breaking news
erin white
-
ఆగ్రాలో ప్రేమకథ విషాదాంతం
ఆగ్రా: ప్రేమకు జాతి, ఎల్లలు లేవని చాటి చెప్పిన ఓ జంట ప్రేమకథ ప్రేమ మందిరం తాజ్‌మహల్ సాక్షిగా విషాదాంతమైంది. ఆటోవాలా అయినా అంతరాలు ఆలోచించకుండా పెళ్లి చేసుకున్న అమెరికా అమ్మాయిని ఐదు నెలలైనా గడవకముందే అతడే కొట్టి చంపి ఆపై ఆత్మాహుతికి పాల్పడిన విషాద ఘటన ఆగ్రాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... బంటీ (32) ఓ ఆటోవాలా. గతేడాది జూలైలో ఆగ్రాకు వచ్చిన అమెరికా అమ్మాయి అరియన్ విలింగర్ (35) బంటీతో ప్రేమలో పడింది. ఇద్దరూ అక్టోబరు 11న పెళ్లి చేసుకుని కాపురం పెట్టారు. కానీ కొన్నాళ్లకే కలతలు రావడంతో ఇద్దరూ వేర్వేరుగా ఉండటం మొదలుపెట్టారు. ఇద్దరి మధ్యా గొడవలు పెరగడంతో అరియన్ టూరిజం పోలీసులకు ఫిర్యాదు చేసి ఫ్యామిలీ కోర్టులో కేసు వేసింది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న బంటీ గురువారం ఆమెను ఆటోలో ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పొడిచి చంపాడు. తర్వాత తన గదికి వచ్చి ఆత్మాహుతి చేసుకున్నాడు. -
అమెరికన్ భార్యను చంపి.. పేల్చేసుకున్న భర్త
ఎక్కడో అమెరికా నుంచి వచ్చింది. ఆగ్రా అందాలను చూడాలని వచ్చి, అక్కడున్న ఓ ఆటోడ్రైవర్‌తో ప్రేమలో పడింది. ఎరిన్ వైట్ అనే అమెరికన్ పేరును కాస్తా కిరణ్ శర్మగా మార్చుకుని మరీ ఆ ఆటోడ్రైవర్‌ను పెళ్లి చేసుకుంది. చివరకు అతడి చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయింది. అచ్చం బాలీవుడ్ సినిమాను తలపించే ఈ సంఘటన ఆగ్రాలో జరిగింది. ఆమెను చంపిన తర్వాత తనను తాను పేల్చేసుకుని బంటీ శర్మ అనే ఆ ఆటోడ్రైవర్ చనిపోయాడు. అమెరికాలో సంఘసేవకురాలు అయిన ఎరిన్ వైట్ గత సెప్టెంబర్ నెలలో బంటీని పెళ్లి చేసుకుంది. గురువారం సాయంత్రం తన ఆటోలోనే ఆమెను పొడిచి చంపేసి, రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని బయటకు విసిరేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్య తర్వాత తన ఇంటికి తిరిగి వచ్చి, గ్యాస్ సిలెండర్ వాల్వు తెరిచి, నిప్పు అంటించుకుని తనను తాను పేల్చేసుకుని అతగాడు మరణించాడు. పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో రెండు సంఘటన స్థలాలకు వెళ్లారు. ఈ సంఘటన గురించి కేంద్ర హోం శాఖతో పాటు ఢిల్లీలోని అమెరికన్ రాయబార కార్యాలయానికి కూడా సమాచారం అందించారు. ఇద్దరి మధ్య వ్యక్తిగత సమస్యలు రావడం వల్లే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గత కొన్ని నెలలుగా వీరిద్దరికి సమస్యలు ఉండటంతో ఫ్యామిలీ కౌన్సెలర్ వద్దకు కూడా వెళ్లినట్లు చెప్పారు. ఎరిన్ తనకు ఇంతకుముందు పెళ్లి కాలేదని అబద్ధం చెప్పినట్లు బంటీ ఆరోపించగా, అతడు తనపట్ల చాలా క్రూరంగా వ్యవహరించాడని, అతడికి కూడా ఇంతకుముందు ఒక పెళ్లయిందని ఆమె చెప్పింది. చనిపోయే రోజు కూడా ఆమె 'ఆగ్రా సుందర్ హై' అనే కార్యక్రమానికి సంబంధించి విలేకరులతో మాట్లాడింది.