breaking news
	
		
	
  Fisherman nest
- 
      
                   
                               
                   
            రుషికొండ తీరంలో బ్లూ రింగ్ యాంగిల్ ఫిష్
సాగర్‌నగర్(విశాఖ తూర్పు) : ప్రకృతి సహజ అందాలకు నిలయమైన రుషికొండ సముద్ర తీరంలో శనివారం అరుదై న, అందమైన బ్లూ రింగ్ యాంగిల్ ఫిష్ మత్స్యకారులకు చి క్కింది. సాధారణంగా విదేశీ సముద్ర తీరాల్లో సముద్ర మట్టానికి వంద మీటర్లు లోతులో నాచురాళ్లు మధ్య విహరిం చే అందమైన ఈ చేప వాడపాలెం వాడబలిచి మత్స్యకారుల వలకు చిక్కింది. వారి వేటలో భాగంగా పడిన చేపల్లో బ్లూరింగ్ యాంగిల్ ఫిష్ ఆకర్షణీయంగా కన్పించడంతో స్థానిక మత్స్యకారులు, పర్యాటకులు వింతగా తిలకించారు. సాధారణంగా ఇక్కడి రేవులకు ఈ తరహా చేపలు రావు. చేప శరీరమంతా తాబేలు ఆకారంలో ఉంది. దీని తోక తెల్లగా అందంగా కన్పిస్తోంది. శరీరంపై బ్లూ కలర్ చారలతో ఆకర్షణీయంగా, వింతగా కనిపిస్తోంది. పెద్ద కళ్లు కలిగిన చేప వలకు చిక్కిన వెంటనే చనిపోయిందని మత్స్యకారులు తెలిపారు. ఈ తరహా చేపలు విశాఖ తీరానికి రావడం చాలా అరుదని, ఎక్కువగా విదేశీ రేవుల్లో లభిస్తాయని మత్స్యకార శాఖ అధికారిణి విజయ తెలిపారు. - 
      
                    
అబ్బో ఎంత పెద్ద చేపో..!

 మండలంలోని పొందుగల సమీపంలోని కృష్ణానదిలో వలకు 50 కేజీల ఆదివారం దొరికింది. తండా బుడేసాతో పాటుగా మరికొంత మంది నదిలో చేపల వేటకు వెళ్లారు. వీరు వేసిన వలకు ఈ చేప దొరికింది. దానిని గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు.
 – పొందుగల(దాచేపల్లి)
 


