breaking news
Four people died
-
ఆటోను ఢీకొన్న లారీ
బత్తలపల్లి: ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన అనంతపురం జిల్లా బత్తలపల్లి సమీపంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తాడిమర్రి మండలం పిన్నదరి గ్రామానికి చెందిన దంపతులు సాకే నారాయణస్వామి (45), సాకే ఆదెమ్మ (40) బొప్పాయి కాయలు అమ్ముకునేందుకు సొంత ఆటోలో రోజూ బత్తలపల్లికి వస్తుంటారు. రోజులాగే ఆదివారం తెల్లవారుజామున ఆటోలో బత్తలపల్లికి వస్తుండగా అదే గ్రామానికి చెందిన చెన్నకేశవులు (46), పెద్దక్క (44) వ్యక్తిగత పనులపై వెళ్తూ అదే ఆటోలో ఎక్కారు. ఆటో బత్తలపల్లి ఇందిరమ్మ కాలనీ వద్దకు రాగానే బెంగళూరు నుంచి తాడిపత్రి వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు కాగా నారాయణస్వామి, ఆదెమ్మలు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ఇద్దరిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే లారీని వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందడంతో పిన్నదరి గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి. ఘటన వివరాలు .. ఎక్కడ?: అనంతపురం జిల్లా బత్తలపల్లిలో ఎప్పుడు?: ఆదివారం తెల్లవారుజామున కారణం: లారీ వేగంగా వచ్చి ఆటోను ఢీకొనడం పర్యవసానం: ఆటోలో ఉన్న ఒకే గ్రామానికి చెందిన నలుగురు దుర్మరణం -
ఘోర రోడ్డు ప్రమాదం
వేలూరు, న్యూస్లైన్:సెయ్యారు సమీపంలో బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు దుర్మణం పాలవగా, ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా చత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన కార్మికులు. చత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన బోర్వెల్ కార్మికులు కాంచీపురంలో ఉంటూ అక్కడక్కడా బోర్వెల్ వేసే పనులకు వెళ్తుంటారు. బుధవారం ఉదయం తిరువణ్ణామలై జిల్లా సెయ్యారు సమీపంలోని బ్రహ్మదేశం గ్రామంలోని లోతు బావిలో బోర్వెల్ వేసేందుకు తొమ్మిది మంది కార్మికులు వేకువ జామున 2 గంటలకు లారీలో బయలు దేరా రు. లారీని గణేషన్ నడుపుతున్నాడు. లారీ సెయ్యారు సమీపంలోని సుమంగళి గ్రామం వద్ద వెళుతుండగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. లారీలోని కార్మికులు పైపుల మధ్య చిక్కుక్కుకుపోయారు. కార్మికుల కేకలు విన్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పైపుల మధ్య చిక్కుకున్న వారిని బయటకు తీశారు. అప్పటికే మేదలాల్ కుమారుడు రామ్చంద్(23), పట్టు కుమారుడు రేస్(22), చందు కుమారుడు సాదేవ్(23), జయ్సింగ్ కుమారుడు లక్ష్మణన్(22) అక్కడిక్కడే మృతి చెందారు, రాహుల్, వెడి, ప్రకాష్, రాసు, అరుల్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే 108 వాహనానికి, సెయ్యారు పోలీసులకు సమాచారం అందించారు. గాయపడ్డ వారిని సమీపంలోని కాంచిపురం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే సెయ్యారు డీఎస్పీ రవిచంద్రన్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ప్రేమ్దేశం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వస్పత్రికి తరలించారు. అనంతరం మృతుల వివరాలను బంధువులకు తెలియజేశారు. కేసు దర్యాప్తులో ఉంది.