breaking news
employment notifications
-
ఇందిరాపార్క్ వద్ద ఏపీ నిరుద్యోగుల ఆందోళన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద గురువారం వారు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొని గ్రూప్-2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1లో కలపడాన్ని నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
ప్రి‘పరేషాన్’..
‘సిలబస్ మార్పు’ ప్రకటనతో నిరుద్యోగుల్లో ఆందోళన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ పరీక్షల ‘సిలబస్ మార్పు’ అంశం అలజడి సృష్టిస్తోంది.. విద్యార్థులు, నిరుద్యోగుల్లో నిరాశను నింపుతోంది.. ఇప్పట్లో ఎలాంటి నోటిఫికేషన్లు ఉండవన్న రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి ప్రకటనతో లక్షలాది మంది నిరుద్యోగులు అయోమయంలో పడిపోయారు. తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు అనుగుణంగా గ్రూప్ పరీక్షల సిలబస్ మార్చిన తరువాతే కొత్త నోటిఫికేషన్లు ఉంటాయనడంతో.. పోటీ పరీక్షల కోసం రాత్రింబవళ్లు కష్టపడి చదువుకుంటున్న విద్యార్థులు, నిరుద్యోగులు గందరగోళంలో పడిపోయారు.. వేలకు వేలు చెల్లించి తీసుకుంటున్న కోచింగ్ వృథా అయిపోతుందేమోనని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి జాప్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని, ప్రస్తుతమున్న సిలబస్‌ల ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ, బీసీ సంక్షేమ సంఘం తదితర సంఘాల ఆధ్వర్యంలో అభ్యర్ధులు ఇటీవల భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. రాష్ట్రం వచ్చినా ఉద్యోగాలేవి..? అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపడతామని ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పడి, సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించినా... ఇప్పుడు ఉద్యోగ నియామకాలపై మీనమేషాలు లెక్కిస్తుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వయోపరిమితి దాటేందుకు దగ్గరలో ఉన్న అభ్యర్థులు ఈ జాప్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, హైదరాబాద్‌లోని కోచింగ్ కేంద్రాలు, ఉస్మానియా, కాకతీయ సహా విశ్వ విద్యాలయాల లైబ్రరీల్లో... ఇలా ఎక్కడ చూసినా వేల సంఖ్యలో అభ్యర్థులు పోటీ పరీక్షల కోసం చదువుతూనే కనిపిస్తారు. ఇప్పటివరకు తాము కష్టపడి చదువుకున్న సిలబస్ అంతా పనికిరాకుండా పోతుందనే ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. వేలకు వేలు పెట్టి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు ఉంటాయన్న ఉద్దేశంతో లక్షలాది మంది కోచింగ్ కేంద్రాలకు పరుగులు తీశారు. వేల రూపాయలు వెచ్చించి శిక్షణ తీసుకుంటున్నారు. ఇలా నిరుద్యోగుల నుంచి డిమాండ్ వెల్లువెత్తడంతో.. కోచింగ్ సెంటర్లు నిండిపోయాయి. ఇది ఎంతగా పెరిగిపోయిందంటే.. తరగతి గదుల కొరత ఏర్పడి, ఫంక్షన్ హాళ్లు, కల్యాణ మండపాల్లో కోచింగ్ కూడా ఇవ్వడం మొదలుపెట్టారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, వీఎస్టీ, రాంనగర్, దోమల్‌గూడ తదితర ప్రాంతాల్లోని ఫంక్షన్‌హాళ్లు, ఆడిటోరియాలు అద్దెకు తీసుకొని శిక్షణ ఇస్తున్నారు. కోచింగ్‌కు ఫీజులు కూడా భారీగా పెంచారు. రూ. 10 వేలలోపు ఉన్న కోచింగ్ ఫీజులు.. రూ. 20 వేల వరకు పెరిగాయి. ఈ క్రమంలో రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో ప్రారంభమైన గ్రూప్-1, 2, ఇతర పోటీ పరీక్షల కోచింగ్ ఇప్పుడు ముగింపు దశకు వచ్చింది. ఇలా వేలకు వేలు చెల్లించి లక్షలాది మంది అభ్యర్థులు కోచింగ్ పొందారు.. కానీ కొత్త నోటిఫికేషన్ల కోసం మరో ఆరు నెలలదాకా ఆగాల్సిందేనంటూ ప్రభుత్వం నుంచి ప్రకటనలు వెలువడడం, సిలబస్‌ను మార్చుతామని పేర్కొనడం.. ఇటు విద్యార్థులను, అటు కోచింగ్ కేంద్రాలను గందరగోళంలోకి నెట్టింది. భగ్గుమంటున్న విద్యార్థి సంఘాలు.. నోటిఫికేషన్ల విడుదలలో జాప్యం పట్ల విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. లక్షలాది మంది యువత కొత్త రాష్ట్రంలో బంగారు భవితవ్యంపై కలలుగన్నారని... కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఆరునెలలు దాటిపోయినా ఉద్యోగాల భర్తీ ఊసెత్తకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు ఉద్యమం చేపట్టనున్నట్లు ప్రకటించాయి. ఉన్నపళంగా మార్చితే ఎలా..? ‘చాలా కాలంగా గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నాం.. ఉన్నపళంగా సిలబస్ మార్చితే ఎలా? ఇప్పటివరకు పడిన మా శ్రమ అంతా వృథా అయినట్లేనా? ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని సహించబోం. ఒక్క నోటిఫికేషన్ అయినా పాత సిలబస్ ప్రకారంగా ఇవ్వాలి.’ - వెంకట్, గ్రూప్స్ అభ్యర్థి వేలకు వేలు ఖర్చు చేశాం.. ‘గ్రూప్స్ పరీక్షల ప్రిపరేషన్ కోసం వేలకు వేలు ఖర్చు చేశాం. పుస్తకాలు, వివిధ మెటీరియల్‌ను కొనుగోలు చేసి.. రాత్రీపగలూ కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతున్నాం. ఇప్పుడు అవన్నీ పక్కన పడేసి కొత్తవి కొనుక్కోవాల్సిందేనా? మళ్లీ కొత్తగా కోచింగ్ తీసుకోవాలన్నా par కష్టమే.’ - శాంతి, గ్రూప్స్ అభ్యర్థిని వర్సిటీలకు అప్పగించండి.. ‘ఉద్యోగ పరీక్షల కోసం లక్షలాది మంది ఐదేళ్లుగా కష్టపడి చదువుతున్నారు. ఉద్యోగాల భర్తీ పరీక్షలను టీఎస్పీఎస్సీసీ ద్వారా కాకుండా వర్సిటీలకు అప్పగించాలి. కేసీఆర్ వైఖరిపై ఆందోళనలు చేపడతాం.’ - మానవతారాయ్, తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సిలబస్ మార్పు ఓ డ్రామా.. ‘రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ వెంటనే భర్తీ చేయాలి. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి అధికారంలోకి వ చ్చిన టీఆర్ఎస్.. ఇప్పుడు కాలయాపన చేయడం సరికాదు. సిలబస్ మార్పు అనేది డ్రామా. ఎక్కడైనా సరే సిలబస్ మార్చాలంటే మూడేళ్ల ముందుగా కసరత్తు చేపట్టాల్సి ఉంటుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం విరుద్ధంగా వ్యవహరిస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం..’’ - ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు