breaking news
FDA Inspection
-
లంచగొండి ఆఫీసర్‌కు చుక్కలు చూపించిన జనం!
దేశవ్యాప్తంగా ఆహార భద్రత తనిఖీలు ముమ్మరంగా సాగుతున్న వేళ.. ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రైడ్‌కు వెళ్లిన అధికారి లంచం తీసుకున్నాడని ఆరోపిస్తూ జనం భలే శిక్ష విధించారు. అక్కడ తప్పు జరగలేదని ఆ అధికారి బుకాయించే యత్నం చేయగా.. అది కరెక్ట్ అయితే నిరూపించమంటూ ఒత్తిడి చేశారు. దీంతో ఆ అధికారి నీళ్లు మింగాల్సి వచ్చింది. తుకారాం ముండే ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్రలో ఫుడ్ సేఫ్టీ విషయంలో ఆయన నేతృత్వంలో జరుగుతున్న సోదాలు.. తీసుకుంటున్న చర్యలు.. కంట్రోల్లో ఉండాలంటూ కోర్టులు ఆదేశిస్తూ ఆయన వ్యవహరిస్తున్న తీరూ.. ఇవన్నీ నిత్యం వార్తల్లో నిలుస్తున్నవే. అలాంటి రాష్ట్రంలోనే తాజాగా జరిగిన ఓ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. ఛత్రపతి సంభాజీనగర్‌లో వైజాపూర్ ఏరియాలో ఓ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారికి చేదు అనుభవం ఎదురైంది. తనిఖీల్లో పట్టుబడిన ఎక్స్పైరీ(కాలం చెల్లినవి) బిస్కెట్లను అధికారితోనే తినిపించేందుకు స్థానికులు ప్రయత్నించడం నెట్టింట వైరల్ అయ్యింది. ఓ దుకాణదారుడిని కాపాడే క్రమంలో ఆయన లంచం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జనం ఈ పని చేయబోయారు. స్థానికంగా ఓ దుకాణంలో తినుబండారాలు తిన్న రెండేళ్ల చిన్నారి అస్వస్థతకు గురైంది. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎఫ్‌డీఏ అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు నేపథ్యంలో ఓ అధికారి దుకాణాన్ని తనిఖీ చేయడానికి వెళ్లగా.. అప్పటికే చిన్నారి తిన్నట్లు చెబుతున్న స్నాక్ మిక్స్‌ను దుకాణం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.CHHATRAPATI SAMBHAJINAGAR — An FDA officer was cornered and forcibly fed expired biscuits by an angry crowd in the Vaijapur area of Maharashtra. pic.twitter.com/Pq5rUfBenO— Truth India Live (@Truthindialive) August 29, 2026అయితే తనిఖీల్లో కొన్ని ఎక్స్పైరీ బిస్కెట్ ప్యాకెట్లు బయటపడ్డాయట. వాటిని తమ వాహనంలో పెట్టిన అధికారులు.. ఎలాంటి చర్యలు తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన జనం.. ఆ అధికారి చుట్టూ చేరారు. దుకాణానికి సీజ్ వేయకుండా ఎందుకు వెళ్లిపోతున్నారంటూ నిలదీశారు. దానికి ఆ అధికారి తనిఖీల్లో ‘అంతా సవ్యం’గానే ఉందని చెప్పాడు. దీంతో వాహనం నుంచి ఆ బిస్కెట్లను తీసుకున్న స్థానికులు ‘బిస్కెట్లు సురక్షితమే అయితే మీరే తినండి’ అంటూ నోట్లో కుక్కేందుకు ప్రయత్నించారు. దాంతో నమల్లేక.. మింగలేక.. కక్కలేక ఆ అధికారి పడ్డ అవస్థలు పడ్డ వీడియో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో ప్రస్తుతం FDA కమిషనర్ తుకారాం ముండే నేతృత్వంలో ఆహార భద్రతపై భారీ స్థాయిలో తనిఖీలు, దాడులు జరుగుతున్నాయి. రెస్టారెంట్లు, హోటళ్లు, డెయిరీలు, క్యాంటీన్లు, ఫుడ్ డెలివరీ సంస్థలు సహా వివిధ ఆహార వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉల్లంఘనలు గుర్తిస్తే లైసెన్సులు సస్పెండ్ చేయడం, నోటీసులు ఇవ్వడం వంటి చర్యలు చేపడుతున్నారు. ఈ తరుణంలో ఆహార భద్రతను కాపాడాల్సిన అధికారులపై ఇలాంటి ఆరోపణలు రావడం, అదే సమయంలో ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అధికారిని అవమానించే స్థాయికి వెళ్లడం కలకలం రేపింది.ఇదీ చదవండి: ఆ పుస్తకం చదవాల్సిన అవసరం ఏమొచ్చింది? -
3 నెలల్లోనే చుక్కలు చూపిస్తున్నాడుగా.. పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా?
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కమీషనర్ , ఐఏఎస్ (IAS) అధికారి తుకారాం ముండే తన చర్యలతో రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్నారు. ఫుడ్ సేఫ్టీ విషయంలో ఎక్కడా రాజీపడకుండా పరిశుభ్రత , ఆహార భద్రతా ప్రమాణాలను పాటించని రెస్టారెంట్లు, ఐస్‌క్రీమ్ పార్లర్లు, డెయిరీలు ,ఈ-కామర్స్ సంస్థలపై విస్తృతమైన దాడులతో కొరడా ఝళిపిస్తున్నారు. లైసెన్సుల రద్దు లాంటి చర్యలపై వస్తున్న విమర్శలను కూడా లెక్క చేయకుండా ఫుడ్ సంస్థలకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నప్పుడు తక్షణమే చర్యలు తీసుకునే అధికారం FDAకి ఉందని ఆయన సమర్థించుకున్నారు.ఆహార కల్తీ, పరిశుభ్రత మరియు లైసెన్స్ లేని వ్యాపారాలపై చేపట్టిన వార్తల్లో నిలిచారు.ఇంతకీ ఎవరీ తుకారాం ముండే పదండి తెలుసుకుందాం.ఒక స్నేహితుడితో కలిసి రెస్టారెంట్ విందుకెళ్లారు. అప్పుడే ఆ రెస్టారెంట్లో ఎఫ్‌డీఏ నిబంధనలు అమలు కావడం లేదని, తప్పనిసరిగా ప్రదర్శించాల్సిన ఆహార భద్రతా లైసెన్స్ స్పష్టంగా కనిపించేలా ఉంచలేదని గమనించారు. అలాగే, అక్కడ తాగునీటి ఏర్పాట్ల గురించి కూడా ఆయన ఆరా తీశారు. ఆ తర్వాత స్నేహితుడు ఆర్డర్ చేసిన పనీర్ నిజమైందా? కృత్రిమైందా (అనలాగ్) అని ప్రశ్నించారు. చివరికి అది నకిలీది అని తేల్చారు. అంతే 24 గంటల్లో నగరంలో వివిధ దుకాణాల్లో తనిఖీలు మొదలైనాయి.మెరుపు దాడులతో ప్రముఖ రెస్టారెంట్లు, ఐస్‌క్రీమ్ పార్లర్లు, ఇలా ఒక్కటనేమిటి జెప్టో, బ్లింకిట్‌కు చెందిన ఔట్లెట్లకు చుక్కలు చూపించారు. ఈ దాడుల్లో ఎక్కడ చూసినా అపరిశుభ్రత, గడుపు తీరిన పదార్థాలు, బొద్దింకలు, బల్లులు, ఎలుకల మయంతో కూడిన వాతావరణాన్ని అధికారులు గుర్తించారు. దీంతో గత రెండు నెలల్లో అధికారులు 3,100కు పైగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో సుమారు 165 లైసెన్సులు రద్దు చేయగా, 750కి పైగా సంస్థలకు లోపాలను సరిదిద్దుకోవాలంటూ నోటీసులు జారీ చేశారు.ఇటీవల నాగ్‌పూర్ మరియు సోలాపూర్లలో అక్రమ అబార్షన్ మందుల రాకెట్‌ను గుట్టురట్టు చేసి, ఆన్లైన్ పోర్టల్ ఇండియామార్ట్ (IndiaMART) డైరెక్టర్లతో సహా ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. దీంతో పలువర్గాలనుంచి ఆయనపై ప్రశంసలు లభించాయి.మరోవైపు ఈ దాడులపై విమర్శలు కూడా చెలరేగాయి. అయితే తన ప్రజాదరణను పెంచుకోవడానికే ఈ ప్రచారం చేస్తున్నారన్న వాదనను కూడా ఆయన తోసిపుచ్చారు. ఇది తగిన చర్యగా అనిపించకపోతే, అసలు ప్రోపర్ యాక్షన్ (proportionate action) అంటే ఏమిటో నాకైతే తెలియదు," అని ముండే వ్యాఖ్యానించారు. ఇది తన గురించి కాదనీ, ఆహార రంగానికి, ఆహార భద్రతకు , ఆహార ప్రమాణాలకు సంబంధించిన విషయమని 'NDTV ప్రాఫిట్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు.ఇదీ చదవండి: 33 ఏళ్ల సుదీర్ఘ సేవలు : ప్రొఫెసర్‌కు సర్ప్రైజ్ ఎమోషనల్ వీడియోఇదీ చదవండి: బ్లింకిట్, జెప్టో, ఇన్‌స్టామార్ట్ కాదు : బొద్దింకలు, ఎలుకలు, బల్లుల కేంద్రాలురాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా?చట్టాలను కచ్చితంగా అమలు చేసే అధికారిగా పేరుపొందిన ఆయన, రాజకీయాల్లోకి వస్తారా అని అడిగిన ప్రశ్నకు "ఖచ్చితంగా రాను (Absolutely not)" అని స్పష్టం చేశారు. తన లాంటి ముక్కుసూటి, నిజాయితీ గల వ్యక్తులకు రాజకీయాలు సరిపడవని పేర్కొన్నారు. కొందరు తనను "అహంకారి" అని పిలుస్తారని, అయితే ముక్కుసూటితనానికి మరియు అహంకారానికి మధ్య చాలా సన్నని గీత ఉంటుందని, అది తన సహజ సిద్ధమైన నైజమని తెలిపారు. 21 ఏళ్ల కెరీర్లో 25 సార్లు బదిలీలు అయ్యాయనీ అయినా తన నిబద్ధతలో మార్పులేదని చెప్పుకొచ్చారు. ఎక్కువ బదిలీలు జరిగితే సమాజంలో సానుకూల మార్పులు తీసుకు రావడానికి మరిన్ని ఎక్కువ అవకాశాలు లభిస్తాయని ముండే చెప్పడం గమనార్హం. ఇదీ చదవండి: రెండు రోజుల్లో బర్త్‌డే : 11 నెలల చిన్నారిని యమునలో విసిరేసిన తండ్రి -
మెక్‌డొనాల్డ్స్‌కు వార్నింగ్ నోటీసు
ముంబై : మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లు తీవ్ర వివాదంలో కూరుకుపోతున్నాయి. ఓ వైపు కన్నాట్ ప్లాజా రెస్టారెంట్ల(సీపీఆర్ఎల్) 50:50 జాయింట్ వెంచర్ విక్రమ్ బక్షితో వివాదం, మరోవైపు ఆ రెస్టారెంట్లలో ఆహార భద్రత ప్రమాణాల ఉల్లంఘన మెక్‌డొనాల్డ్స్‌ను ఇరకాటంలో పడేస్తున్నాయి. తాజాగా ముంబైలోని సెంట్రల్ రీజన్లో గల మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌పై స్టేట్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) జరిపిన అకస్మిక దాడిలో, ఆ అవుట్లెట్ ఆహార భద్రతా ప్రమాణాలను పాటించడం లేదని తేలింది. అకస్మాత్తుగా జరిపిన తనిఖీలో హైస్ట్రీట్ ఫీనిక్స్‌లోని మెక్ డొనాల్డ్స్ అవుట్లెట్ ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని ఉల్లంఘించిందని తేలిందని ఎఫ్‌డీఏ రిపోర్టు చేసింది. అనారోగ్య పరిస్థితుల్లో ఆహారాన్ని వండుతున్నారని, తమ లైసెన్సు కాఫీని కూడా ప్రాముఖ్యంగా చూపించడం లేదని పేర్కొంది. ఈ రెస్టారెంట్ చైన్‌కు ప్రస్తుతం వార్నింగ్ నోటీసు జారీచేశామని, ఒకవేళ పరిస్థితులు మెరుగుపడకపోతే, వచ్చే 15 రోజుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. సౌత్, వెస్ట్ రాష్ట్రాల్లో మెక్‌డొనాల్డ్స్ ఫ్రాంచైజీని హార్డ్‌క్యాసిల్ రెస్టారెంట్లు నిర్వహిస్తున్నాయి. వారు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఎఫ్‌డీఏ నుంచి కొన్ని ప్రశ్నలను ఎదుర్కొన్నామని, వాటికి సమాధానాలను కూడా ఎఫ్‌డీఏకి సమర్పించామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. -
దివీస్ లాభం 9 శాతం అప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో దివీస్ ల్యాబ్స్ నికర లాభం 9 శాతం పెరిగి రూ. 268 కోట్లకు చేరింది. ఇక ఆదాయం రూ. 860 కోట్ల నుంచి రూ. 976 కోట్లకు పెరిగింది. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 మధ్య కాలంలో తమ విశాఖపట్నం ప్లాంట్‌లోని రెండో యూనిట్లో అమెరికా ఎఫ్‌డీఏ తనిఖీలు నిర్వహించినట్లు సంస్థ తెలిపింది. ఎఫ్‌డీఏ సూచనలకు సంబంధించి తాము చేపట్టిన దిద్దుబాటు చర్యలు మొదలైన వాటి గురించి ఇప్పటికే వివరణనిచ్చినట్లు పేర్కొంది. తదుపరి ఎఫ్‌డీఏ స్పందన కోసం ఎదురుచూస్తున్నామని చెప్పింది.


