breaking news
Faberge egg
-
వింటర్ ఎగ్ @ 236 కోట్లు!
లండన్: రష్యా జార్ చక్రవర్తుల రాజరిక ఠీవీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే అత్యంత అరుదైన వింటర్ఎగ్ ఒకటి ఇప్పుడు వేలంపాటలో రికార్డ్ల మోత మోగించేందుకు సిద్ధమైంది. రష్యా జార్ చక్రవర్తి నికోలస్–2 తన తల్లి, రాజమాత మారియా ఫియోడోరోవ్నాకు వందేళ్ల క్రితం ఈస్టర్ కానుకగా బహూకరించిన విలువైన వింటర్ ఎగ్ గురించే ఇప్పుడా చర్చ అంతా. డిసెంబర్ రెండో తేదీన క్రిస్టీస్ వేలంపాట సంస్థ తమ లండన్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే వేలంపాటలో ఈ స్ఫటిక ఫ్యాబెర్జీ వింటర్ ఎగ్ ఏకంగా రూ.236 కోట్లకుపైగా ధర పలకవచ్చన్న అంచనాలు ఎక్కువయ్యాయి. దీనిని ప్రఖ్యాత వజ్రాభరణాల సంస్థ ఫ్యాబెర్జీ తయారుచేసింది. 1913 సంవత్సరంలో రాజు నికోలస్ దీనిని తన తల్లికి బహూకరించారు. రష్యా ప్రభుత్వ అధీనంలోకాకుండా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న ఏడింటిలో ఇదీ ఒకటని వేలంసంస్థ పేర్కొంది.ఎన్నెన్నో ప్రత్యేకతలుదవళవర్ణంలో ధగధగా మెరిసేపోయే ఈ వింటర్ ఎగ్ ఎత్తు 10 సెంటీమీటర్లు. లీలగా చూస్తే పూర్తి గుడ్డులాగా కనిపించినా దానిని రెండుభాగాలుగా తెరవొచ్చు. చలికాలంలో ఆరుబయట పెడితే మంచుబిందువులు పడి ఘనీభవించినట్లు స్ఫురించేలా దీనిని డిజైన్‌చేశారు. ప్లాటినమ్ లోహపు బుల్లి బుట్టలో అనిమోనిస్ పుష్పాలను గుదిగుచ్చి చూడచక్కటి పుష్పగుచ్ఛా న్ని తయారుచేసి లోపల పెట్టారు. గుడ్డు అంతర్గ తంగా మొత్తంగా ఏకంగా 4,500 చిన్న చిన్న వజ్రా లను పొదిగారు. అనిమో నిస్ పుష్పాలను క్వార్జ్‌తో తయారుచేశారు. ఆకుల ను పచ్చలతో రూ పొందించారు. శీతాకాల చలిని చీల్చుకుంటూ వసంత రుతువులోకి కాలం అడుగుపెట్టేవేళ అనిమో నిస్ పుష్పాలు వికసిస్తా యి. కష్టకాలాన్ని దాటి కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నందుకు గుర్తుగా రష్యాలో ఈ పుష్పాలను బహుమతిగా ఇస్తారు. ఫ్యాబెర్జీ వజ్రాభరణాల సంస్థలోని ఏకైక కళాకృతి కళాకారిణి ఆల్మా పిహల్ దీనిని డిజైన్ చేశారు. స్వర్ణకారులైన ఆల్బర్ట్ హల్మ్స్ట్రోమ్, పిహల్ బంధువు దీనిని తయారు చేశారు. ‘‘అద్భుతమైన చేతి పనితనం, ఆకర్షణీ యమైన డిజైన్లకు ఈ వింటర్ ఎగ్ పెట్టింది పేరు. అలంకరణ కళల్లో ఈ ఎగ్ ఒకరకంగా మోనాలిసా పెయింటింగ్లాంటిది’’ అని క్రీస్టిస్ వేలంసంస్థలో రష్యా కళారూపాల విభాగ అధిపతి మార్గో ఒగానేసియన్ వ్యాఖ్యానించారు. పీటర్ కార్ల్ ఫ్యాబెర్జీ సారథ్యంలోని వజ్రా భరణాల సంస్థ 1885 నుంచి దాదాపు పాతికేళ్ల పాటు రష్యా రాజకుటుంబాల కోసం దాదాపు 50 స్మారక ఎగ్‌లను తయారు చేసి ఇచ్చింది. జార్ చక్రవర్తి అలెగ్జాండర్–3 తన సతీమణికి ప్రతి ఈస్టర్కు ఒక ఈస్టర్ ఎగ్ ను బహూకరించి ఇలా ఎగ్‌ల బహూకరణ పర్వానికి తెరలేపారు. దీనిని నికోలస్–2 కొనసా గించారు. -
ఖరీదైన చోరీలు..
ప్రపంచమొత్తం మీద నిత్యం ఎన్నో దొంగతనాలు జరుగుతుంటాయి. వాటిలో కొన్ని దొంగతనాలు చిన్న చితకాగా ఉన్నప్పటికీ, మరికొన్ని మాత్రం చాలా భారీగా ఉంటాయి. ఇలాంటి దోపిడిల్లో కోల్పోయిన వస్తువుల విలువ చాలా భారీగా ఉంటుంది. అలాంటి భారీ దొంగతనాల గురించి ఓసారి తెలుసుకుందాం.. ఫాబెర్జ్ ఎగ్స్ రష్యాను రాజులు ఏలుతున్న కాలంలో వారి వద్ద అత్యంత విలువైన సంపద ఉండేది. అందులో ముఖ్యమైంది ఫాబెర్జ్ ఎగ్స్ అనే అతి విలువైన వస్తువులు ఉండేవి. వీటిని పీటర్ కార్ల్ ఫాబెర్జ్ అనే వ్యక్తి రూపొందించాడు. ఇవి మొత్తం 52 ఉండేవి. 1917లో రష్యాలో నియంతృత్వమైన రాచరిక పాలనకు వ్యతిరేకంగా బోల్ష్ విక్ విప్లవం మొదలైంది. అ విప్లవంలో పెదఎత్తున పాల్గొన్న ప్రజలు.. రాజ వంశంలోని అందర్ని హత్యచేసి నిర్మూలించారు. ఈక్రమంలో చాలా విలువైన సంపద రాజ భవనం నుంచి అదృశ్యమైంది. అందులో ఈ ఫాబెర్జ్ ఎగ్స్ కూడా మాయమయ్యాయి. అప్పట్లోనే ఒక్కో ఎగ్ విలువ ఒక మిలియన్ డాలర్‌గా ఉండేదని తెలుస్తోంది. 3 టన్నుల బంగారం చోరీ.. ఈ దొంగతనం ఇంగ్లండ్ రాజధాని లండన్‌లో జరిగింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీ గల హీత్రూ విమానశ్రయ ప్రాంగణంలో జరిగింది. నిజానికి దొంగలు విమానశ్రయంలో అత్యంత విలువైన వస్తువులు భద్ర పరిచే గిడ్డంగిలో దొంగతనానికి ప్లాన్ వేశారు. ఈ దొంగతనం ద్వారా 3 మిలియన్ డాలర్ల విలువైన వస్తువుల్ని కొట్టేయాలని అనుకున్నారు. అయితే గిడ్డంగిలోకి ప్రవేశించిన అనంతరం వారికి కళ్లు తిరిగినంత పనైంది. పెద్ద పెద్ద బాక్సులలో 3 టన్నుల బంగారు కడ్డీలు దర్శనమిచ్చాయి. వీటి విలువ 34 మిలియన్ డాలర్లకు సమానం కావడం విశేషం. దొంగతనం జరిగిన తర్వాత చాలా మంది దొంగల్ని పోలీసులు పట్టుకున్నప్పటికీ బంగారాన్ని మాత్రం రికవరీ చేయలేకపోయారు. డైనోసార్ శిలాజం వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ డైనోసార్ అస్థిపంజరంలోని ఎముకల దొంగతనం జరిగింది. డైనోసార్లలోని ఉపజాతి అయిన టైరనోసారస్ బాటర్ శిలాజాన్ని 1945 మంగోలియాలో కనుగొన్నారు. అయితే ఈ శిలాజంలోని పూర్తి భాగం మాత్రం 2012లో ఓ రూపు వచ్చింది. ఎందుకంటే ఈ శిలాజంలోని కొన్ని వస్తువులు చోరీకి గురయ్యాయి. అమెరికా వాసి ఎరిక్ ప్రొక్పొయ్ మంగోలియా నుంచి అమెరికాకు ఈ శిలాజంలోని కొంత భాగాన్ని దొంగతనంగా తరలించాడు. ఈ క్రమంలో మన్‌హట్టన్‌లోని ఓ వ్యాపారికి 1.1 మిలియన్ డాలర్లకు అమ్మాలని చూశాడు. దీనిపై సమాచారమందుకున్న ఎఫ్‌బీఐ అధికారులు దాడిచేసి ప్రొక్పోయ్ను అరెస్ట్ చేశారు. నిజానికి పురాతన శిలాజాలను దొంగతనంగా విక్రయించడం ప్రొక్పొయ్ అలవాటని దర్యాప్తులో తెలుసుకున్నారు. అనంతరం డైనోసార్ శిలాజాలను మంగోలియాకు తరలించారు. మోనాలిసా ఇటలీకి చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలి లియోనార్డో డావిన్సీ గీసిన అద్భుత కళాఖండం ‘మోనాలిసా’. ప్రపంచంలోనే అత్యధిక మంది సందర్శించిన చిత్ర పటంగా మోనాలిసా గుర్తింపు పొందింది. క్రీ.శ. 1503 కాలంలో రూపుదిద్దుకున్న ఈ కళాఖండం అత్యంత ఖరీదైనది. 1797లో ఫ్రాన్స్ రాజు పారిస్‌లోని లార్విన్ మ్యూజియానికి ఈ చిత్రరాజాన్ని బహుకరించాడు. అయితే 1911లో అదే మ్యూజియంలో పనిచేసే విన్సెంజో పెరుజ్జియా అనే వ్యక్తి దీన్ని దొంగిలించాడు. అయితే మరో రెండేళ్ల తర్వాత ఈ పెయింటింగ్‌ను కనిపెట్టి యథావిథిగా మ్యూజియంలో భద్రపరిచారు. అప్పట్లోనే దీని ధర 100 మిలియన్ డాలర్లు కాగా.. ప్రస్తుతం రెండు బిలియన్లకు పైగా రేటు పలుకుతుంది. అతిపెద్ద వజ్రాల దొంగతనం.. అత్యంత ఖరీదైన వజ్రాల్ని దొంగలు చిత్రమైన వేషాలు వేసి దొంగలు కొట్టేయడం మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. ఇలాంటి సంఘటనే నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టార్‌డమ్‌లో జరిగింది. అక్కడి కేఎల్ఎమ్ ఏయిర్లైన్స్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు దొంగలు ఏయిర్‌లైన్స్ సిబ్బందిలాగా దుస్తులు వేసుకుని స్థానిక షిపోల్ విమానశ్రయంలోకి ప్రవేశించారు. అనంతరం ఖరీదైన వజ్రాలతో లోడింగ్‌కు సిద్ధంగా ఉన్న భారీ ట్రక్‌ను హైజాక్ చేశారు. ఆఖరికి నిర్మానుష్యంగా ఉన్న చోట ఈ ట్రక్‌ను పోలీసులు కనుగొన్నారు. అయితే అందులో వారికి ఒక్క డైమండ్ కూడా లభించలేదు. దొంగతనానికి గురైన డైమండ్ల విలువ 118 మిలియన్ డాలర్ల పైమాటే కావడం విశేషం. ఖరీదైన వయోలిన్ శాస్త్రియ సంగీతానికి ఉపయోగించే పరికరాల్లో వయోలిన్ ముఖ్యమైనది. స్ట్రాడివారస్ అనే ప్రముఖ సంస్థ అత్యంత ఖరీదైన, మన్నికైన వయోలిన్ లాంటి పరికరాలను ఉత్పత్తి చేసేది.1727లో ఈ కంపెనీ ఉత్పత్తి చేసిన ఓ వయోలిన్‌ను ప్రముఖ సంగీతకారుడు ఎరికా మోరిన్ ఉపయోగించేవాడు. ఒకరోజున మోరిన్ నివాసముండే అపార్ట్మెంట్లో చోరీ జరిగింది. దొంగ ఈ వయోలిన్‌ను చోరీ చేశాడు. కాలక్రమంలో మోరిన్ పరమపదించినా ఆ వయోలిన్ జాడ ఇప్పటికీ తెలియలేదు. ఇంతకీ ఆ వయోలిన్ విలువ ప్రస్తుత లెక్కల ప్రకారం 3.5 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా..


