breaking news
expensive treatment
-
Covid Crisis: చేతులెత్తేసిన ప్రభుత్వాలు... ప్రజల పర్సులు ఖాళీ
కోవిడ్ సంక్షోభం వేళ ప్రజలకు అండగా నిలవడంతో కేంద్ర, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయి. ప్రజారోగ్య వ్యవస్థ ద్వారా ప్రజలను ఆదుకోవడానికి చొరవ చూపించకపోవడంతో ఎక్కువ మంది ప్రైవేటు ఆస్పత్రులనే ఆశ్రయించారు. చికిత్స కోసం ఆస్తులు అమ్ముకుని ఆర్థికంగా చితికి పోయారు. అవుటాఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ (OOP)కి సంబంధించిన గణాంకాలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. కరోనా కోసం చేసిన ప్రతీ రూ. 100 ఖర్చులో ప్రభుత్వ వ్యయం కేవలం రూ. 37.3లకే పరిమితం అవగా ప్రజలు వ్యక్తిగతంగా చేసిన ఖర్చు రూ. 63.7 గా నమోదైంది. అప్పుల పాలు రోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో కోట్లాది మంది ప్రజలు కరోనా బారిన పడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బెడ్లు లభించిన ఆక్సిజన్, రెమ్‌డెసివర్ వంటి మందులు బ్లాక్‌లో కొనుక్కుక్కోవాల్సిన దుస్థితి ఎదురైంది. ఆస్పత్రి ఖర్చుల కోసం కొందరు పొదుపు సొమ్ము వాడేస్తే, మరికొందరు అప్పులు చేశారు, ఆస్తులు అమ్ముకున్నారు. చివరకు కరోనా దెబ్బకు చాలా మంది ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. కేవలం సెకండ్‌వేవ్ కారణంగా దేశంలో 5.5 కోట్ల మంది ప్రజలు పేదలుగా మారిపోయారు. ప్రభుత్వ వ్యయం 37.3 శాతం కరోనా సెకండ వేవ్‌లో మన దేశంలో అధికారికంగా 2.87 కోట్ల కేసులు నమోదు అయ్యాయి. వీరి చికిత్స కోసం జరిగిన వ్యయంలో ప్రభుత్వ వాటా కేవలం 37.3 శాతం ఉండగా వ్యక్తిగతంగా చేసిన ఖర్చు రూ. 62.7గా నమోదు అయ్యింది. ఇదే సమయంలో అమెరికాలో 3.34 కోట్ల కేసులు రాగా అక్కడ ప్రభుత్వ వ్యయం 89.2 శాతంగా నమోదు అయ్యింది. వ్యక్తిగత ఖర్చు కేవలం 10.8 శాతమే అయ్యింది. పొరుగుతో పోల్చితే కరోనా చికిత్సకు ప్రభుత్వ పరంగా చేసిన ఖర్చులో ఇండియా కంటే పొరుగుదేశాలపై నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్‌లు ముందున్నాయి. బంగ్లాదేశ్, మయన్మార్లు వెనుకబడ్డాయి. బీహార్‌లో పది పైసలు వెనుకబాటు తనానికి కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే బీహార్, కరోనా చికిత్స విషయంలోనూ అదే తీరు కనబరిచింది. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా బారిన పడ్డవారికి ప్రభుత్వం తరఫున మెరుగైన చికిత్స అందివ్వడంలో పూర్తిగా చేతులెత్తేసింది. బీహార్ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కరోనా వ్యయం విషయంలో ప్రభుత్వ వాటా కేవలం 10 పైసలకే పరిమితమైంది. ఇక యోగా సర్కార్ తీరు ఇందుకు మినహాయింపేం కాదు, యూపీలో ప్రభుత్వ ఖర్చు రూ. 1.50కే పరిమితమైంది. పట్టణాల్లో పరిస్థితి గ్రామీణ ప్రాంతాలో కరోనా వైద్యం కోసం 10 పైసల వరకు ఖర్చు పెట్టిన బీహార్ పట్టణ ప్రాంతాలకు వచ్చే సరికి ఆ ఖర్చును రూ. 1.70 వరకు తేగలిగింది. ఆ తర్వాత మధ్య ప్రదేశ్ రూ. 7.70, ఉత్తర్‌ప్రదేశ్ రూ. 8.80 ఖర్చు చేశాయి. -
సీఎం సహాయ నిధి పక్కదారి!
సీఐడీ విచారణకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ పరిధిలో లేని ఖరీదైన చికిత్సలను భరించే స్తోమత లేని నిరుపేద రోగులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి అందించే ఆర్థిక సాయం దుర్వినియోగమైంది. నకిలీ బిల్లులతో ఈ సొమ్ము పక్కదారి పట్టినట్లు తేలింది. దీనిపై ఫిర్యాదులు రావటంతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి కార్యాలయం పలు జిల్లాలకు మంజూరు చేసిన బిల్లులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. 18 మంది రోగులకు సంబంధించిన ఫైళ్లను శాఖాపరమైన విచారణకు ఆదేశించగా అందులో నలుగురు నకిలీ బిల్లులతో సీఎం సహాయ నిధిని దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణ అయింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ ఉదంతంపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. జూన్ రెండో తేదీ తర్వాత మంజూరు చేసిన బిల్లులపై విచారణ జరపాలని నిర్ణయించింది. వీలైనంత తొందరగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సూచించింది. జూన్ నుంచి ఇప్పటివరకు సీఎం సహాయ నిధి నుంచి జారీ చేసిన దాదాపు ఏడు వేలకుపైగా చెక్కులకుగానూ ప్రభుత్వం దాదాపు రూ.150 కోట్లు విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై సీఐడీ విచారణ జరిపించాలని డీజీపీ కార్యాలయానికి లేఖ రాసినట్లు సీఎం ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ రాతపూర్వక లేఖలతో సిఫారసు చేసిన ఫైళ్లనే సీఎంఆర్ఎఫ్ కింద సాయం చేసేందుకు స్వీకరిస్తారు. ఈ ఫైళ్లను సీఎం పరిశీలించి ఆమోదించాక ఆయన సూచించిన మేరకు నిధులు విడుదల చేస్తారు. అయితే, ప్రజాప్రతినిధులతో తమకున్న పరిచయాలను ఆసరాగా చేసుకొని కొందరు దళారులు సిఫారసు లేఖలు సంపాదించి సీఎంఆర్ఎఫ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది.