breaking news
five girls
-
ఈ ఇల్లు పాఠాలు నేర్పుతుంది
తల్లిదండ్రులు మడావి లక్ష్మణ్, కమలాబాయిలతో టీచరు ఉద్యోగం సాధించిన కుమార్తెలు కవిత, దివ్య, కళ్యాణి, టీచర్ కావడమే లక్ష్యమంటున్న చిన్నకుమార్తె కృష్ణప్రియ (కుడి చివర) ‘ఎంత మంది పిల్లలు?’ అనే ప్రశ్న వినిపించినప్పుడల్లా లక్ష్మణ్ గుండెల్లో రైళ్లు పరుగెత్తినంత పనయ్యేది. ఎందుకంటే...‘నాకు అయిదుగురు ఆడపిల్లలు’ అనే మాట లక్షణ్ నోటినుంచి వినిపించడమే ఆలస్యం ‘అయ్యో!’ అనే అకారణ సానుభూతి వినిపించేది. ‘ఇంట్లో ఒకరిద్దరు ఆడపిల్లలు ఉంటేనే కష్టం. అలాంటిది అయిదుగురు ఆడపిల్లలంటే మాటలా! నీ కోసం చాలా కష్టాలు ఎదురుచూస్తున్నాయి’ అనేవాళ్లు. అయితే వారి పెదవి విరుపు మాటలు, వెక్కిరింపులు తనపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించలేకపోయాయి. ఈ ఇల్లు పిల్లలకు బడి పాఠాలు చెప్పే ఇల్లే కాదు... ఆడపిల్లల్ని తక్కువ చేసి చూసేవారికి గుణపాఠాలూ చెబుతుంది.ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు చెందిన మడావి లక్ష్మణ్ బాల్యమంతా పేదరికంలోనే గడిచింది. ఆదివాసీ తెగకు చెందిన లక్ష్మణ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడైన తరువాత ఆర్థిక కష్టాలు తీరాయి. లక్ష్మణ్– కమలాబాయి దంపతులకు మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది.‘ఆడపిల్ల ఇంటికి అదృష్టం’ అన్నారు చుట్టాలు పక్కాలు, పెద్దలు.రెండోసారి ఆడపిల్ల పుట్టింది. వాతావరణంలో కాస్త మార్పు వచ్చింది. ‘మళ్లీ ఆడపిల్లేనా!’ అన్నారు.‘ఇద్దరు పిల్లలు చాలు’ అనుకునే సమయంలో ‘లేదు... లేదు... అబ్బాయి కావాల్సిందే’ అని పట్టుబట్టారు ఇంటి పెద్దలు.మూడో సారి... అమ్మాయి. ‘ముత్యాల్లాంటి ముగ్గురు పిల్లలు చాలు’ అనుకునే లోపే....‘అలా ఎలా కుదురుతుంది....అబ్బాయి...’ అనే మాట మళ్లీ ముందుకు వచ్చింది.నాల్గోసారి... అమ్మాయి.‘ఇక చాలు’ అని గట్టిగా అనుకున్నా సరే... పెద్దల ఒత్తిడికి తలవొంచక తప్పలేదు.‘ఆరు నూరైనా ఈసారి కొడుకే’ అన్నారు చాలా నమ్మకంగా పెద్దలు. దేవుడికి గట్టిగా మొక్కుకున్నారు.అయిదోసారి... అమ్మాయి. ‘అయ్యయ్యో’ అనే సానుభూతులు ఆకాశాన్ని అంటాయి. అయితే లక్ష్మణ్, కమలాబాయి దంపతులు ఎప్పుడూ నిరాశపడలేదు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయినప్పటికీ ఖర్చులకు సరిపడా జీతం రాకపోవడంతో ఖర్చులు పెరిగాయి. ‘ఎంత ఖర్చు అయినా, అప్పు చేసైనా సరే పిల్లలను బాగా చదివించాలి’ అని గట్టిగా నిర్ణయించుకున్నాడు లక్ష్మణ్. పిల్లల్ని చదివించడమే కాదు ఆడపిల్లలు అనే వివక్ష ఎక్కడా ప్రదర్శించేవారు కాదు. ఆటల్లో, పాటల్లో వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేవారు. పిల్లలు బాగా చదువుకోవాలంటే బెత్తం పట్టుకోనక్కర్లేదు. వారికి నాలుగు మంచి మాటలు చెబితే సరిపోతుంది. ఆ మాటే వారికి తిరుగులేని తారకమంత్రం అవుతుంది.అయిదుగురు పిల్లల్ని కూర్చోపెట్టుకొని ‘‘అమ్మా... మీ నాయిన టీచర్. మా నాయినకు మాత్రం చదువు ఒక్క ముక్క కూడా రాదు. నాకు మాత్రం సదువుకోవాలనే బాగా ఇది ఉండే. అయితే మా కుటుంబ పరిస్థితి చూస్తే... ఇంత దీనమైన పరిస్థితుల్లో సదువు అవసరమా అనిపించేది. ఎందుకంటే సదువుకోవాలంటే ఎంతో కొంత డబ్బు కావాలి. ఏ రోజుకు ఆరోజే బువ్వకు కష్టపడే మా దగ్గర డబ్బు ఎక్కడిది! అయినా సరే సదువుకోవాలని గట్టిగా అనుకున్నాను. ఎన్నో కష్టాలు పడ్డాను...’ అని నాన్న చిన్నప్పుడు చెప్పిన మాటలు పిల్లలపై బలమైన ప్రభావాన్ని చూపాయి. వారు చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ఆ ఫలితం వృథా పోలేదు.ఇప్పుడు...రెండో కూతురు కవిత, మూడో కూతురు దివ్య, నాల్గో కూతురు కళ్యాణి ప్రభుత్వ ఉపాధ్యాయులు. చిన్న కూతురు కృష్ణప్రియ కొద్ది మార్కుల తేడాతో టీచర్ అయ్యే చాన్స్ మిస్ అయింది. అక్కలలాగే టీచర్ కావాలని కలలు కంటున్న కృష్ణప్రియకు మరోప్రయత్నంలో తన కల నెరవేర్చుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. అప్పుడు ఒకే ఇంట్లో నలుగురు టీచర్లు!ఇంటర్ వరకు చదివిన పెద్ద కూతురు రత్నకుమారి చెల్లెళ్ల స్ఫూర్తితో పై చదువులు చదవాలనుకుంటోంది. వారిలాగే ఒక విజయాన్ని అందుకోవాలనుకుంటుంది. ఇప్పుడు లక్ష్మణ్‌ను చూసి జనాలు ఏమంటున్నారు? ‘నీకేమయ్యా... ఇంటినిండా టీచర్లే!’ ‘మీది టీచర్స్ ఫ్యామిలీ’నాన్న మాటలుతల్లిదండ్రులు మమ్మల్ని ఎప్పుడూ చిన్నచూపు చూడలేదు. వారి ఆశీర్వాద బలంతోనే టీచర్ అయ్యాను. ‘చదువే మన సంపద’ అని నాన్న ఎప్పుడూ చెబుతుండే వాడు. ఆయన మాటలు మనసులో నాటుకు΄ోయాయి.– కవిత, రెండో కుమార్తెనేను టీచర్... అక్కహెడ్మాస్టర్అక్క కవితకు, నాకు ఒకేసారి ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం నేను జైనూర్ మండలం జెండాగూడలో ఎస్జీటీగా పనిచేస్తున్నాను. మా స్కూలుకు అక్క కవితనే ప్రధానో΄ాధ్యాయురాలు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన మేము ఇప్పుడు ఒకే బడిలో పనిచేస్తుండటం సంతోషంగా ఉంది.– దివ్య, మూడో కుమార్తెఆరోజు ఎంత సంతోషమో!మొన్నటి డీఎస్సీలో టీచర్ ఉద్యోగం వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో నాకు ΄ోస్టింగ్ ఇచ్చారు. మొన్ననే విధుల్లో చేరాను. టీచర్‌గా మొదటి రోజు స్కూల్‌కి వెళ్లినప్పుడు నాకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. ‘మా ముగ్గురు పిల్లలు టీచర్లే అని ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటాను’ అంటున్నాడు నాన్న.– కళ్యాణి, నాలుగో కుమార్తెటీచర్ కావడమే నా లక్ష్యంఅక్క కళ్యాణితో కలిసి నేను కూడా మొన్నటి డీఎస్సీ పరీక్ష రాశాను. కొద్ది మార్కుల తేడాతో నాకు ఉద్యోగం చేజారింది. అయితే నా లక్ష్యాన్ని మాత్రం వీడను. ఎలాగైనా టీచర్ కొలువు సాధిస్తాను.– కృష్ణప్రియ, ఐదో కుమార్తె – గోడిసెల కృష్ణకాంత్, సాక్షి, ఆదిలాబాద్ఫొటోలు: చింతల అరుణ్ రెడ్డి -
చెరువులో పడి ఐదుగురు బాలికలు మృతి
ముంబై: ప్రమాదవశాత్తు చెరువలో పడి ఐదుగురు బాలికలు మరణించిన ఘటన మహారాష్ట్రలోని జల్నా జిల్లా భోకార్డన్ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రోజున తలేగావ్ వాడీ గ్రామానికి చెందిన ఆరుగురు బాలికలు కలిసి బట్టలు ఉతికేందుకు సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ చెరువులోకి దిగిన ఐదుగురు బాలికలు ప్రమాదవశాత్తు చెరువు పూడికలో చిక్కుకుపోయారు. అటుగా వెళ్తున్న వారు బాలికల్ని రక్షించడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. చదవండి: ‘అమ్మ’మ్మలే హతమార్చారు.. పూడికలో చిక్కుకుపోయిన బాలికలను బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా.. వారు అప్పటికే మృతిచెందినట్లు ఫూలంబ్రీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారులు తెలిపారు. దీంతో ఐదుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా.. మరణించిన బాలికలను అశుబీ లతీఫ్ పఠాన్ (6), నబియా నవాజ్ పఠాన్ (6), అల్ఫియా గౌస్ ఖాన్ పఠాన్ (7), సానియా అస్లాం పఠాన్ (6), షాబు అస్లాం పఠాన్ (5)గా గుర్తించారు. చదవండి: నదిలో మునిగి 8 మంది విద్యార్థుల మృతి -
అదృశ్యమైన యువతులుగుంటూరులో ప్రత్యక్షం
పెనమలూరు, న్యూస్‌లైన్ : స్థానిక నవజీవన్ బాలభవన్ హాస్టల్ నుంచి ఆదివారం అదృశ్యమైన ఐదుగురు యువతులు గుంటూరులో ప్రత్యక్షమయ్యారు. బాలభవన్ నిర్వాహకులు వారిని పెనమలూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి సీఐ ధర్మేంద్ర ఎదుట హాజరుపరిచారు. తమకు హాస్టల్ జీవితం నచ్చలేదని, బయట స్వేచ్ఛగా జీవించాలనే ఉద్దేశంతో వెళ్లిపోయామని ఆ యువతులు వివరించారు. వివరాలిలా ఉన్నాయి. పెనమలూరులోని నవజీవన్ బాలభవన్ ఆధ్వర్యంలో అనాథ బాలికలు, యువతుల సంక్షేమార్థం ఏర్పాటుచేసిన హాస్టల్లో మొత్తం 19 మంది ఉంటున్నారు. గత ఆదివారం వారిలో ఐదుగురు యువతులు ఎం.రమణ, ఎస్.లక్ష్మి, ఎన్.గాయత్రి, ఎం.సంతోషి, కె.కావ్య హాస్టల్ నుంచి పారిపోయారు. ఈ ఘటనతో తీవ్ర కలకలం రేగింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మరోపక్క హాస్టల్ నుంచి బయటికొచ్చిన యువతులు ఆదివారం నాడే విజయవాడ రైల్వేస్టేషన్‌కు వెళ్లి రెలైక్కి హైదరాబాదు వెళ్లారు. అక్కడ ఎటువెళ్లాలో తెలీక వెయిటింగ్ హాల్లోనే ఉండిపోయారు. వారిలో ఓ యువతి బంధువులకు ఫోన్‌చేసి తాము హైదరాబాదులో ఉన్నామని తెలిపింది. వారు నచ్చచెప్పటంతో మంగళవారం ఆ యువతులు శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కి గుంటూరుకు చేరారు. ఈ సమాచారం తెలుసుకున్న బాలభవన్ నిర్వాహకులు గుంటూరు రైల్వేస్టేషన్ నుంచే వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. మేము హాస్టల్లో ఉండం... తాము నవజీవన్ హాస్టల్లో ఉండబోమని యువతులు సీఐ ధర్మేంద్ర ఎదుట తేల్చిచెప్పారు. తాము ఉద్యోగం చేసుకుని స్వేచ్ఛగా బయటే ఉంటామని తెలిపారు. హాస్టల్ జీవితం తమకు ఇష్టం లేదని వివరించారు. స్వేచ్ఛగా జీవించేలా తమకు న్యాయం చేయాలని కోరారు. సీఐ కౌన్సెలింగ్ ఈ నేపథ్యంలో యువతులకు సీఐ ధర్మేంద్ర ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆడపిల్లలు బయట ఒంటరిగా ఉంటే మంచిది కాదన్నారు. హాస్టల్లో ఉండటం ఇష్టం లేకపోతే చైల్డ్‌లైన్‌లో ఉండమని వారికి నచ్చచెప్పారు. అనంతరం వారి వద్ద స్టేట్మెంట్లు తీసుకుని చైల్డ్‌లైన్‌కు పంపించారు.