breaking news
exise circle
-
ఎన్ని'కల' మద్యం నిల్వలు స్వాధీనం
సాక్షి, అడ్డాకుల (దేవరకద్ర): రానున్న ఎన్నికల సందర్భంగా పోలింగ్ సమయం సమీపిస్తుండడంతో పలువురు అభ్యర్థులు ప్రలోభాలకు తెర తీస్తున్నారు. ఓటర్లకు పంపిణీ చేసేందుకు పలు ప్రాంతాల్లో ఇప్పటికే మద్యం నిల్వలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ విషయమై ఫిర్యాదులు అందుతుండడంతో ఎక్సైజ్, సివిల్ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా అడ్డాకుల మండల కేంద్రంలోని బెల్టు షాపుల్లో మంగళవారం ఎక్సైజ్, సివిల్ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఎక్సైజ్ ఎస్ఐ బధ్యానాయక్, సివిల్ ఏఎస్ఐ జీఆర్.సుధీర్‌తో కలిసి ఓ మహిళ ఇంట్లో సోదాలు చేసి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా 24 బీరు సీసాలు, 48 క్వార్టర్ సీసాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిర్వాహకురాలిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ధన్వాడలో... ధన్వాడ (నారాయణపేట) : ధన్వాడలోని బురుజుగడ్డలో పోలీసులు మద్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ధన్వాడ వైన్స్ నుంచి ఓటర్లకు పంపిణీ చేసేందుకు మద్యం తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో తనిఖీ చేయగా ఆటోలో తరలిస్తున్న 25 మద్యం సీసాల కాటన్లు పట్టుబడ్డాయి. ఇక సోమవారం రాత్రి 240 మద్యం సీసాలు స్వా ధీనం చేసుకున్నామని.. ఎక్సైజ్ అధికారులకు అప్పగించనున్నామని ఎస్ఐ రవి తెలిపారు. మరికల్లో.. మరికల్ (నారాయణపేట): మరికల్ మండల కేంద్రంలో సోమవారం రాత్రి 128 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ జానకీరాంరెడ్డి తెలిపారు. మరికల్ నుంచి బైక్‌పై మద్యం తీసుకువెళ్తుండగా వెంబడించి పట్టుకున్నామని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
గీత కార్మికుల పోరుబాట
తాడేపల్లిగూడెం రూరల్ : గీత కార్మికుల సమస్యలపై ఈనెల 15 నుంచి 30వ తేదీ వరకు జిల్లాలోని ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించనున్నామని, కల్లు గీత కార్మికులంతా పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జుత్తిగ నరసింహారావు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా విస్తృత సమావేశం స్థానిక సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కార్యదర్శి నరసింహమూర్తి మాట్లాడుతూ కల్లుగీత కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, మద్యం సిండికేట్ల ప్రయోజనాల కోసం పనిచేస్తుందని విమర్శించారు. అక్టోబరు 1 నుంచి నూతన టాడీ పాలసీని ప్రకటించాల్సి ఉందని, అయితే ఇప్పటివరకు సంబంధిత శాఖ మంత్రి ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. తాటిబెల్లం ఫెడరేషన్ చైర్మన్ బొల్ల ముసలయ్య గౌడ్ మాట్లాడారు. తొలుత జిల్లా కార్యదర్శిగా వ్యవహరిస్తున్న జక్కంశెట్టి సత్యనారాయణ స్థానే జుత్తిగ నరసింహమూర్తిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా నాయకులు పూరెళ్ల శ్రీనివాస్, సీహెచ్ వెంకటేశ్వరరావు, దాసరి సూరిబాబు పాల్గొన్నారు.