breaking news
Explosives Companies
-
Russia-Ukraine war: ఉక్రెయిన్ ఆయుధాగారాలపై రష్యా ముమ్మర దాడులు
కీవ్: ఉక్రెయిన్‌పై దాడులను ఆదివారం రష్యా తీవ్రతరం చేసింది. సెంట్రల్ ఉక్రెయిన్‌లో పేలుడు పదార్థాలు, మందుగుండు పౌడర్ తయారీ కంపెనీపై అత్యాధునిక మిసైళ్లు ప్రయోగించినట్టు రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ తెలిపారు. ఖర్కీవ్ ప్రాంతంలోని బర్వింకోవ్, నోవా ద్మిత్రివ్కా, ఇవనివ్కా, హుతలరివ్కా, వెల్యికాల్లో పలు ఆయుధాగారాలపైనా భారీగా దాడులు చేసినట్టు వివరించారు. 26 ఉక్రెయిన్ సైనిక లక్ష్యాలను ధ్వంసం చేశామన్నారు. మారియుపోల్‌లోని అజోవ్‌స్తల్ స్టీల్ ప్లాంటుపై గగనతల దాడులకు దిగింది. తూర్పున డోన్బాస్లో లుహాన్స్క్ ప్రాంతంలోని పొపాస్నా, సివెరోడొనెట్స్క్, డొనెట్స్క్ ప్రాంతంలోని కురఖీవ్ నగరాలపై బాంబుల వర్షం కురిపించింది. పశ్చిమ డోన్బాస్లోని ద్నిప్రోలోనూ బాంబు దాడులు జరిగాయి. చెడుపై అంతిమంగా మంచి గెలిచి తీరుతుందని, ఈ వాస్తవం రష్యాకు త్వరలో తెలిసొస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. మరణాన్ని జీవనం, చీకటిని వెలుతురు అధిగమిస్తాయని దేశ ప్రజలకిచ్చిన ఈస్టర్ సందేశంలో చెప్పారు. అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులు లాయిడ్ ఆస్టిన్, ఆంటోనీ బ్లింకెన్‌లతో భేటీ కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. -
కార్మికుల ప్రాణాలు గాలిలో!
భువనగిరి, న్యూస్‌లైన్: పేలుడు పదార్థాల, రసాయనాల కంపెనీల్లో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తర చూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అమాయక కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. హైదరాబాద్ శివారులో జిల్లాలో ఏర్పాటు చేసిన పలు కంపెనీల్లో జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. కంపెనీ యాజమాన్యాలకు కంపెనీల నుంచి ఇన్సూరెన్స్ అందుతుండగా కార్మికులకు మాత్రం అందడం లేదు. దీంతో ఆ కుటుంబాలు దిక్కులేనివి అవుతున్నాయి. తాజాగా భువనగిరి పారిశ్రామిక వాడలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళా కార్మికులు గాయపడ్డారు. ఎక్కువగా రసాయన, పేలుడు పదార్థాల కంపెనీలు.. జిల్లాలో సుమారు 60 వరకు రసాయన, 6 వరకు ఎక్స్‌ప్లోజివ్స్ కంపెనీలు ఉన్నాయి. ప్రధానంగా భువనగిరి, బీబీనగర్ పారిశ్రామిక వాడలతో పాటు యాదగిరిగుట్ట, భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్, చిట్యాల, ఆలేరు, బొమ్మలరామారం మండలాల్లో అధికంగా రసాయన, పేలుడు పదార్థాల కంపెనీలు ఉన్నాయి. వీటిలో సంబంధిత అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేయకపోవడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి నెలా కంపెనీలను సంబంధిత అధికారులు తనిఖీలు చేసి నిబంధలను పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. చాలా కంపెనీలు నిబంధనలను తుంగలో తొక్కి నైపుణ్యం లేని కార్మికులతో పని చేయించుకుంటూ తక్కువ వేతనాలు చెల్లిస్తున్నా అధికారులు పట్టిం చుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమ్యామ్యాలకు అలవాటు పడడంతో తూతూ మంత్రంగా తనిఖీలు చేపడుతున్నారన్న ఆరోపణలున్నాయి. విధి నిర్వహణలో కార్మికులకు భద్రత కోసం హెల్మెట్, షూష్ , గ్లౌజ్‌లు, మాస్క్ పరికరాలు ఇవ్వాల్సి ఉం టుంది. కాని చాలా కంపెనీల్లో అవి మచ్చుకు కూడా కన్పించడంలేదు. దీని వల్ల కార్మికులు ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడుతూ, మృత్యువాత పడుతున్నారు. గడిచిన రెండున్నర సంవత్సరాల్లో భువనగిరి డివిజన్లో పలు ప్రమాదాలు చోటుచేసుకున్నా ఏ కంపెనీ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.