దివీస్ లాభం 9 శాతం అప్‌ | Divis labs profit 9 percent up | Sakshi
Sakshi News home page

దివీస్ లాభం 9 శాతం అప్‌

Feb 5 2017 8:32 AM | Updated on Sep 5 2017 2:58 AM

దివీస్ లాభం 9 శాతం అప్‌

దివీస్ లాభం 9 శాతం అప్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో దివీస్ ల్యాబ్స్ నికర లాభం 9 శాతం పెరిగి రూ. 268 కోట్లకు చేరింది.

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో దివీస్ ల్యాబ్స్ నికర లాభం 9 శాతం పెరిగి రూ. 268 కోట్లకు చేరింది. ఇక ఆదాయం రూ. 860 కోట్ల నుంచి రూ. 976 కోట్లకు పెరిగింది.

నవంబర్‌ 28 నుంచి డిసెంబర్‌ 6 మధ్య కాలంలో తమ విశాఖపట్నం ప్లాంట్‌లోని రెండో యూనిట్‌లో అమెరికా ఎఫ్‌డీఏ తనిఖీలు నిర్వహించినట్లు సంస్థ తెలిపింది. ఎఫ్‌డీఏ సూచనలకు సంబంధించి తాము చేపట్టిన దిద్దుబాటు చర్యలు మొదలైన వాటి గురించి ఇప్పటికే వివరణనిచ్చినట్లు పేర్కొంది. తదుపరి ఎఫ్‌డీఏ స్పందన కోసం ఎదురుచూస్తున్నామని చెప్పింది.  

Advertisement
 
Advertisement
Advertisement