breaking news
Engineering Subject
-
బీ టెక్ తర్వాత నిర్వహణ నైపుణ్యాలకు.. ఎంబీఏ
బీఈ/బీటెక్ పూర్తయ్యాక ఎక్కువ మంది విద్యార్థులు దృష్టి సారించేది ఎంటెక్ లేదా ఎంబీఏ వైపే. వీటిలో ఎంటెక్.. సంబంధిత ఇంజనీరింగ్ సబ్జెక్టుల్లో విద్యార్థులను మరింత నిష్ణాతులుగా మారుస్తుంది. ఎంబీఏ.. నాలుగేళ్ల ఇంజనీరింగ్‌లో నేర్చుకున్న సాంకేతిక నైపుణ్యాలకు తోడుగా నిర్వహణ నైపుణ్యాలు అందిస్తుంది. భావి కెరీర్లో రాణించాలన్నా.. అత్యుత్తమ స్థాయికి చేరుకోవాలన్నా.. టెక్నికల్ స్కిల్స్తోపాటే మేనేజీరియల్ స్కిల్స్ తప్పనిసరి. ఈ కారణంగానే ఎంబీఏ కోర్సులో చేరే బీటెక్ గ్రాడ్యుయేట్స్ సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. సిటీలో ఎన్నో విద్యా సంస్థలు ఎంబీఏ/పీజీడీఎం కోర్సులను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీటెక్ తర్వాత ఎంబీఏ చేయాలా? చేస్తే ఎలాంటి అవకాశాలుంటాయి? వంటి అంశాలపై నిపుణుల విశ్లేషణ.. బీటెక్ ఒక్కటే సరిపోదు ఇంజనీరింగ్‌లో ఏ కోర్సును ఎంచుకున్నా నేర్చుకునే సామర్థ్యాన్ని, క్లిష్ట సమయాల్లో అనుసరించాల్సిన తీరును ఆకళింపు చేసుకోవాలి. ఇంజనీరింగ్ కోర్సుల ద్వారా విద్యార్థి ఇంజనీరింగ్ సంబంధిత అంశాల్లో పట్టు సాధిస్తాడు. కానీ మేనేజ్మెంట్ సంబంధిత అంశాల్లో పరిజ్ఞానం పొందలేడు. బీటెక్/బీఈ పూర్తిచేసిన వారిలో ఎక్కువమంది సాంకేతిక నైపుణ్యాలను ఒంటబట్టించుకుని ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. అయితే వారు ఉద్యోగం, వ్యాపారంలో రాణించాలంటే సాంకేతిక నైపుణ్యాలతోపాటు తప్పనిసరిగా నిర్వహణ నైపుణ్యాలు (మేనేజీరియల్ స్కిల్స్) అవసరమవుతున్నాయి. కాబట్టి ఇంజనీరింగ్ విద్యార్థి మేనేజ్మెంట్ కోర్సులను కూడా చదివితే మంచి ప్రొఫెషనల్‌గా ఎదిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో రోల్ ప్లేయింగ్, మేనేజ్మెంట్ మెథడ్స్, కేస్ స్టడీస్, ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెథడాలజీస్, ప్రజంటేషన్స్ వంటివాటిపై అవగాహన పెంచుకోవాలి. ఇంజనీరింగ్ పూర్తిచేసిన విద్యార్థి ఆల్‌రౌండర్‌గా రాణించేందుకు దోహదపడే మేనేజ్మెంట్ కోర్సులేవి? అంటే.. ఎంబీఏ/పీజీడీఎం... అనే సమాధానం వస్తుంది. ఎంటెక్/ఎంబీఏ సాంకేతిక రంగంలో అత్యుత్తమంగా రాణించాలనుకుంటే ఎంటెక్ చేయాలి. ఒకవే ళ అలా కాకుండా స్వశక్తితో వ్యాపార రంగంలో ఎదగాలనే పట్టుదల ఉంటే ఎంబీఏను ఎంచుకోవాలి. ఇప్పుడు ఇంజనీరింగ్ పూర్తిచేసిన విద్యార్థుల్లో చాలామంది మంచి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ లభిస్తున్నా వద్దనుకుని.. సొంత స్టార్టప్స్ వైపు అడుగులేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపార నిర్వహణ నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలంటే ఎంబీఏ తప్పనిసరి. బీటెక్ గ్రాడ్యుయేట్స్‌తో పోల్చుకుంటే ఎంబీఏ పూర్తిచేసినవారికి ఎంటర్ప్రెన్యూర్షిప్పరంగానే కాకుండా మంచి ఉద్యోగావకాశాలు కూడా లభిస్తున్నాయి. అనుబంధ కోర్సులతో అదనపు లాభం ఎంబీఏలో అనుబంధ కోర్సులు కూడా ఉన్నాయి. వాటిలో ప్రధానంగా ఆరోగ్య రక్షణ(హెల్త్ కేర్), పర్యాటకం (టూరిజం), ఆతిథ్య రంగం (హాస్పిటాలిటీ), రూరల్ మేనేజ్మెంట్, అగ్రిబిజినెస్, బ్యాంకింగ్- బీమా (బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్), రిటైల్, లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఫారెస్ట్ మేనేజ్మెంట్, టెలికాం మేనేజ్మెంట్లను పలు యూనివర్సిటీలు అందిస్తున్నాయి. ఈ కోర్సులు పూర్తిచేసినవారికి ప్రస్తుతం మంచి అవకాశాలు లభిస్తున్నాయి. స్పెషలైజేషన్ చేయాలంటే ? మార్కెటింగ్, మానవ వనరులు (హెచ్ఆర్), ఫైనాన్స్, ఆపరేషన్స్, సమాచారం-సాంకేతిక పరిజ్ఞానం (ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ), సిస్టమ్స్ ప్రధానమైనవి. కోర్సును ఎంపిక చేసుకునే ముందు స్వీయ అవగాహన ముఖ్యం. స్పష్టత లేకపోతే అధ్యాపకులు, అనుభవజ్ఞులు, మిత్రుల సలహా తీసుకోవాలి. తద్వారా సరైన నిర్ణయం దిశగా అడుగులేయాలి. మార్కెటింగ్‌ను ఎంచుకోవాలనుకుంటే..ప్రజలతో మాట్లాడటం, వారితో మమేకమయ్యే నైపుణ్యాలుతప్పనిసరి. మార్కెటింగ్ పరిశోధన, ఈ-మార్కెటింగ్, ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్, ప్రజా సంబంధాలు, డిజిటల్ మార్కెటింగ్, సేల్స్ ప్రమోషన్, నేరుగా విక్రయించడం, మార్కెటింగ్ విశ్లేషణ, సేల్స్ ప్రమోషన్ అండ్ అడ్వర్టైజింగ్ మొదలైనవి ఇందులో ఉంటాయి. ప్రస్తుతం ప్రతి సంస్థకు పదుల సంఖ్యలో సేల్స్, మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ అవసరం ఉంది. ఇక సంస్థల నిబంధనలు, యాజమాన్య నిర్వహణపై ఆసక్తి ఉంటే హ్యూమన్ రిసోర్సెస్‌లో స్పెషలైజేషన్ చేయడం ఉత్తమం. ఇందులోని మ్యాన్ పవర్ ప్లానింగ్, రిక్రూట్మెంట్, హెడ్ హంటింగ్, నియామకాలు, శిక్షణ, అభివృద్ధి, వేజ్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్, వివాదాల పరిష్కారం, విశ్లేషణ లాంటి పలు విభాగాల్లో క్రియాశీల పాత్ర పోషించవచ్చు. అయితే మార్కెటింగ్‌తో పోల్చుకుంటే హెచ్ఆర్లో అవకాశాలు కొద్దిగా తక్కువే. ఫైనాన్స్ ఎంచుకుంటే ఆర్థిక వ్యవహారాల్లో ఆసక్తి ఉంటే ఫైనాన్స్‌లో స్పెషలైజేషన్ చేయడం మంచిది. ప్రతి సంస్థకు అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ అవసరం ఉంటుంది. ట్రెజరీ ఆపరేషన్స్, వ్యాల్యూయేషన్ , ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, సెక్యూరిటీ అనాలిసిస్, పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్, ఫారెన్ ఎక్స్ఛేంజ్ ఆపరేషన్స్, కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్.. వంటివాటిలో అవకాశాలు అందుకోవచ్చు. అయితే చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్లకు ఈ రంగంలో ఉద్యోగాలు అధికం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ).. గత రెండు దశాబ్దాలుగా ఎంతో ఆదరణ పొందుతోంది. ఎక్కువ మంది విద్యార్థులు ఇందులోనే స్పెషలైజేషన్ చేస్తున్నారు. కారణం దీన్ని పూర్తి చేసిన వెంటనే మంచి ఉద్యోగ అవకాశాలు లభించడమే. క్లౌడ్ కంప్యూటింగ్, ఐటీ అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డెసిషన్ సపోర్ట్ సిస్టమ్స్, వెబ్ అప్లికేషన్స్, బిజినెస్ కంప్యూటింగ్, సాఫ్ట్ కంప్యూటింగ్ వంటివి ఐటీలో ఉంటాయి. అయితే దీనిని ఎంచుకునే ముందు సిలబస్, దాని పరిధి ఏమిటో క్షుణ్నంగా తెలుసుకొని అడుగువేయాలి. ఐటీలో పట్టు సాధిస్తే కోరినంత ప్యాకేజీతో కొలువును సొంతం చేసుకోవచ్చు. ఔట్సోర్సింగ్ ద్వారా విదేశాల నుంచి కొన్ని ప్రాజెక్టులను కూడా చేపట్టవచ్చు. ఆపరేషన్స్ అండ్ లాజిస్టిక్స్.. ఆపరేషన్స్ స్పెషలైజేషన్‌లో ఎంబీఏ చేసినవారికితయారీ రంగానికి చెందిన కంపెనీల్లో ఉద్యోగాలుంటాయి. సప్లై చైన్ మేనేజ్మెంట్ కూడా లాజిస్టిక్స్‌లో ఓ భాగం. ఎంబీఏలో లాజిస్టిక్స్ స్పెషలైజేషన్ ఉత్తీర్ణులకు ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉంది. సీఈఓ కావొచ్చు స్పెషలైజేషన్ చేయాలనుకున్నప్పుడు ప్రధానంగా కావాల్సింది ఆత్మవిశ్వాసం, నమ్మకం. ఎంచుకున్న అంశంలో ఎంతవరకు రాణించగల అవకాశం ఉందో తెలుసుకోవాలి. ప్రతి స్పెషలైజేషన్‌కు ఒక ప్రత్యేకత ఉంటుంది. దానికి మీ శక్తి సామర్థ్యాలు, వ్యక్తిత్వం సరిపోతాయా? నలుగురినీ ముందుకు నడిపించే నాయకత్వ లక్షణాలు మీలో ఉన్నాయా? సరిచూసుకోవాలి. అంతర్గత నైపుణ్యాలు, మార్కెట్ స్థితిగతులపై మంచి పట్టు సాధిస్తే.. నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటే 10-15 ఏళ్లలో మీరు పనిచేస్తున్న కంపెనీకి సీఈఓ కూడా కావచ్చు. అయితే ఎంబీఏ ఎక్కడ చేశారు? ఆ సంస్థ స్థాయి, గుర్తింపు వంటి అంశాలు కూడా ఉద్యోగ సాధనలో కీలకపాత్ర పోషిస్తాయి. అత్యుత్తమ ఎంబీఏ కళాశాలలేవో తెలుసుకోవడానికి వివిధ పత్రికలు, మేగజీన్స సర్వేలు నిర్వహిస్తుంటాయి. వీటి ఆధారంగా ఏ కళాశాలను ఎంచుకోవాలనేదానిపై అవగాహనకు రావచ్చు. ఎంబీఏ/పీజీడీఎంను అందించే విద్యా సంస్థలు ‘‘పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (పీజీడీఎం)/ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ (పీజీపీఎం) అనేవి ఎంబీఏను పోలిన కోర్సులు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లు ఈ కోర్సును అందిస్తున్నాయి. కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) స్కోర్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్/బృంద చర్చలు/అకడమిక్ రికార్డ్/వర్క్ ఎక్స్పీరియన్స్/పర్సనల్ ఇంట ర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లు కూడా ఎంబీఏను ఆఫర్ చేస్తున్నాయి. అదేవిధంగా హైదరాబాద్‌లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ (ఐపీఈ), యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ, నార్సీమోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ (ఐఎంటీ)లలో మేనేజ్మెంట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నిర్దేశిత మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి సంస్థను బట్టి క్యాట్/మ్యాట్/ఎక్స్‌ఏటీ/జీమ్యాట్/ఐసెట్/ఏటీఎంఏ స్కోర్ ఆధారంగా ప్రవే శం కల్పిస్తున్నాయి. ఇక విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఎంబీఏ చే యాలంటే గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జీమ్యాట్) లో మంచి ర్యాంకు సాధించాలి. అయితే విదేశీ వర్సిటీలు అభ్యర్థుల రెండు, మూడేళ్ల పని అనుభవానికి ప్రాధాన్యతనిస్తున్నాయి. - ప్రొఫెసర్. ఎ.రామచంద్ర ఆర్యశ్రీ, మాజీ డెరైక్టర్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, జేఎన్టీయూహెచ్ భావనలు, అన్వయ సామర్థ్యాలు ఇంజనీరింగ్ విద్యార్థి కెరీర్లో రాణించాలంటే ఇంజనీరింగ్ సూత్రాల అన్వయ సామర్థ్యం, నైపుణ్యాల నిర్వహణ, కింది స్థాయిలో పనిచేసేవారికి మార్గదర్శకత్వం, ప్రాజెక్టుల రూపకల్పనలో ప్రస్తుతం కావాల్సినవి ఏమిటో తెలుసుకోవడం వంటివి చాలా ముఖ్యం. భావనలు (కాన్సెప్ట్స్), అన్వయ సామర్థ్యాలు ఇంజనీరింగ్ డిగ్రీలోఉంటాయి. కానీ సంస్థాగత నైపుణ్యాలు, ప్రాజెక్టుల రూపకల్పనలో కిందిస్థాయి వారికి మార్గదర్శకత్వం, ప్రాజెక్టు నిర్వహణ లాంటి విషయాలు మేనేజ్మెంట్ డిగ్రీ అయిన ఎంబీఏలో ఉంటాయి. అందుకే బిజినెస్ స్కూళ్లలో ఎక్కువగా కేస్ స్టడీస్ అధ్యయనం చేయడంతోపాటు సంక్షోభం తలెత్తిన సందర్భంలో వాటిని ఎదుర్కొనే మార్గాలను బోధిస్తారు. -
సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ కోర్సు వివరాలు
ఎంటెక్ బయోటెక్నాలజీ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి? -స్టీవెన్, నల్గొండ. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్లతో ముడిపడి ఉన్న విభాగం బయోటెక్నాలజీ. దీని అనువర్తనాలను పలు విభాగాల్లో వినియోగించుకుంటారు. ఇంజనీరింగ్ సూత్రాలను అనుసరించి జీవకణాల లక్షణాలను విశ్లేషించడమే బయోటెక్నాలజీ. అగ్రికల్చర్, ఫుడ్‌ప్రాసెసింగ్, డ్రగ్ డెవలప్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్, హార్టికల్చర్, హెల్త్ కేర్, పర్యావరణం వాటిల్లో కొన్ని. హార్టికల్చర్, అగ్రికల్చర్, కెమికల్, బయో ప్రొడక్ట్స్, టెక్స్టైల్స్, హెల్త్‌కేర్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ-ప్రైవేట్ రంగంలోని పరిశోధన సంస్థలు, విద్యా సంస్థలు బయోటెక్నాలజీ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు: ఐఐటీ-ఖరగ్‌పూర్; వెబ్సైట్: www.iitkgp.ac.in ఐఐటీ-గౌహతి; వెబ్సైట్: www.iitg.ac.in ఐఐఐటీ-హైదరాబాద్;వెబ్సైట్: http://biotech.iith.ac.in చెఫ్‌గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నాను. సంబంధిత వివరాలను తెలపండి? -కరణ్, నిజామాబాద్.వివిధ హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాలను నాణత్యను పాటిస్తూ.. వృథా లేకుండా రుచిగా తయారు చేయడమే చెఫ్ ప్రధాన బాధ్యత. హోటల్ మేనేజ్మెంట్ లేదా కలినరీ టెక్నాలజీ సంబంధిత కోర్సులను ఎంచుకోవడం ద్వారా చెఫ్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లయిడ్ న్యూట్రిషన్ -హైదరాబాద్ (వెబ్సైట్: www. ihmhyd.org), కలినరీ అకాడమీ-హైదరాబాద్ (వెబ్సైట్: www.iactchefacademy.com) వంటి ఇన్స్టిట్యూట్లు డిప్లొమా నుంచి పీజీ వరకు వివిధ స్థాయిల్లో సంబంధిత కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సును పూర్తి చేసిన తర్వాత హోటల్స్, రెస్టారెంట్లు, ఎయిర్‌లైన్స్, క్రూయిజర్స్ వంటి డైనింగ్ ఎస్టా బ్లిష్మెంట్స్లో చెఫ్‌గా అవకాశాలు ఉంటాయి.రెన్యూవబుల్ ఎనర్జీ కోర్సులను అందిస్తున్న ఇన్స్టిట్యూట్లను తెలపండి? -సిద్ధూ, రామన్నపేట. పెరుగుతున్న ఇంధన అవసరాలు ఒక వైపు, మరో వైపు తరుగుతున్న వనరుల ఫలితంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. దాంతో జాబ్ మార్కెట్లో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల (రెన్యూవబుల్ ఎనర్జీ) పట్ల అవగాహన ఉన్న నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రెన్యూవబుల్ ఎనర్జీకి అకడమిక్ సబ్జెక్ట్‌లలో స్థానం కల్పించారు. కొన్ని యూనివర్సిటీలు ఎనర్జీ స్టడీస్-ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్‌లో భాగంగా ఈ సబ్జెక్ట్‌ను బోధిస్తున్నాయి. మరికొన్ని యూనివర్సిటీలు పీజీలో స్పెషలైజేషన్‌గా అందిస్తున్నాయి. ఇందులో సోలార్ ఎనర్జీ, బయోమాస్, విండ్ ఎనర్జీ, టైడ్ అండ్ వేవ్ ఎనర్జీ, ఫ్యూయల్ సెల్స్, హైడ్రోజన్ ఎనర్జీ, ఎనర్జీ మేనేజ్మెంట్, న్యూక్లియర్ ఎనర్జీ, ఎనర్జీ జనరేషన్, ఎనర్జీ పాలసీస్ వంటి అంశాలను బోధిస్తారు. సంబంధిత కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు సోలార్-విండ్-న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, బయోమాస్ కంపెనీలు, ఆర్కిటెక్చర్ ఫిర్మ్స్, ఎన్జీవో, ఇంధనానికి సంబంధించిన ప్రభుత్వ శాఖల్లో అవకాశాలు ఉంటాయి. రెన్యూవబుల్ ఎనర్జీ కోర్సులను అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు: యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం ఎన ర్జీ అండ్ స్టడీస్- డెహ్రాడూన్ కోర్సు: ఎంటెక్ (పవర్ సిస్టమ్స్) వెబ్సైట్: www.upes.ac.in అమిటీ యూనివర్సిటీ-నోయిడా కోర్సు: ఎంటెక్ (సోలార్ అండ్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ) వెబ్సైట్: www.amity.edu మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-భోపాల్ కోర్సు: ఎంటెక్ (రెన్యూవబుల్ ఎనర్జీ) వెబ్సైట్: www.manit.ac.in టెరీ యూనివర్సిటీ-ఢిల్లీ కోర్సు: ఎంటెక్ (రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ మేనేజ్మెంట్) వెబ్సైట్: www.teriuniversity.ac.in సాక్షి భవిత ఎడ్యుకేషన్ ఫెయిర్ జూన్ 14, 15 తేదీల్లో వేదిక: విశ్వేశ్వరయ్య భవన్, ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స, ఖైరతాబాద్ సర్కిల్, హైదరాబాద్.ఇంజనీరింగ్‌తోపాటు ఇతర కోర్సుల్లో చేరాలనుకుంటున్న విద్యార్థులకు ‘సాక్షి’ మార్గనిర్దేశనం చేయనుంది. ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్, ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్సలో జూన్ 14, 15న ‘సాక్షి భవిత ఎడ్యుకేషన్ ఫెయిర్-2014’ను నిర్వహించనుంది. ఇంజనీరింగ్‌లో ఏ కళాశాలలో చేరాలి? ఏ బ్రాంచ్‌ను ఎంచుకోవాలనే సందిగ్ధంలో ఉన్న విద్యార్థులకు ఈ ఫెయిర్ పరిష్కారం చూపనుంది. కళాశాలల వివరాలతోపాటు ఆయా బ్రాంచ్‌ల ప్రత్యేకత, భవిష్యత్‌లో ఉద్యోగ, ఉన్నత విద్యావకాశాల గురించి విద్యార్థులకు నిపుణులు అవగాహన కల్పిస్తారు. విద్యార్థులు ఫెయిర్‌లో ఏర్పాటు చేసిన కళాశాలల ప్రతినిధులతో నేరుగా సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. కార్యక్రమానికి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈవెంట్ స్పాన్సర్‌గా, భారత్ ఇన్‌స్టిట్యూషన్‌స అసోసియేట్ స్పాన్సర్సగా, వైఈఎస్(యూత్ ఎంప్లాయిబిలిటీ సర్వీసెస్) నాలెడ్‌జ పార్టనర్‌గా, 92.7 బిగ్ ఎఫ్.ఎం. రేడియో పార్టనర్‌గా వ్యవహరిస్తున్నా యి. ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలకు ఎంపీ రావు (9912220375), రోహన్ (9951603007), వేణు (9951602991)ను సంప్రదించొచ్చు. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ కోర్సు గురించి వివరాలు తెలపండి? ఈ కోర్సు చేస్తే ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? -రాజా, అలంపూర్.ఫైనాన్షియల్ ప్లానర్ సర్టిఫికెట్‌కు అంతర్జాతీయంగా ఫైనాన్షియల్ రంగంలో గుర్తింపు ఉంది. అనేక సంస్థలు ఈ సర్టిఫికెట్‌ను ప్రత్యేక అర్హతగా గుర్తిస్తున్నాయి. అందుకే ఈ సర్టిఫికెట్ పొందే ప్రక్రియ కూడా ఎంతో కఠినంగా ఉంటుంది. శిక్షణ, పని అనుభవం, మూల్యాంకనం ఇలా అన్ని అంశాల్లో నైపుణ్యాన్ని పరిశీలిస్తారు. వాటన్నిటినీ సంతృప్తికరంగా పూర్తి చేస్తేనే సర్టిఫికెట్ లభిస్తుంది. ఈ సర్టిఫికెట్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక సేవల పరిశ్రమల్లో అవకాశాలకు మార్గాలు చూపుతుంది. మన దేశంలో ఫైనాన్షియల్ ప్లానింగ్ సర్వీస్ బోర్డు ఆఫ్ ఇండియా (ఎఫ్‌పీఎస్‌బీ) సీఎఫ్‌పీ సర్టిఫికెట్‌ను అందజేస్తుంది. సర్టిఫికెట్ పొందే ప్రక్రియ: ఎఫ్పీఎస్బీఐ అధీకృత భాగస్వామ్య శిక్షణ సంస్థల్లో శిక్షణ పొందాలి. ఇది ఐదు మాడ్యూల్స్‌లో ఉంటుంది. ఎన్ఎస్ఈ నిర్వహించే 1-4 పరీక్షల్లో ఉత్తీర్ణులవ్వాలి. తర్వాత ఉద్యోగం పొందడానికి అవసరమైన పని అనుభవం గడించాలి. ఆ సమయంలో ఎఫ్‌పీఎస్‌బీ కోడ్ ఆఫ్ ఎథిక్స్‌కు, బిహేవియరల్ స్కిల్స్, ప్రాక్టీస్ ప్రమాణాలు, క్రమశిక్షణకు సంబంధించిన నియమ, నిబంధనలు, పద్ధతులపై తర్ఫీదు పొందుతారు. సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీస్, ఉత్పత్తులు, క్లయింట్స్‌పై మార్పుల ప్రభావం వంటి అంశాలను అప్డేట్ చేసుకోవాలి. కెరీర్: సర్టిఫికెట్ పొందిన తర్వాత అభ్యర్థులకు బ్యాంకులు, ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీలు. వెల్త్ ప్లానింగ్ కంపెనీలు, స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు, విద్యా సంస్థలు, ఎంటర్ప్రెన్యూర్ రంగంలో అవకాశాలు లభిస్తాయి. ఇగ్నో ప్రవేశాలు ప్రపంచంలోనే అతి పెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయాల్లో ఒకటైన.. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో)..ప్రతి సంవత్సరం జనవ రి, జూన్లలో రెండు విడతలుగా అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహిస్తుంది. ప్రస్తుతం జూన్ సెషన్‌కు సంబంధించి ఇగ్నో నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ స్పెషలైజేషన్స్‌తో మాస్టర్స్, బ్యాచిలర్ డిగ్రీ కోర్సులను అందిస్తుంది. వివరాలు.. మాస్టర్స్ డిగ్రీ: మాస్టర్ డిగ్రీని ఎంచుకున్న అభ్యర్థులు సంబంధిత కోర్సును రెండు నుంచి ఐదేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ విభాగం కింద అందిస్తున్న కోర్సుల కోసం ఏదైనా సబ్జెక్ట్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మాస్టర్ ఆఫ్ సైన్స్ విభాగంలో ఉండే కోర్సులకు మాత్రం సంబంధిత/ అనుబంధ సబ్జెక్ట్‌లో డిగ్రీ చేసిన విద్యార్థులు మాత్రమే అర్హులు. టెక్నికల్ అంశాలతో ముడిపడి ఉన్న కోర్సులకు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. స్పెషలైజేషన్స్: ఎంసీఏ (కంప్యూటర్ అప్లికేషన్స్), ఎంఎస్సీ (డైటిక్స్ అండ్ ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్, కౌన్సెలింగ్ అండ్ ఫ్యామిలీ థెరపీ), ఎంఏ (రూరల్ డెవలప్మెంట్, టూరిజం మేనేజ్మెంట్, ఇంగ్లిష్, హిందీ, సోషల్ వర్క్, ఫిలాసఫీ, గాంధీ అండ్ పీస్ స్టడీస్, ఎడ్యుకేషన్, పార్టిసిపేటరీ డెవలప్మెంట్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, సైకాలజీ, ఎక్స్టెన్షన్ అండ్ డెవలప్మెంట్ స్టడీస్, జెండర్ డెవలప్మెంట్ స్టడీస్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఆంత్రోపాలజీ, అడల్ట్ ఎడ్యుకేషన్, ఉమెన్ అండ్ జెండర్ స్టడీస్), ఎంకామ్, ఎంఎస్‌డబ్ల్యూ కౌన్సెలింగ్.బ్యాచిలర్ డిగ్రీ: బ్యాచిలర్ డిగ్రీ కోర్సులను ఎంచుకున్న అభ్యర్థులు సంబంధిత కోర్సును మూడు నుంచి ఆరేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అర్హత: 10+2 ఉత్తీర్ణత (బీఎస్సీ కోర్సులకు సైన్స్ స్ట్రీమ్ చదివి ఉండాలి). స్పెషలైజేషన్స్: బీసీఏ కంప్యూటర్ అప్లికేషన్స్, బీఏ టూరిజం స్టడీస్, బీఏ, బీఎస్సీ, బీకామ్, బీఏ (సోషల్ వర్క్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్, ప్రిపరేటరీ ప్రోగ్రామ్). మాస్టర్స్, బ్యాచిలర్తోపాటు డిప్లొమా విభాగంలో 53 కోర్సులు, సర్టిఫికెట్ విభాగంలో 58 కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా కోర్సులకు/సర్టిఫికెట్ కోర్సులకు అర్హత: 10+2, పీజీ డిప్లొమా కోర్సులకు/ పీజీ సర్టిఫికెట్ కోర్సులకు-బ్యాచిలర్ డిగ్రీ. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత ఫీజును కూడా ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చు. ఆఫ్‌లైన్ విధానంలో ఫీజును డీడీ రూపంలో స్వీకరిస్తారు. ఆన్లైన్ దరఖాస్తు తర్వాత ప్రింట్ అవుట్, సంబంధిత సర్టిఫికెట్లను జతచేసి దగ్గర్లోని ఇగ్నో కేంద్రానికి పంపాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూన్ 20, 2014. రూ. 300 లేట్ ఫీజుతో దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూన్ 31, 2014. వివరాలకు: http://ignou.ac.in ది ఫుల్బ్రైట్ నెహ్రూ ఫెలోషిప్ అమెరికాలోని ఎంపిక చేసిన విశ్యవిద్యాలయాల్లో మాస్టర్స్ డిగ్రీ చేసే అవకాశం కల్పిస్తోంది.. ది ఫుల్బ్రైట్ నెహ్రూ ఫెలోషిప్. యునెటైడ్ స్టేట్స్-ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ (యూఎస్ఐఈఎఫ్) ఈ ఫెలోషిప్‌ను అందజేస్తోంది.అందిస్తున్న సబ్జెక్ట్‌లు: ఆర్ట్స్ అండ్ కల్చర్ మేనేజ్మెంట్తోసహా హేరిటేజ్ కన్జర్వేషన్ అండ్ మ్యూజియమ్ స్టడీస్, ఎన్విరాన్మెంట్ సైన్స్/స్టడీస్, హయ్యర్ ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ హెల్త్, ఆర్బన్ అండ్ రీజనల్ ప్లానింగ్, ఉమెన్స్ స్టడీస్/జెండర్ స్టడీస్. అర్హతలు: గుర్తింపు ఉన్న యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో యూఎస్ బ్యాచిలర్ డిగ్రీతో సమానమైన డిగ్రీ. ఈ క్రమంలో బ్యాచిలర్/మాస్టర్ డిగ్రీ ఏదైనా కావచ్చు. బ్యాచిలర్ డిగ్రీ అయిన పక్షంలో దాని కాల వ్యవధి నాలుగేళ్లు ఉండాలి. అదే సమయంలో యూఎస్‌లోని ఏ యూనివర్సిటీ నుంచైనా మరొక డిగ్రీ కానీ కోర్సులో కానీ చేరి ఉండకూడదు. కనీసం మూడేళ్ల ప్రొఫెషనల్ అనుభవం. స్వదేశానికి తిరిగి వచ్చి సేవా చేస్తామనే దృక్పథం, చక్కని నాయకత్వ లక్షణాలు ఉండాలి.ఎంపిక: వచ్చిన దరఖాస్తుల్లోంచి షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు న్యూఢిల్లీలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వీరిల్లోంచి అర్హులను ఎంపిక చేస్తారు. వీరు నిర్దేశించి టోఫెల్/జీఆర్ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ అభ్యర్థుల దరఖాస్తులను ఫుల్బ్రైట్ ఫారెన్ స్కాలర్షిప్ బోర్డుకు తుది ఎంపిక కోసం పంపిస్తారు. వీరు నేరుగా ఇన్స్టిట్యూట్లకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రయోజనాలు: జే-1 వీసా స్వస్థలం నుంచి ఇన్స్టిట్యూట్ ఉన్న పట్టణం వరకు ఎకానమీ క్లాస్‌తో విమాన ప్రయాణానికి ఏర్పాట్లు ట్యూషన్ ఫీజుతోపాటు వసతి, సంబంధిత ఖర్చులకు ఫండింగ్ దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 1, 2014. వివరాలకు: www.usief.org.in జాబ్ రిమైండర్సబోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ పోస్టులు దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 7, 2014 వివరాలకు: http://bsf.nic.in ........................................................ ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:జూన్ 30, 2014 వివరాలకు: http://joinindianarmy.nic.in ........................................................ ఎస్ఎస్సీ స్టెనోగ్రాఫర్స్ పోస్టులు: 534 దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 27, 2014 వివరాలకు: http://ssc.nic.in ........................................................ ఇండియన్ నేవీ ఆర్టిపైసర్ అప్రెంటీస్ సెయిలర్ బ్యాచ్-2015 ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ:జూన్ 20, 201410+2 క్యాడేట్ ఎంట్రీ స్కీమ్ డిసెంబర్-14 ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ:జూన్ 23, 2014 వివరాలకు: ://nausenabharti.nic.in ........................................................