breaking news
former government official
-
ప్రధాన సమాచార కమిషనర్‌గా గోయల్
న్యూఢిల్లీ: నూతన ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారి రాజ్‌కుమార్ గోయల్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపికచేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల ఎంపిక ప్యానెల్ బుధవారం సమావేశమై గోయల్ పేరును సీఐసీ పదవికి సిఫార్సుచేసినట్లు శనివారం ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. సీఐసీగా గోయల్‌తోపాటు మరో ఎనిమిది మంది ఇన్ఫర్మేషన్ కమిషనర్(ఐసీ)లను కొత్తగా ప్యానెల్ సిఫార్సుచేసింది.గోయల్ చేత సీఐసీగా సోమవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయిస్తారు. అరుణాచల్ ప్రదేశ్–గోవా–మిజోరం–యూనియన్ టెరిటరీస్(ఏజీఎంయూటీ) క్యాడర్‌కు చెందిన 1990 బ్యాచ్(రిటైర్డ్) ఐఏఎస్ అధికారి అయిన గోయల్ ఇటీవల కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శిగా సేవలందించారు. గతంలో ఈయన కేంద్ర హోం శాఖలో సరిహద్దు నిర్వహణ విభాగంలో కార్యదర్శిగా పనిచేశారు. అవిభాజ్య జమ్మూకశీ్మర్ రాష్ట్రంతోపాటు కేంద్రప్రభుత్వంలో పలు పదవుల్లో సేవలందించారు. సెపె్టంబర్ 13వ తేదీన ప్రస్తుత సీఐసీ హీరాలాల్ సమారియా రిటైర్ కావడంతో అప్పట్నుంచి ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలోనే రాజ్గోయల్ను సీఐసీ పదవికి ఎంపికచేశారు. కొత్త కమిషనర్లు, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ బాధ్యతలు స్వీకరించాక దాదాపు 9 ఏళ్ల తర్వాత కమిషన్ గరిష్ట సామర్థ్యంతో పనిచేయనుంది. బుధవారం 8 మందిని ఐసీలుగా సిఫార్సుచేయగా ఇప్పటికే ఆనందీ రామలింగం, వినోద్ కుమార్ తివారీలు ఐసీలుగా పనిచేస్తున్నారు. సమాచార కమిషనర్(ఐసీ) పోస్ట్‌కు ప్రభుత్వం ఎంపికచేసిన 8 మందిలో సీనియర్ పాత్రికేయులు పీఆర్ రమేశ్, అశుతోష్ చతుర్వేది, పెట్రోలియం, సహజవాయువు నియంత్రణ బోర్డ్‌లో లీగల్ సభ్యురాలైన రేలంగి సుధారాణి, మాజీ రైల్వేబోర్డ్ చీఫ్ జయవర్మ సిన్హా, మాజీ ఐపీఎస్ అధికారి స్వాగత్ దాస్, సెంట్రల్ సెక్రటేరియట్ సరీ్వస్ మాజీ అధికారి సంజీవ్ కుమార్ జిందాల్, మాజీ ఐఏఎస్ అధికారి సురేంద్ర సింగ్ మీనా, మాజీ ఇండియన్ ఫారెస్ట్ సరీ్వస్ అధికారి కుష్వంత్ సింగ్ సేథీ ఉన్నారు. -
దారుణాల్లోకెల్లా దారుణం!
చైనాలో ఓ మాజీ ప్రభుత్వాధికారి అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. సమాజంపై కోపంతో అభంశుభం తెలియని చిన్నారులపై ప్రతీకార దాడికి దిగాడు. ఉద్దేశపూర్వకంగా పాఠశాల విద్యార్థులపైకి కారుతో దూసుకెళ్లి.. బీభత్సం సృష్టించాడు. సెంట్రల్ చైనా హెనాన్ ప్రావిన్స్‌లోని నాన్యాంగ్ లో సోమవారం మిట్టమధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా.. 11 మంది ముక్కుపచ్చలారని పసిపిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కిరాతకమైన దాడికి పాల్పడ్డ 'మా' (ఇంటిపేరు) అనే వ్యక్తి సంఘటనా స్థలం నుంచి వెంటనే పరారయ్యాడు. ఆ తర్వాత అతన్ని వెంటాడి పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ సిబ్బంది అవినీతిపై దర్యాప్తు చేసే నాన్యాంగ్ సిటీ పీపుల్ విభాగంలో పనిచేసిన 'మా' ఓ రిటైర్డ్ దర్యాప్తు అధికారి. సమాజం తీరుపై అసంతృప్తి చెందిన అతను ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతోనే ఈ దురాగతానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. పాఠశాల నుంచి బయటకు వచ్చి రోడ్డు దాటుతున్న విద్యార్థుల సమూహంపై బీవైడీ మోడల్ వాహనంతో అతడు దూసుకుపోయాడు. విద్యార్థుల లక్ష్యంగా తన కారును వేగంగా నడుపడంతో దాదాపు 12 మంది చిన్నారులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ బీభత్సంతో బిత్తరపోయిన పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అందులో ఒక విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా.. తీవ్ర గాయాలైన 11 మందికి ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో కేవలం విద్యార్థుల లక్ష్యంగానే అతను కారు వేగంగా నడిపినట్టు స్పష్టం చేస్తోంది. ఈ దిగ్భ్రాంతికరమైన ఘటనతో స్థానిక కౌన్సిలర్లు, ప్రజలు షాక్ తిన్నారు.


