breaking news
experimentation
-
అనంతలో ఐదు ‘అన్న క్యాంటీన్లు’
ఒక ఇడ్లీ - రూ. 1 రెండు చపాతీలు - రూ.3 పెరుగన్నం - రూ.3 చిత్రాన్నం, పులిహోరం - రూ.5 అనంతపురం సప్తగిరిసర్కిల్: తమిళనాడులో నిర్వహిస్తున్న అమ్మ క్యాంటీన్ల తరహాలో మన రాష్ట్రంలో కూడా నాలుగు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అన్న క్యాంటీన్ల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయబోయే క్యాంటీన్ల విషయమై శుక్రవారం స్థానిక డ్వామా సమావేశ మందిరంలో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత, సమాచార ప్రసారశాఖ, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి జిల్లా అధికారులు, హిందూపురం ఎంపీ నిమ్మల క్రిష్టప్ప, పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారధి, జెడ్పీ చైర్మన్ చమన్‌సాబ్, నగర మేయర్ మదమంచి స్వరూప, ఇస్కాన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. నగరంలో ప్రభుత్వాస్పత్రి, ఆర్టీసీ బస్టాండ్, తాడిపత్రి బస్టాండ్, టవర్‌క్లాక్, రుద్రంపేట ప్రాంతాల్లో ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. క్యాంటీన్లలో ఆహారపదార్థాల ధరలు, తాగునీరు, పరిశుభ్రత, నిర్వహణకు సంబంధించి ఇస్కాన్ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. ప్రతి క్యాంటీన్ వద్ద వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేసుకుని రక్షిత నీరు అందచేయాలన్నారు. పరిసరాలు పరిశుభ్రత పాటించాలన్నారు. పార్శిల్ సదుపాయం లేదన్నారు. అక్టోబర్ 2న వీటిని ప్రారంభించాల్సి ఉంది. అయితే మరోసారి తమిళనాడుకు వెళ్లి అక్కడి అమ్మ క్యాంటీన్లను పరిశీలించాల్సి రావడంతో వీటి ప్రారంభంలో కొంత ఆలస్యమయ్యే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఈ నెల 16న మంత్రి పరిటాల సునీత, కలెక్టర్, ఇస్కాన్ ప్రతినిధులు చెన్నైకి వెళ్లనున్నారు. అనంతరం అన్న క్యాంటీన్ల ప్రారంభించేందకు చర్యలు చేపడతారు. అనంతపురంలో ఉదయం 7 నుంచి 10 గంటల వరకు రాగిముద్ద, నీళ్లపప్పు, ఇడ్లీ, సాంబార్, పొంగల్ (రోజుకోరకం), మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు చిత్రాన్నం, పప్పున్నం, పులిహోరలలో ఒకటి, పెరుగన్నం, రాత్రి 7 నుంచి 10 గంటల వరకు చపాతీలు పెట్టాలని సూచించారు. ఇందులో ఒక్కో ఇడ్లీ ఒక రూపాయి చొప్పున, రెండు చపాతీలు రూ.3 ప్రకారం, ముద్దపప్పు, చిత్రాన్నం, పులిహోరం రూ.5 చొప్పున, పెరుగన్నం రూ.3 ప్రకారం విక్రయించాలని సమావేశంలో ఇస్కాన్ ప్రతినిధులకు సూచించారు. కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, పౌరసరఫరాలశాఖ డీఎం వెంకటేశం, డీఆర్డీఏ పీడీ కె.నీలకంఠారెడ్డి, డీఎస్వో ఉమామహేశ్వర్రావు, ఆర్డీవో షేక్‌హుస్సేన్, మార్కెటింగ్‌శాఖ ఏడీ బి.శ్రీకాంత్‌రెడ్డి, రైతుబజార్ ఎస్టేట్ ఆఫీసర్ ప్రతాప్‌రుద్ర, తహశీల్దార్, సీఎస్డీటీలు వెంకటేశ్వర్లు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీల్లో ఇకపై ఆన్లైన్
జిల్లాలో 187 క్లస్టర్లలో ప్రయోగాత్మకంగా అమలు రికార్డులన్నీ కంప్యూటరీకరణ మండల పరిషత్ కార్యాలయాలకు చేరిన కంప్యూటర్లు నూజివీడు, న్యూస్‌లైన్ : పంచాయతీ కార్యాలయాల్లో త్వరలో ఆన్లైన్ విధానం అందుబాటులోకి రానుంది. రోజురోజుకూ అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకు ని పంచాయతీరాజ్ సంస్థలను శక్తివంతం చేయడానికి ఆన్లైన్ విధానానికి పాలకులు శ్రీకారం చుడుతున్నారు. దీని అమలు కోసం జిల్లాలో పంచాయతీ లను 519 క్లస్టర్లుగా విభజించారు. వీటిలో 187 క్లస్టర్లలో మొదటి విడతగా దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. వీటిలో ఈ వి ధానం విజయవంతమైతే మిగిలిన పంచాయతీ ల్లో కూడా అమలుచేస్తారు. ఈ-పంచాయతీ పేరుతో అమలు చేస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన కంప్యూటర్లు, పరికరాలు సంబంధిత ఎంపీడీఓ కార్యాలయాలకు చేరాయి. ఈ వి ధానం అమలులోకి వస్తే పంచాయతీలకు సం బంధించి మనకు అవసరమైన సమాచారాన్ని ఎక్కడినుంచైనా తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. ఆయా పంచాయతీల్లో జరిగే అభివృద్ధి పనుల వివరాలు, అవి ఏ దశల్లో ఉన్నా యో కూడా తెలుసుకోవచ్చు. ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు, వాటి వినియోగం తదితర అం శాలను కూడా తెలుసుకోవడానికి వీలవుతుంది. పంచాయతీల్లో ఆన్లైన్ విధానాన్ని అమలు చేసే ప్రక్రియను కార్వే సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ కంప్యూటర్ ఆపరేటర్లను ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించి, 187 క్లస్టర్లలో ఆన్లైన్ వి ధానాన్ని అమలు చేస్తుంది. ఈ విధానంలో భాగంగా పంచాయతీల్లో ఉన్న జనన మరణాల నమోదు రిజిస్టర్, ఇంటిపన్నులు, లెసైన్స్ ఫీజులు, పనుల పర్యవేక్షణ, పం చాయతీలకు వచ్చిన గ్రాంట్ల వివరాలు, వేలం పాటలు, పంచాయతీ సిబ్బంది సమాచారం తది తర వివరాలన్నీ కంప్యూటరీకరణ చేసి ఆన్లైన్లో ఉంచుతారు. దీంతో అన్ని రకాల సేవలు పంచాయతీల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. పంచాయతీలకు ఏ పద్దు కింద ఎంత నిధు లు వచ్చాయి.. వాటిని ఖర్చుచేసిన విధానం ఎలా ఉంది.. తదితర విషయాలన్నీ ఆన్లైన్లో చూసుకోవచ్చు. ఈ విషయమై డీపీఓ ఆనంద్ ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా, కంప్యూట ర్లతో పాటు సంబంధిత సామగ్రిని కూడా ఆయా మండల పరిషత్ కార్యాలయాలకు పం పించామని చెప్పారు. త్వరలోనే ఈ విధానాన్ని అ మలు చేస్తామని పేర్కొన్నారు.