breaking news
fizal
-
వైకుంఠపాళి గొడవ.. అన్నను చంపిన బాలుడు
-
వైకుంఠపాళి గొడవ.. బాలుడు మృతి
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు అన్నదమ్ములు సరదాగా ఆడుకుంటుండగా తలెత్తిన వివాదం ఒకరి ప్రాణం తీసింది. వివరాలు.. మీర్‌చౌక్ ప్రాంతానికి చెందిన అబ్దుల్, ఫైజల్(14) అనే ఇద్దరు బాలలు.. స్నేక్-లాడర్ గేమ్ ఆడుతుండగా గొడవపడ్డారు. గేమ్‌లో ఓడిపోయిన అబ్దుల్ కోపంతో ఫైజల్‌పై పిడిగుద్దులతో దాడిచేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఫైజల్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య తలెత్తిన చిన్న తగాదాలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం తల్లిదండ్రులను తీవ్రంగా కలచివేస్తోంది. పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారన్న విషయాన్ని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని నిపుణులు సూచిస్తున్నారు.