఎస్సై ఎం.జయబాబును ఎస్పీ అభినందించారు. సూపర్బజార్లో చోరీ కొయ్యలగూడెం: కొయ్యలగూడెం మెయిన్‌రోడ్డులోని వినాయక శ్రీనివాస సూపర్బజార్లో బుధవారం వేకువజామున చోరీ జరిగింది. దుకాణానికి వెనుక ఉన్న తలుపులు పగులగొట్టి దుండగులు లోనికి చొరబడ్డారు. రూ.25 వేల నగదు, రూ.10 వేల విలువైన కిరాణా సామాన్లు చోరీకి గురైనట్టు యజమాని కొల్లూరి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చోరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌కు 50 మీటర్ల దూరంలో ఎదురుగా దుకాణం ఉండటం గమనార్హం. -
ముగ్గురు నకిలీ పోలీసులు అరెస్టు
నకిలీ తుపాకి, నగదు, కారు స్వాధీనం పరారీలో మరో నిందితుడు జానీ వివరాలు వెల్లడించిన అర్బన్ అదనపు ఎస్పీ శ్రీనివాసులు గుంటూరు క్రైం : వ్యసనాలకు బానిసలుగా మారిన నలుగురు యువకులు సులువైన మార్గంలో డబ్బు సంపాదించాలని అడ్డదారులు తొక్కి కటకటాల పాలయ్యారు. ఇందుకు సంబంధించి అర్బన్ జిల్లా అదనపు ఎస్పీ బి.శ్రీనివాసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. నేరాలకు పాల్పడింది ఇలా... నరసరావుపేటకు చెందిన ఉయ్యాల గోపి, షేక్ నాగార్జున గత ఏడాది సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు సత్తెనపల్లి, నరసరావుపేట, ప్రకాశం జిల్లా సంతమాగలూరు, గుంటూరు రూరల్ పోలీసు స్టేషన్ల పరిధిలో కారులో ప్రయాణికులను ఎక్కించుకుని ఊరు బయటకు తీసుకెళ్లి వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్నారు. అదే ఏడాది డిసెంబర్లో వారిద్దరిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వారు బెయిల్‌పై విడుదల అయ్యారు. అనంతరం ఉయ్యాల గోపి నేరాలకు పాల్పడడం మానేశాడు. నాగార్జున నరసరావుపేటకు చెందిన కొనికళ్ళ ప్రకాష్, రౌతు ప్రసంగి, షేక్ జానీలతో ఒక ముఠాగా ఏర్పడి ఏప్రిల్ 6న ప్రకాశం జిల్లా సంతమాగలూరు సమీపంలో ఇండికా కారులో ఇద్దరు ప్రయాణీకులను ఎక్కించుకుని ఊరి బయటకు రాగానే తాము పోలీసులమని చెప్పి నకిలీ తుపాకితో బెదిరించి వారి వద్ద ఉన్న రూ.28,500 దోచుకున్నారు. ఏప్రిల్ 12న నకరికల్లు నుంచి ఇద్దరు ప్రయాణికులను ఎ క్కించుకుని అదేవిధంగా బంగారు ఉంగరం, రూ.2వేలు నగదు దోచుకున్నారు. అదే నెల 17న నకరికల్లు నుంచి ద్విచక్రవాహనంపై ఒంటరిగా వెళుతున్న ఓ యువకుడిని ఊరి బయట అటకాయించి అతని వద్ద రూ.10 వేలు దోచుకున్నారు. ఏప్రిల్ 23 అర్ధరాత్రి సమయంలో గుంటూరు మార్కెట్ సెంటర్ వద్ద మాచర్లకు వెళ్లేందుకు వేచి ఉన్న దుర్గా భాస్కర్‌ను కారులో ఎక్కించుకుని నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్ వద్ద తుపాకితో బెదిరించి అతని వద్ద ఉన్న రూ. 48,500 నగదు దోచుకొని పరారయ్యారు. స్పెషల్ టీమ్ ఏర్పాటు తుపాకీతో బెదిరించి తమ వద్ద నగదు దోచుకున్నారని మాచర్లకు చెందిన భాస్కరరావు గుంటూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం తెలుసుకున్న అర్బన్ జిల్లా ఎస్సీ త్రిపాఠి నిందితులను గుర్తించేందుకు సీసీఎస్ డీఎస్పీ పి.శ్రీనివాస్, సౌత్ డీఎస్పీ బి.శ్రీనివాసులు పర్యవేక్షణలో ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశారు. గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం జంక్షన్లో గురువారం చాకచక్యంగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు షేక్‌జానీ పరారయ్యాడు. నిందితుల వద్ద ఉన్న రూ.87,400 నగదు, బంగారు ఉంగరం, నకిలీ తుపాకి, లాఠీ, ఇండికా కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు అదనపు ఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా స్పెషల్ టీమ్‌లోని సీఐలు అజయ్‌కుమార్, శివప్రసాద్, సిబ్బందికి రివార్డుల కోసం ఎస్పీకి సిఫార్స్ చేస్తానని తెలిపారు. -
ఈతకు వెళ్లి గల్లంతైన నలుగురు యువకులు
-
గ్రామదేవత పండుగలో నలుగురు యువకులు...
విజయనగరం: భోగాపురం మండలం గరి నందిగామ గ్రామంలో పండుగరోజు విషాదం అలముకుంది. గ్రామదేవత పండుగకు వచ్చిన నలుగురు యువకులు చంపావతి నదిలో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. ఇటీవల నదిలో అక్రమ తవ్వకాలు ఎక్కువైపోయాయి. ఇసుక తవ్వకాల వల్ల నదిలో లోతు పెరిగి పోయింది. దానికి తోడు నదిలో నీరు ఎక్కువగా ఉంది. లోతు తెలియని యువకులు నదిలో దిగి గల్లంతయ్యారు. వారి కోసం గ్రామస్తులు గాలిస్తున్నారు. గ్రామానికి రెండు మూడు కిలోమీటర్ల దూరం వరకు యువకులు కొట్టుకుపోయి ఉంటారేమోనని వెతుకుతున్నారు. ఈ నలుగురు యువకులు విశాఖపట్నం నుంచి గ్రామదేవత పండుగ కోసం గ్రామానికి వచ్చారు. గ్రామం ఆనందంగా పండుగ చేసుకునే సమయంలో నలుగురు యువకులు గల్లంతవడంతో విషాదం నెలకొంది. **