breaking news
fake orders
-
రద్దయిన పాత నోట్లను మార్చుకోవచ్చా..? కేంద్రం కీలక ప్రకటన!
కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పాత రూ.500, రూ. 1000 నోట్లను ఇప్పుడు కూడా మార్చుకోవచ్చా.. ఇంకా ఈ అవకాశం ఉందా.. పాత కరెన్సీ నోట్ల మార్పిడి అంశానికి సంబంధించి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసిన లెటర్ అంటూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదీ చదవండి: Ola Holi Offer: తక్కువ ధరకు ఓలా స్కూటర్లు.. రూ.45,000 వరకు తగ్గింపు! దాదాపు ఏడేళ్ల క్రితం 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ డీమానెటైజేషన్ను ప్రకటించారు. పాత రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేసి వాటికి బదులుగా రూ.500, రూ.2000 కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా విదేశీ పౌరులు ఇప్పటికీ తమవద్ద ఉన్న పాత ఇండియన్ కరెన్సీ నోట్లను మార్చుకోవచ్చని పేర్కొంటూ ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేసిందంటూ ఓ లెలర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదీ చదవండి: Women’s Day 2023: ఈ బ్యాంకును నడిపించేది ఆమే.. ఏకైక మహిళా చీఫ్! దీనిపై భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ చేసి ఆ ఆర్డర్ నకిలీదని తేల్చింది. రద్దు చేసిన కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు విదేశీ పౌరులకు కల్పించిన అవకాశం 2017లోనే ముగిసిందని తెలిపింది. An order issued in the name of @RBI claims that exchange facility for Indian demonetized currency notes for foreign citizens has been extended#PIBFactCheck ✅This order is #fake ✅The exchange facility for Indian demonetized currency notes for foreign citizens ended in 2017. pic.twitter.com/cF0IwMu3Wb — PIB Fact Check (@PIBFactCheck) March 6, 2023 -
అక్రమార్కులకే అందలం
ఐసీడీఎస్‌లో మారని తీరు అవినీతి ఆరోపణలున్న ఉద్యోగికి పదోన్నతి నకిలీ ఆర్డర్లతో నియామకాల కేసులో చర్యలు శూన్యం ఇప్పటికే ఓ సీడీపీవో, సీనియర్ అసిస్టెంట్ పదవీ విరమణ ఆదిలాబాద్ : ఐసీడీఎస్‌లో తీరు మారడం లేదు. అక్రమార్కులనే అందలం ఎక్కిస్తున్నారు. గతంలోనూ సీడీపీవో స్థాయి అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తాజాగా శాఖ తోపాటు స్వయంగా అప్పటి కలెక్టర్‌ను బురిడీ కొట్టించి నకిలీ ఆర్డర్లతో అంగన్వాడీ వర్కర్లుగా పదోన్నతి కల్పించిన వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు తీసుకోలేదు. పెపైచ్చు ఓ అక్రమార్కుడికి పదోన్నతి కల్పించిన వ్యవహారం వెలుగులోకి వచ్చిం ది. గతంలో లక్సెట్టిపేటలో జరిగిన నకిలీ ఆర్డర్ల కేసులో ప్రధాన సూత్రధారుడిగా ఆరోపణలున్న సదరు ఉద్యోగికి తా జాగా సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించడం చర్చనీయమైంది. ఇద్దరు పదవీ విరమణ.. ఒకరికి పదోన్నతి.. లక్సెట్టిపేట ప్రాజెక్టు పరిధిలో 2012లో 13 మంది అంగన్వాడీ హెల్పర్లకు అంగన్వాడీ వర్కర్స్‌గా పదోన్నతి కల్పించారు. కొన్ని నెలలపాటు వారు వర్కర్లుగా పనిచేస్తూ వేతనాలు కూడా పొందారు. అప్పట్లో ఓ సూపర్వైజర్ బదిలీ జరగగా కొత్తగా వచ్చిన సూపర్వైజర్ అంగన్వాడీ వర్కర్లకు సంబంధించిన రికార్డులు పరిశీలించగా అక్రమం వెలుగులోకి వచ్చింది. అంగన్వాడీ హెల్పర్లుగా కొన్లేళ్ల నుంచి పనిచేస్తున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి అంగన్వాడీ వర్కర్లుగా నియమించినట్లు బయటపడింది. ఆ సమయంలో ఆ ప్రాజెక్టు సీడీపీవో, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ముగ్గురు కలిసి నకిలీ పత్రాలతో అసలు శాఖతో సంబంధం లేనివారిని కొన్నేళ్లుగా హెల్పర్లుగా పనిచేస్తున్నట్లు పత్రాలు సృష్టించి వారికి నేరుగా అంగన్వాడీ వర్కర్లుగా నియమించినట్లు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే ఐసీడీఎస్‌లో సెల క్షన్ కమిటీ నియామకాల వ్యవహారాన్ని చేపడుతోంది. అయితే నకిలీ ప్రొసిడింగ్‌లతో అప్పట్లో కలెక్టర్‌నే బురిడి కొట్టించి న ఘనత ఈ ప్రబుద్ధులది. దీంతో అప్ప ట్లో కలెక్టర్ ఆదేశాల మేరకు పీడీ విచారణ చేపట్టి సదరు అంగన్వాడీ వర్కర్లను తొలగించారు. ఈ వ్యవహారంలో సీడీపీవో, సీనియర్ అసిస్టెంట్, జూని యర్ అసిస్టెంట్ ఒక్కో అంగన్‌శాడీ వర్కర్ నుంచి సుమారు రూ.3 లక్షల వరకు వసూలు చేసి నకిలీ ప్రొసిడింగ్లు సృష్టించారని శాఖపరమైన విచారణలోను తేలింది. కాగా అంగన్వాడీ వర్కర్లుగా తొలగింపునకు గురైన వారు తమను తిరిగి కొనసాగించాలని హైకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసు విచారణ సాగుతుంది. అయితే దాదాపు మూడేళ్లు దాటిన ఇప్పటి వరకు సీడీపీఓ, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సీడీపీఓ, సీనియర్ అసిస్టెంట్లు పదవీ విరమణ పొందారు. అవినీతి అధికారులు రిటైర్డ్ అయిపోయిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వారు అన్ని రకాల లబ్ధిపొందడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో శాఖపరమైన విచారణ జరిగినా అధికారులు తీసుకున్న చర్యలేంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పైగా పదోన్నతి.. లక్సెట్టిపేట నకిలీ ఆర్డర్ల కేసులో అప్పట్లో జూనియర్ అసిస్టెంట్‌పైనే ప్రధానం గా ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంలో సీడీపీవోతో కలిసి ఆయనే ల క్షల రూపాయలు తీసుకొని అసలు హెల్పర్లు కాని వారికే వర్కర్లుగా నియమించారని శాఖ విచారణలో స్పష్టమైంది. ఆర్డర్లకు సంబంధించి సీడీపీవో, జూనియర్ అసిస్టెంట్ల సంతకాలు చేసిన కాపీలను విచారణలో స్వాధీనం చేసుకున్నారు. ఇం త జరిగినా వారిపై చర్యలు తీసుకోలేదు. లక్సెట్టిపేట నుంచి బదిలీ జరిగి నిర్మల్ లో పనిచేస్తున్న సదరు జూనియర్ అసిస్టెంట్‌కు తాజాగా సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించి వరంగల్ జిల్లాకు బదిలీ చేయడం చర్చనీయమైంది. కేసులో ప్రధాన వ్యక్తులైన ముగ్గురిలో ఇప్పటి వరకు ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ విషయమై స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆర్జేడీ శైలజను వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు.