breaking news
ENC satyanarayanareddy
-
‘రాజకీయ లబ్ధి కోసం జల వివాదాలకు దిగడం భావ్యం కాదు’
సాక్షి, అమరావతి : తెలంగాణ ప్రభుత్వం జల ఒప్పందాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీఆర్ యాక్ట్, కేఆర్ఎంబీ ఆదేశాలను తెలంగాణ పట్టించుకోవడం లేదని, రాజకీయ ప్రయోజనాల కోసం జలవివాదాలకు దిగడం భావ్యం కాదన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఒకరి అవసరాలు ఒకరు గుర్తించి అభిప్రాయాలను గౌరవించాలి. శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగినప్పుడు అండగా నిలిచాము. తెలంగాణకు నీటి అవసరాలు ఉంటే సహకరించేవాళ్లం. అన్నీ మర్చిపోయి పోలీసులను దించి యుద్ధ వాతావరణం కల్పించారు. పులిచింతల బ్యారేజీపై హక్కు లేకున్నా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. సాగునీరు విడుదల సమయంలో విద్యుదుత్పత్తి చేస్తే ఏ సమస్య రాదు. జాతీయ జలవిధానాన్ని ఉల్లఘించినందునే సమస్య తలెత్తింది. తెలంగాణ అనాలోచిత నిర్ణయం వల్ల నీటి కష్టాలు వస్తాయి. ఏపీ, తమిళనాడు రాష్ట్రాలకు సాగు, తాగునీటి ఇబ్బందులొస్తాయి. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి సమస్య పరిష్కరిస్తుందని భావిస్తున్నాం’’అని అన్నారు. -
ఇంత దారుణమా..?
- పుష్కరాల పనుల్లో జిల్లా వెనుకబడింది - ఇంకెప్పుడు పూర్తి చేస్తారు - పార్కింగ్ స్థలాలు అవసరమో లేదో తెలియదా..? - ప్రపోజల్స్, పనులు చూస్తే నవ్విపోతారు - పంచాయతీరాజ్ ఇంజినీర్లపై ఈఎన్సీ సత్యనారాయణరెడ్డి అసహనం ఇందూరు : ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా నిర్వహించే పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిద్దామని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కానీ, మీరేమో ఇక్కడ ఒక్క పని కూడా పూర్తి చేయలేదు. పుష్కర ఘాట్ల వద్ద పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా మీకు రాలేదా..? ఈ ప్రపోజల్స్ను... పనులను ఎవరికైనా చూపిస్తే నవ్విపోతారు. ఇంత దారుణంగా ఏ జిల్లాలో లేదు. నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా.. పట్టించుకున్న నాథుడే లే డు.’ అని పంచాయతీ రాజ్ ఇంజనీర్ ఇన్ ఛీఫ్ (ఈఎన్సీ) ఎం. సత్య నారాయణరెడ్డి పంచాయతీ రాజ్ ఇంజినీర్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గురువారం జిల్లా సందర్శనకు వచ్చిన ఆయన పలు మండలాలను పర్యటించి పుష్కర ఘాట్ల వద్ద చేపడుతున్న పనులను పర్యవేక్షించారు. అనంతరం జిల్లా కేంద్రానికి చేరుకుని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఇంజినీర్ అధికారులు, కాంట్రాక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో 433 ప్యాకేజీలకు, 3420 రోడ్లు వేస్తున్నామన్నారు. నిజామాబాద్లో 16 పుష్కర ఘాట్లకు గాను 15 ఘాట్లకు టెండర్లు నిర్వహించగా, ఇందులో మూడింటికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో టెండర్లు రాలేదని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు పనుల విషయంలో తికమకపడుతున్నారని, గత సమావేశంలో అన్ని వివరించి చెప్పినా ఇంజనీర్లకు అర్థం కాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లాలో ప్రారంభించిన పనులు ఏ ఒక్కటి కూడా ముందుకు కదలడం లేదని, గ్రౌండింగ్, ప్రోగ్రెస్, పర్ఫామెన్స్లో దారుణంగా ఉందని అన్నారు. ఇలాగైతే పనులెప్పుడు పూర్తి చేస్తారని మండిపడ్డారు. ఎక్కువ జన తాకిడి ఉండే కందకుర్తి ఘాట్లో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయకపోవడం దారుణమని, ఇదొక్కటే కాకుండా చాలా చోట్ల పార్కింగ్ స్థలాలు నిర్మించకుండా పనులు చేపట్టడం సిగ్గుచేటన్నారు. పుష్కర పనులపై సీఎం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, ఉన్నతాధికారులపై ఒత్తిడి తీవ్రం గా ఉందని చెప్పారు. సమష్టిగా పని చేసి జిల్లా రూపు రేఖలు మార్చాలని సూచించారు. జూన్ 15 గడువు... పుష్కరాల పనులపై చాలా ఒత్తిడి ఉందని, ఇంకా నెల న్నర సమయం ఉందని, ఏ మాత్రం ఆలస్యం చేయొద్దని ఇం జినీర్లకు సూచించారు. ప్రారంభమైన పనులను, టెండర్లు రాని పనులను జూన్ 15వ తేదీలోగా పూర్తి చేయూలని ఆదేశించారు. గతంలో నిజామాబాద్లో ఐదు పుష్కర ఘాట్లు ఉంటే, 11 కొత్త వాటితో కలుపుకుని మొత్తం 16 ఘాట్లు పూర్తి చేయాలని సూచించారు. అన్ని ఘాట్ల వద్ద పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఏర్పాటు చేయని వాటికి కలెక్టర్ ద్వారా ప్రపోజల్స్ను 24 గంటల్లో తనకు పంపించాలని పంచాయతీరాజ్ ఎస్ఈ సత్యమూర్తిని ఆదేశించారు.60 శాతం పనులు పూర్తి చేయకపోతే సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను బాధ్యులను చేయాల్సి ఉంటుం దని హెచ్చరించారు. ఆర్అండ్బీ రోడ్డు నుంచి పుష్కర ఘాట్ వరకు రోడ్లు వేయడం, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయ డం పంచాయతీరాజ్ శాఖ ప్రధాన ఉద్దేశమన్నారు. చేసే పనులు నాణ్యంగా ఉండాలన్నారు. అనంతరం ఎంఆర్ఆర్, ఆర్ఐడీఎఫ్, బీఆర్జీఎఫ్, నాబార్డు, 13వ ఆర్థిక సంఘం, తదితర పథకాల నిధుల ద్వారా చేపడుతున్న భవనాలు, రోడ్డు పనులు, వాటి పురోగతిపై సమీక్షించారు. పీఆర్ డిప్యూటీ డీఈ జలేందర్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.