breaking news
fomula one
-
పియాస్ట్రిదే పైచేయి.. 1997 తర్వాత ఇదే తొలిసారి...
ఫ్లోరిడా: గత నాలుగేళ్లు ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ సాధించిన రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్‌కు ఈ సీజన్లో తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. క్వాలిఫయింగ్ సెషన్లో అదరగొడుతున్న వెర్స్టాపెన్ను ప్రధాన రేసులో మాత్రం మెక్లారెన్ డ్రైవర్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఫార్ములావన్ 2025 సీజన్లో భాగంగా జరిగిన ఆరో రేసు మయామి గ్రాండ్‌ప్రిలో మెక్లారెన్ జట్టు డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి విజేతగా నిలిచాడు. నిర్ణీత 57 ల్యాప్‌ల రేసును పియాస్ట్రి అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 28 నిమిషాల 51.587 సెకన్లలో పూర్తి చేసి ఈ సీజన్లో నాలుగో గెలుపును, వరుసగా మూడో విజయాన్ని అందుకున్నాడు.రెండో స్థానంలో లాండో నోరిస్మెక్లారెన్కే చెందిన లాండో నోరిస్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఏడాది ఈ రేసులో విజేతగా నిలిచిన నోరిస్ ఈసారి 1 గంట 28 నిమిషాల 56.217 సెకన్లలో రేసును పూర్తి చేశాడు. మెర్సిడెస్ డ్రైవర్ జార్జి రసెల్ మూడో స్థానాన్ని పొందగా... ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ప్రపంచ చాంపియన్ వెర్స్టాపెన్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. నలుగురు డ్రైవర్లు లియామ్ లాసన్ (వీసా క్యాష్ రేసింగ్ బుల్స్), గాబ్రియెల్ బొర్టొలెటో (స్టేక్ టీమ్ కిక్ సాబెర్), ఒలివెర్ బియర్మన్ (మనీగ్రామ్ హాస్), జాక్ దూహాన్ (అల్పైన్ టీమ్) మధ్యలోనే వైదొలిగారు. లాసన్ 36వ ల్యాప్‌లో, బొర్టొలెటో 30వ ల్యాప్‌లో, బియర్మన్ 27వ ల్యాప్‌లో, దూహాన్ తొలి ల్యాప్‌లో తప్పుకున్నారు.1997 తర్వాత తొలిసారి... నాలుగో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన పియాస్ట్రి ఆరంభంలో వెనుకబడ్డాడు. అయితే 14వ ల్యాప్‌లో వెర్స్టాపెన్ను వెనక్కి నెట్టి ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని చివరిదాకా కాపాడుకొని చాంపియన్‌గా నిలిచాడు. తద్వారా 1997 తర్వాత ఫార్ములావన్‌లో వరుసగా మూడు రేసుల్లో నెగ్గిన మెక్లారెన్ డ్రైవర్‌గా పియాస్ట్రి గుర్తింపు పొందాడు. చివరిసారి మెక్లారెన్ తరఫున మికా హకినెన్ ఈ ఘనత సాధించాడు.1997 సీజన్ చివరి రేసులో నెగ్గిన హకినెన్ 1998 సీజన్‌లోని తొలి రెండు రేసుల్లోనూ విజేతగా నిలిచాడు. ఇక 24 రేసుల తాజా సీజన్లో ఆరు రేసులు ముగిశాక ఆస్కార్ పియాస్ట్రి 131 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక 115 పాయింట్లతో నోరిస్ రెండో స్థానంలో, 99 పాయింట్లతో వెర్స్టాపెన్ మూడో స్థానంలో నిలిచారు. కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్‌లో మెక్లారెన్ 246 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. సీజన్‌లోని తదుపరి రేసు ఎమిలియా రొమాగ్నా గ్రాండ్‌ప్రి (ఇటలీ) ఈనెల 18న జరుగుతుంది. -
Monaco Grand Prix: విజేత వెర్స్టాపెన్
మోంటెకార్లో: తన కారులో తలెత్తిన సాంకేతిక లోపంతో ‘పోల్ పొజిషన్’ సాధించిన చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ) రేసు ఆరంభానికి ముందే తప్పుకోవడంతో... తొలి స్థానం నుంచి రేసును ఆరంభించిన మ్యాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) మొనాకో గ్రాండ్‌ప్రిలో అదరగొట్టాడు. ఆదివారం జరిగిన 78 ల్యాప్‌ల ప్రధాన రేసులో ఎక్కడా తడబడకుండా డ్రైవ్ చేసిన వెర్స్టాపెన్... అందరికంటే ముందుగా గంటా 38 నిమిషాల 56.820 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. ఇక సీజన్లో వెర్‌స్టాపెన్‌కు ఇది రెండో విజయం. కార్లోస్ సెయింజ్ (ఫెరారీ) రెండో స్థానంలో నిలువగా... హామిల్టన్ (మెర్సిడెస్) ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. సీజన్లో తదుపరి గ్రాండ్‌ప్రి అజర్బైజాన్ వేదికగా జూన్ 6న జరగనుంది. చదవండి: Asian Boxing Championship: భారత్‌కు 7 పతకాలు ఖాయం This way to the 🔝 of the standings ➡️🏆 #MonacoGP 🇲🇨pic.twitter.com/CEiSv1bK4o — Red Bull Racing Honda (@redbullracing) May 23, 2021 No floating energy station this year but still plenty of 𝒕𝒉𝒊𝒔 ENERGY!!! 🙌 #MonacoGP 🇲🇨 #GivesYouWings pic.twitter.com/Rh8a5WGmKP — Red Bull Racing Honda (@redbullracing) May 23, 2021 -
విశ్వవిజేత ఎవరో?
మెక్సికో: గతేడాది ఫార్ములావన్ గ్రాండ్ ప్రిలో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సునాయాసంగా దక్కించుకున్న మెర్సిడెస్ జట్టుకు చెందిన బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్.. ఈ ఏడాది ఆ టైటిల్‌ను మరోసారి నిలబెట్టుకోవడానికి శ్రమించక తప్పడంలేదు. తన సహచర డ్రైవర్ నికో రోస్ బర్గ్ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నాడు. ఆదివారం జరిగిన మెక్సికో ఫార్ములావన్ రేసులో హామిల్టన్ టైటిల్ సాధించినా.. ఆ తరువాత రెండో స్థానంలో మెర్సిడెస్ కే చెందిన నికో రోస్ బర్గ్ నిలిచాడు. ఈ 71 ల్యాప్‌ల ప్రధాన రేసును పోల్ పొజిషన్‌తో ఆరంభించిన హామిల్టన్.. అందరికంటే వేగంగా గమ్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు. దాంతో ఈ సీజన్ ఫార్ములావన్‌లో హామిల్టన్ 330 పాయింట్లకు చేరగా, రెండో స్థానంలో నిలిచి రోస్ బర్గ్ 349 పాయింట్లతో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బ్రెజిల్, అబుదాబి గ్రాండ్ ప్రిలో మాత్రమే మిగిలి ఉండటంతో హామిల్టన్ ఆ రెండు రేసుల్లో విజేతగా నిలిస్తే వరల్డ్ టైటిల్‌ను మరోసారి దక్కించుకుంటాడు. అదే క్రమంలో రోస్ బర్గ్ రెండో స్థానంలో నిలవకూడదు. ఒకవేళ ఆ రెండు రేసుల్లో రెండో స్థానంలో రోస్ బర్గ్ నిలిచిన పక్షంలో టైటిల్ అతనికే దక్కుతుంది. ఒక ఫార్మాలావన్ రేసులో తొలి స్థానంలో నిలిచిన డ్రైవర్‌కు 25 పాయింట్లు అతని ఖాతాలో చేరతాయి. అదే సమయంలో రెండో స్థానంలో నిలిచిన డ్రైవర్‌కు 18 పాయింట్లు వస్తాయి. ఆ లెక్కన హామిల్టన్ మిగతా రెండు రేసుల్లో విజేతగా నిలిస్తే 380 పాయింట్లు అవుతాయి. అప్పుడు రోస్ బర్గ్ రెండో స్థానంలో నిలిస్తే 384 పాయింట్లు అతని ఖాతాలోకి వస్తాయి. దాంతో ఆ రెండు రేసుల్లో విజయం హామిల్టన్ ఎంత ముఖ్యమో? అదే క్రమంలో రోస్ బర్గ్ రెండో స్థానంలో నిలవడం కూడా అంతే ముఖ్యం. మరోవైపు ఆ రెండు రేసుల్లో రోస్ బర్గ్ ఒకదాంట్లో విజయం సాధిస్తే ప్రపంచ చాంపియన్ అవుతాడు. గతేడాది మూడు రేసులు మిగిలి ఉండగానే హామిల్టన్ విశ్వ విజేతగా నిలవడంతో.. ఆ టైటిల్‌ను మూడుసార్లు సాధించి దిగ్గజాల సరసన నిలిచాడు. అప్పుడు హామిల్టన్ 327 పాయింట్లతోనే ప్రపంచ చాంపియన్‌షిప్ ను కైవసం చేసుకున్నాడు. గత సీజన్లో 247పాయింట్లు సాధించిన రోస్ బర్గ్.. ఈ సీజన్లో మాత్రం అంచనాలకు మించి రాణిస్తున్నాడు. ఇప్పటివరకూ తొమ్మిది రేసుల్లో రోస్ బర్గ్ విజయం సాధించగా, హామిల్టన్ ఎనిమిదింట్లో మాత్రం గెలుపు దక్కించుకున్నాడు. దాంతో ఇరువురి మధ్య హోరాహోరీగా సాగుతున్న ఈ పోరులో విశ్వ విజేతగా ఎవరు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.