breaking news
former governer
-
కశ్మీర్ మాజీ గవర్నర్ మాలిక్‌పై సీబీఐ చార్జిషీట్
న్యూఢిల్లీ: కిరు జలవిద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టుల విషయంలో అవినీతికి పాల్పడ్డారంటూ జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్, మరో ఏడుగురిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) గురువారం చార్జిషీట్ దాఖలు చేసింది. మాలిక్‌తోపాటు అతని అనుచరులు వీరేందర్ రానా, కన్వర్‌సింగ్ రానాలపై మూడేళ్ల విచారణ అనంతరం చార్జిషీట్‌ను స్పెషల్‌కోర్టుకు సమర్పించింది. చీనాబ్‌వాలీ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.ఎస్.బాబు, డైరెక్టర్లు అరుణ్‌కుమార్ మిశ్రా, ఎం.కె.మిట్టల్, పటేల్ ఇంజనీరింగ్ సంస్థ మేనేజిగ్ డైరెక్టర్ రుపేన్ పటేల్, మరోవ్యక్తి కన్వల్జీత్ సింగ్‌దుగ్గల్ పేర్లను కూడా చేర్చింది. ‘‘నేను గత మూడు నుండి నాలుగు రోజులుగా అనారోగ్యంతో ఉన్నాను. ఆసుపత్రిలో చేరాను. అయినప్పటికీ, ప్రభుత్వ సంస్థల ద్వారా నియంత నా ఇంటిపై దాడి చేస్తున్నాడు. నా డ్రైవర్, నా సహాయకుడిని కూడా అనవసరంగా వేధిస్తున్నారు. నేను రైతు కొడుకుని, ఈ దాడులకు నేను భయపడను. నేను రైతులతో ఉన్నాను’’ అని ఎక్స్ వేదికగా మాలిక్ గురువారం పోస్ట్ చేశారు. -
‘గత ప్రభుత్వంపై వ్యతిరేకతతో తిరస్కరణ’.. దాసోజు శ్రవణ్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమిళసై తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నతంగా ఎదగాలని మాజీ గవర్నర్‌కు దాసోజు శ్రవణ్ శుభాకాంక్షలు తెలిపారు. గత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో తన రాజకీయ భవిష్యత్‌కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని లేఖలో దాసోజు శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్‌ను గవర్నర్‌గా ఉన్న తమిళిసై తిరస్కరించిన విషయం తెలిసిందే. చదవండి: తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా -
Satya Pal Malik: మాజీ గవర్నర్ ఇంట సీబీఐ సోదాలు
ఢిల్లీ: జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను దర్యాప్తు సంస్థలు వదలడం లేదు. తాజాగా గురవారం ఆయన ఇంటితో పాటు 30 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు జరిగాయి. ఆయన జమ్ము గవర్నర్‌గా ఉన్న సమయంలో.. కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు అవినీతి జరగడం.. దానిపై కేసు నమోదు కావడమే ఇందుకు కారణం. జమ్ములో రూ. 2,200 కోట్ల విలువైన కిరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ (హెచ్ఇపి)లో పనులు కేటాయింపులో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. దాంతో ఏప్రిల్ 2022లో మాలిక్‌తో సహా ఐదుగురు వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ దర్యాప్తులో భాగంగా గురువారం ఉదయం 100 మంది అధికారులు పలు నగరాల్లో ఈ సోదాలు ప్రారంభించారని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ పరిణామాలపై సత్యపాల్ మాలిక్ ట్విటర్ ద్వారా స్పందిస్తున్నారు. ‘నేను అనారోగ్యంతో ఉన్నప్పటికీ.. నా నివాసంపై నిరంకుశ శక్తులు దాడి చేస్తున్నాయి. ఈ సోదాల ద్వారా నా డ్రైవర్, సహాయకుడిని వేధిస్తున్నాయి. ఇలాంటి వాటికి నేను భయపడను. నేను రైతులకు అండగా నిలుస్తాను’ అని వెల్లడించారు. మరో ట్వీట్లో.. అవినీతికి పాల్పడిన వారిపై నేను ఫిర్యాదు చేస్తే.. ఆ వ్యక్తుల్ని విచారించకుండా నా నివాసంపై సీబీఐ దాడులు చేస్తోంది. ఇంట్లో నాలుగైదు కుర్తాలు, పైజామాలు తప్ప మరేమీ వాళ్లకు దొరకలేదు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ఆ నియంత నన్ను భయపెట్టాలని చూస్తున్నాడు. నేను రైతు బిడ్డను. ఎవరికీ భయపడను.. తలవంచను అంటూ పోస్ట్ చేశారాయన. मैंने भ्रष्टाचार में शामिल जिन व्यक्तियों की शिकायत की थी की उन व्यक्तियों की जांच ना करके मेरे आवास पर CBI द्वारा छापेमारी की गई है। मेरे पास 4-5 कुर्ते पायजामे के सिवा कुछ नहीं मिलेगा। तानाशाह सरकारी एजेंसियों का ग़लत दुरुपयोग करके मुझे डराने की कोशिश कर रहा है। मैं किसान का… — Satyapal Malik 🇮🇳 (@SatyapalmalikG) February 22, 2024 మాలిక్.. 2018 ఆగస్టు నుంచి 2019 అక్టోబర్ వరకు జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో తన వద్దకు రెండు దస్త్రాలు వచ్చాయని, వాటిపై సంతకం చేస్తే రూ.300 కోట్లు వస్తాయని తన కార్యదర్శులు చెప్పినట్లు గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో ఒక దస్త్రం హైడ్రో ప్రాజెక్టుదని తెలిపారు. ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది ఏప్రిల్‌లో మాలిక్ చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించి రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది సీబీఐ. అందులో ఒకటి పైన చెప్పుకున్న కిరూ హైడ్రాలిక్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించింది కాగా.. , రెండోది ఇన్సూరెన్స్ స్కీమ్‌కు సంబంధించిన ఆరోపణలు. ఇన్సూరెన్స్ ఒప్పందం నేపథ్యం.. 2018లో సదరు కంపెనీ కాంట్రాక్ట్‌ను ఆ సమయంలో జమ్ము కశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సత్యపాల్ మాలిక్ ఆ ఫైల్స్‌ను స్వయంగా పర్యవేక్షించానని చెబుతూ ఒప్పందాన్ని రద్దు చేశారు. జమ్ము కశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ల కుటుంబ సభ్యుల మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్‌కు సంబంధించి స్కాం ఇది. దాదాపు మూడున్నర లక్షల ఉద్యోగులు 2018 సెప్టెంబర్‌లో ఇందులో చేరారు. అయితే.. అవకతవకలు ఉన్నాయంటూ నెలకే ఈ కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తూ సంచలనానికి తెర తీశారు అప్పుడు గవర్నర్‌గా ఉన్న సత్యపాల్ మాలిక్. ఈ బీమా పథకం ఒప్పందానికి సంబంధించిన అవినీతి కేసులో మాలిక్‌ను సీబీఐ సాక్షిగా చేర్చింది. గతంలో ఐదు గంటలపాటు విచారించింది కూడా. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో పాటు ట్రినిటీ రీఇన్సూరెన్స్ బ్రోకర్స్‌ను నిందితులుగా చేర్చింది సీబీఐ. ఇందులో మోసం జరిగిందని మాలిక్ ఆరోపించడంతో.. ఆయన నుంచి అదనపు సమాచారం సేకరించేందుకే ఆయన్ని ప్రశ్నించినట్లు సీబీఐ ప్రకటించింది. సంచలనంగా సత్యపాల్ మాలిక్ చరణ్ సింగ్ భారతీయ క్రాంతి దళ్‌తో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సత్యపాల్ మాలిక్. ఆ తర్వాత భారతీయ లోక్‌దల్ పార్టీలో చేరి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన మాలిక్.. 2012లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పని చేశారు కూడా. ఆపై బీహార్, జమ్ము కశ్మీర్, గోవా, మేఘాలయాకు గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. జమ్ము కశ్మీర్ ప్రత్యేక హోదాను కేంద్రం వెనక్కి తీసుకున్న సమయంలో ఈయనే గవర్నర్‌గా ఉన్నారు. రైతుల ఉద్యమ సమయంలో ఈయన రైతులకు మద్దతు ప్రకటించడం, కేంద్రానికి హెచ్చరికలు జారీ చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. పుల్వామా దాడి, నరేంద్ర మోదీ మీద తాజాగా (ఏప్రిల్ 14వ తేదీన) కరణ్ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనానికి తెర తీసింది. అవినీతిపై మోదీ ఎలాంటి చర్యలు తీసుకోరని, ఎందుకంటే అందులో ఆరోపణలు ఎదుర్కొనేవాళ్లు ఆయనకు సన్నిహితులేనని వ్యాఖ్యానించారు. అంతేకాదు పుల్వామా దాడి సమయంలో మోదీ, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గవర్నర్‌గా ఉన్న తనకు చేసిన సూచనలపైనా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం పుట్టించాయి. పుల్వామా దాడిలో ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని, 300 కేజీల ఆర్డీఎక్స్ పాక్ నుంచి రావడం, జమ్ము కశ్మీర్లో పది నుంచి పదిహేను రోజులపాటు చక్కర్లు కొట్టడం, దానిని అధికారులు గుర్తించలేకపోవడం పైనా మాలిక్ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. -
‘రాత్రి వేళ ఒంటరిగా పోలీస్స్టేషన్లకు వెళ్లకండి’
వారణాసి: మహిళలు చీకటి పడిన తర్వాత పోలీస్స్టేషన్లకు వెళ్లవద్దంటూ మాజీ గవర్నర్, బీజేపీ ఉపాధ్యక్షురాలు బేబీ రాణి మౌర్య హెచ్చరించారు. బజార్దిహా ప్రాంతంలోని వాల్మీకిబస్తీలో శుక్రవారం మహిళలనుద్దేశిస్తూ చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లే సమయంలో కుటుంబంలోని మగవారిని వెంట తీసుకెళ్లాలంటూ సూచించారు. ‘ఠాణాల్లో మహిళా పోలీసులు కూడా ఉంటారు. కానీ, సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత, చీకటి వేళ మహిళలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లవద్దు. అవసరమైన పక్షంలో మరుసటి రోజు ఉదయం తోడుగా సోదరుడు/ భర్త/ తండ్రిని వెంట తీసుకెళ్లండి’అని చెప్పారు. మహిళల కోసం బీజేపీ ప్రభుత్వం చేసిన కృషితో పరిస్థితి మారిందన్నారు. కాగా, రాణి మౌర్య వ్యాఖ్యలపై బీఎస్పీకి చెందిన ఎంపీ కున్వర్ డానిష్ అలీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మహిళలకు పోలీస్స్టేషన్లలో కూడా రక్షణ లేదన్న విషయం రాణి మౌర్య మాటలతో తేలిపోయిందని విమర్శించారు. -
రాజస్తాన్ మాజీ గవర్నర్ కన్నుమూత
జైపూర్: రాజస్తాన్ మాజీ గవర్నర్, రిటైర్డ్ జస్టిస్ అన్షుమాన్ సింగ్ (86) సోమవారం కన్నుమూశారు. ఆయన ఆనారొగ్య సమస్యలతో మృతి చెందినట్లు తెలుస్తోంది. 1999 నుంచి 2003 వరకు ఆయన రాజస్తాన్ గవర్నర్‌గా సేవలు అందించారు. 1998లో గుజరాత్ గవర్నర్‌గానూ ఆయన పనిచేశారు. అన్షుమాన్ 1935లో అలహాబాద్‌లో జన్మించారు. ఆయన మృతి పట్ల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సంతాపం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ, ప్రజాజీవితంలో అన్షుమాన్ సింగ్ చేసిన సహకారం ఎప్పుడూ మరువలేనిదని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు బలం చేకూర్చాలని సీఎం కోరుకున్నారు. చదవండి: West Bengal Elections 2021: సివంగి సింగిల్‌గానే వస్తుంది -
నేడు అనంతకు కొణిజేటి రోశయ్య
అనంతపురం కల్చరల్ : తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య గురువారం జిల్లాకు రానున్నట్లు జిల్లా పౌరసంబంధాల అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటలకు అనంతకు చేరుకోనున్న ఆయన, రోడ్లు, భవనాల అతిథి గహంలో బస చేస్తారు. ఉదయం 10 గంటలకు శ్రీ వాసవీ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 5.30 గంటల నుంచి స్థానిక నేషనల్ సాయిబాబా కళాశాలలోని ఇండోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. 6.30 గంటలకు టవర్‌క్లాక్ వద్ద ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించి, కొత్తూరు అమ్మవారి శాలలో జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.