breaking news
Farhan Azmi
-
మోదీకి మొరపెట్టుకున్న నటి భర్త
ముంబై: ప్రముఖ నటి ఆయేషా టకియా భర్త ఫర్హాన్ అజ్మీ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో సోషల్ మీడియా ద్వారా తన బాధను ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు మొరపెట్టుకున్నారు. తన భార్య, తల్లి, సోదరీమణులను ఓ వ్యక్తి వేధిస్తున్నాడని, చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఫర్హాన్ మంగళవారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. తమకు సహాయం చేయాలని జోన్ 9 డీసీపీ దహియాకు ఎన్నిసార్లు ఫోన్‌చేసినా, మెసేజ్ పెట్టినా స్పందించలేదని తెలిపారు. అక్రమంగా తమ బ్యాంకు ఖాతాలను నిలిపివేశారన్నారు. ప్రధాని మోదీ, సుష్మా స్వరాజ్ జోక్యం చేసుకుని తమను కాపాడాలని ఆయన అభ్యర్థించారు. చివరకు పోలీసులు స్పందించడంతో ధన్యవాదాలు తెలిపారు. జాయింట్ కమిషనర్(శాంతిభద్రతలు) దేవెన్ భారతి స్పందించడంతో ముంబై పోలీసులపై నమ్మకం కలిగిందని మరో ట్వీట్ చేశారు. కాగా, ఫర్హాన్ కుటుంబ సభ్యులను బెదిరిస్తున్న వ్యక్తి అతడి వ్యాపార మాజీ భాగస్వామి కషిఫ్ ఖాన్ అని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వెల్లడించింది. తనను మోసం చేశాడని కషిఫ్ ఖాన్‌పై బాంద్రా పోలీసు స్టేషన్లో ఫర్మాన్ కేసు పెట్టారు. హిందూ మతానికి ఆయేషా టకియాను పెళ్లి చేసుకున్నందుకు గతంలో ఫర్హాన్ అజ్మీకి గతంలో బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయి. -
చంపేస్తామని నటి భర్తకు ఫోన్ కాల్స్
ముంబయి: ప్రముఖ నటి ఆయేషా టకియా భర్తకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఆయనను చంపేస్తామని బెదిరించారు. అయేషా టకియా ఓ హిందువు అని, లవ్ జిహాద్లో భాగంగాన ఆమెను వివాహం చేసుకున్నావని, త్వరలోనే ఆయన కుటుంబం మొత్తాన్ని హత్య చేస్తామని బెదిరించారు. ఈ మేరకు ఆయేషా భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల (జులై) 21న ఆయనకు బెదిరింపు ఫోన్ కాల్ రాగా ఆయన 26న పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తాజాగా మీడియాకు తెలిసింది. అయేషా టకియాను సమాజ్ వాది పార్టీ నేత అబూ అజ్మీ కుమారుడు ఫర్హాన్ అజ్మీని 2009లో వివాహం చేసుకున్నారు. వారికి మిఖెయిల్ అనే బాలుడు కూడా ఉన్నాడు. అయితే, తాజాగా పోలీసులకు చేసిన ఫిర్యాదులో హిందూ సేనకు సంబంధించిన వాళ్లే ఈ పనిచేశారని పర్హాన్ తండ్రి అబూ అజ్మీ పేర్కొన్నారు. 'మీరంతా జంతువులు. లవ్ జిహాద్ పేరిట మీరు ఓ హిందువు మహిళను వివాహం చేసుకున్న విషయాన్ని మర్చిపోయారా? త్వరలోనే మీ కుటుంబాన్ని చంపేస్తాం. బాంబులు పెట్టి మరీ ఈ పనిచేస్తాం' అంటూ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.