breaking news
Ever Stone Group
-
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ అనుబంధ సంస్థ విక్రయం
ముంబై: వ్యర్థాల నిర్వహణ(వేస్ట్ మేనేజ్మెంట్) అనుబంధ సంస్థను విక్రయించినట్లు దివాళాకు చేరిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ తాజాగా వెల్లడించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్(ఐఈఐఎస్ఎల్)గా పిలిచే ఈ కంపెనీలో పూర్తి వాటాను పీఈ దిగ్గజం ఎవర్‌స్టోన్ గ్రూప్‌నకు అమ్మినట్లు పేర్కొంది. అనుబంధ సంస్థ ఎవర్‌ఎన్విరో రిసోర్స్ మేనేజ్మెంట్ ద్వారా వేస్ట్ మేనేజ్మెంట్ విభాగాన్ని ఎవర్‌స్టోన్ కొనుగోలు చేసినట్లు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ తెలియజేసింది. డీల్ విలువను వెల్లడించనప్పటికీ ఈ విక్రయం ద్వారా రూ. 1,200 కోట్లమేర రుణభారాన్ని తగ్గించుకోను న్నట్లు తెలుస్తోంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌పై దివాళా చట్టంలో భాగంగా ఎన్సీఎల్టీ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ఐఈఐఎస్ఎల్ సమీకృత వేస్ట్‌మేనేజ్‌మెంట్ కంపెనీగా సేవలందిస్తోంది. ప్రధానంగా మునిసిపల్ వ్యర్థాలకు సంబంధించి నిర్మాణం, తొలగించడం, కలెక్షన్, రవాణా, ఇంధన తయారీ తదితర పలు విభాగాలలో సర్వీసులను సమకూర్చుతోంది. ప్రస్తుతం రోజుకి 8,400 టన్నుల వ్యర్థాల నిర్వహణను చేపడుతోంది. -
‘మోడర్న్’ బ్రెడ్ వ్యాపారాన్ని విక్రయించిన హెచ్‌యూఎల్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్).. ‘మోడర్న్’ బ్రాండ్‌పై నిర్వహించే బ్రెడ్, బేకరీ వ్యాపారాన్ని విక్రయించింది. ఎవర్‌స్టోన్ గ్రూప్‌నకు చెందిన నిమన్ ఫుడ్స్ సంస్థ దీన్ని కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ వెల్లడి కాలేదు. రాబోయే రోజుల్లో లావాదేవీ పూర్తికి అవసరమైన అనుమతులు లభిస్తాయని హెచ్‌యూఎల్ ఎండీ సంజీవ్ మెహతా తెలిపారు. 2000లో కొనుగోలు చేసిన మోడర్న్ బ్రాండ్ వ్యాపారాన్ని లాభసాటిగా తీర్చిదిద్దినట్లు ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన మోడ్రన్ ఫుడ్ ఇండస్ట్రీస్‌ను అప్పట్లో హెచ్‌యూఎల్ కొన్నది. కేంద్రం జరిపిన తొలి డిజిన్వెస్ట్‌మెంట్ ఇదే. కేక్‌లు, బన్లు, క్రీమ్ రోల్స్ మొదలైనవి తయారు చేసే మోడర్న్ బ్రాండ్‌కి ఆరు ప్లాంట్లు ఉన్నాయి.