breaking news
Eccerla
-
వినోదం.. కారాదు విషాదం!
సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్: ర్యాగింగ్.. సీనియర్లకు వినోదం, జూని యర్లకు ప్రాణసంకటం. మొదట సరదాగానే ఉన్నా పరిస్థితి చేయిదాటి ఒక్కోసారి విషాదంగా మారుతోంది. ఈ పరిస్థితి రాకుండా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే సీనియర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ర్యాగింగ్ వల్ల కలిగే అనర్ధాలను, శిక్షలను వివరించడంతో పాటు జూనియర్లతో స్నేహభావం కొనసాగించే విధానంపై అవగాహన కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. కోటి ఆశలతో కొత్త విద్యార్థులు.. పోస్టు గ్రాడ్యుయేషన్‌లో చేరాక విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి. భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలి. డిగ్రీ వరకు పరిస్థితి ఎలా ఉన్నా పీజీ స్థాయిలో విద్యార్థుల్లో స్నేహ సంబంధాలు కీలకం. జూనియర్, సీనియర్ అభ్యర్థుల మధ్య స్నేహం అవసరం. ర్యాగింగ్ వంటి చర్యలకు దూరంగా ఉండాలి. జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో మొదటి ఏడాది ప్రవేశాలు పూర్తి కావడం, వసతి గృహంలో సీట్లు కేటాయింపు కూడా పూర్తవడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎక్కువగా చేరారు. వీరంతా కొంచెం బిడియంతో ఉంటారు. ఈ సమయంలో ర్యాగింగ్ జరిగే ఆస్కారం ఉంటుంది. శ్రుతిమించితే కష్టమే.. అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం ర్యాగింగ్ నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా, గతంలో తరగతి గదులు, వసతి గృహాల్లో ర్యాగింగ్ జరిగిన సంఘటనలు ఉన్నా యి. జూనియర్ల బయోడేటాలు అడగటం, భోజనం సమయంలో ప్లేట్లు తీసుకువెళ్లడం వంటివి జరిగేవి. ఇవన్నీ సరదాగా సాగితే ఏ సమస్యా ఉండదు. పరిచయ కార్యక్రమం కాస్త శ్రుతిమించితేనే ఇబ్బందులు తప్పవు. కొందరు సీనియర్లు ర్యాగింగ్ పేరిట వికృత శ్రేష్టలు, నేరాలకు పాల్ప డితే సమస్యలు ఎదుర్కోక తప్పదు. కఠిన చర్యలు తప్పవు.. ఏపీలో ర్యాగింగ్ నియంత్రణ చట్టం–1997 ప్రకారం.. విద్యా సంస్థ లోపల, బయట ఎక్కడ ర్యాగింగ్ చేయకూడదు. భయపెట్టే చర్యలకు పాల్పడటం, అవమానించటం, వేధించటం, గాయపర్చటం వంటి చర్యలకు పాల్పడితే ఆరు నెలలు జైలు శిక్ష, వెయ్యి రూపాయల అపరాధ రుసుం విధిస్తారు. క్రిమినల్ చర్యలకు పాల్పడితే సంవత్సరం శిక్ష, రెండు వేల అపరాధ రుసుం కట్టాల్సి ఉంటుంది. క్రిమినల్ ఫోర్స్ వంటి నేరానికి పాల్పడితే రెండేళ్ల శిక్ష, ఐదు వేల జరిమానా విధిస్తారు. కిడ్నాప్, అత్యాచారానికి పాల్పడితే రూ.10 వేలు అపరాధ రుసుం, ఐదేళ్ల శిక్ష వర్తిస్తుంది. ర్యాగింగ్ కేసు నమోదైతే సదరు విద్యార్థిని కళాశాల నుంచి పంపించేస్తారు. ఇతర కళాశాలల్లో సైతం చేర్పించుకోరు. విద్యార్థిపై ఒక్కసారి ర్యాగింగ్ కేసు నమోదైతే విలువైన జీవితం ముగుస్తుంది. విద్యాసంస్థదే బాధ్యత.. సుప్రీం కోర్టు సూచనల నేపథ్యంలో విద్యాసంస్థలు ర్యాగింగ్ నియంత్రణకు పక్కాగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిస్థా యి నియంత్రణలో విద్యాసంస్థదే బాధ్యత. ర్యాగింగ్ వ్యతిరేక కమిటీలు వేయాలి. వీటిలో సీనియర్, జూనియర్ విద్యార్థులను భాగస్వాములను చేయాలి. విద్యార్థులు, అధ్యాపకులు, బోధన సిబ్బంది కమిటీలో సభ్యులు గా ఉండాలి. ఐదుగురు నుంచి ఆరుగురితో కమిటీలు పక్కాగా నిర్వహించాలి. ప్రచార ఫ్లెక్సీలు ప్రదర్శించి అధికారుల ఫోన్ నంబర్లు పొందుపరిచాలి. వసతి గృహాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. ధ్రువీకరణ తీసుకుంటున్నాం ర్యాగింగ్‌కు పాల్పడబో మని ప్రవేశ సమయంలో నే విద్యార్థుల ధ్రువీకరణ తీసకుంటున్నాం. వర్సిటీలో ర్యాగింగ్‌కు ఆస్కార మే లేదు. ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. వసతి గృహాల్లో నిరంతరం నిఘా పెట్టాం. అకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాం. విద్యార్థులు, బోధన సిబ్బందితో ర్యాగింగ్ నియంత్రణ కమిటీలు నియమిస్తున్నాం. ప్రిన్సిపాళ్లను అప్రమత్తం చేస్తున్నాం. –ప్రొఫెసర్ కూన రామ్‌జీ, వైస్ చాన్సలర్, బీఆర్‌ఏయూ అవగాహన కల్పిస్తున్నాం విద్యార్థులకు భవిష్యత్‌పై అవగాహన కల్పిస్తున్నాం. భవిష్యత్తు, జీవితం విలు వ తెలిసిన వారు ర్యాగింగ్‌కు పాల్పడరు. తరగతి గదులు, వసతి గృహంలో ర్యాగింగ్‌కు అవకాశం లేకుండా చర్యలు చేపడుతున్నాం. విద్యార్థులు ప్రశాం తంగా చదువుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాం. విద్యార్థులు వర్సిటీలోకి లక్ష్యాలతో అడుగు పెడతారు. వాటిని చేరుకోవాలంటే పట్టుదలతో చదవడం ఒక్కటే మార్గం. – ప్రొఫెసర్ కె,రఘుబాబు, రిజిస్ట్రార్, బీఆర్‌ఏయూ -
భవిష్యత్ ఫార్మారంగానిదే..
ఎచ్చెర్ల: భవిష్యత్ అంతా ఫార్మారంగానిదేనని ముంబయికి చెందిన ఐపీఏ సంస్థ ఉపాధ్యక్షుడు డాక్టర్ టీవీ నారాయణ అన్నారు. చిలకపాలేం సమీపంలోని శివానీ కాలేజ్ ఆఫ్ పార్మసీలో బుధవారం ‘ఫార్మా కార్నివాల్- 2016 నేషనల్ లెవల్ సింపోషియం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం భారతదేశ ంలో శరవేగంగా ఫార్మారంగం విస్తరిస్తోందన్నారు. బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మాడీ వంటి కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు మంచి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఫార్మసిస్టులకు విదేశాల్లో వైద్యులతో సమానగుర్తింపు లభిస్తోందని చెప్పారు. వైద్యులు రోగాలు నిర్థారిస్తే ఫార్మసిస్టులు మందులు నిర్ణయిస్తారన్నారు. విద్యార్థులు విషయ పరిజ్ఞానంపై పట్టు సాధించాలన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. జేఎన్టీయూ కాకినాడ బోర్డాఫ్ స్టడీస్ చెర్మైన్ ప్రొఫెసర్ కేపీఆర్ చౌదిరి మాట్లాడుతూ విద్యార్థులు ఫార్మారంగంలో రాణించాలంటే ప్రస్తుత ట్రెండ్ తెలుకోవాలన్నారు. ప్రస్తుతం నైపుణ్యాలు ఆధారంగానే ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో జేఎన్టీయూ కాకినాడ ఫార్మసీ డెరైక్టర్ డాక్టర్ ఎస్వీయూ ఎం.ప్రసాద్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వెంకటేశ్వరరావు, ఎస్ఎస్ఐటీ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.రమేష్‌బాబు, మేనేజ్ మెంట్ సభ్యులు వీఎంఎం సాయినాథ్‌రెడ్డి, పి.దుర్గాప్రసాద్‌రాజు, డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
నాగార్జున అగ్రికెం పరిశ్రమలో ప్రమాదం
ఎచ్చెర్ల : అరిణాం అక్కివలస పరిధిలోని నాగార్జున అగ్రికెం పరిశ్రమలో గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఐదుగురు కార్మికులు గాయపడ్డారు. ఉదయం ఏ షిఫ్ట్ నడుస్తున్న సమయంలో 6.30 గంటలకు సల్ఫ్యూరిక్ యూసిడ్ పైపు లీకైంది. దీని నుంచి తుంపర్లు వెలువడి ఆ ప్రాంతంలో పని చేస్తున్న ఐదుగురు కార్మికులు గాయపడ్డారు. వెంటనే పరిశ్రమకు చెందిన అంబులెన్స్‌లో శ్రీకాకుళంలోని సింధూర ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో శాంతారావు, రామకృష్ణ, వెంకటేష్, సంతోష్, వెంకటరావు ఉన్నారు. అరుుతే పరిశ్రమ యూజమాన్యం ఈ సంఘటనను గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసింది. కార్మికులు క్షేమం... ప్రమాదం అనంతరం విషయం బయటకు పొక్కడంతో పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ సి.వరదరాజులు విలేకరులతో మాట్లాడారు. కర్మాగారంలో చిన్న ప్రమాదం చోటు చేసుకుందని, గాయపడ్డ కార్మికులు క్షేమంగా ఉన్నారని చెప్పారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కూడా అయ్యూరని తెలిపారు. పరిశ్రమలో అంగుళం ఉండే యూసిడ్ పైప్ లీక్ వల్ల ఈ సంఘటన చోటు చేసుకుందన్నారు. గాయపడ్డ వారిని సింధూర ఆస్పత్రిలో చేర్చామని ఎటువంటి ఆరోగ్య సమస్య లేదని వైద్యులు ధ్రువీకరించారని చెప్పారు. ఆయన వెంట డీజీఎం కోటేశ్వరరావు ఉన్నారు. ఇదిలా ఉండగా కార్మికులకు ప్రమాదకర గాయూలేమీ కాలేదని అందుకే డిశ్చార్జి చేశామని సింధూర ఆస్పత్రి వైద్యాధికారి పీబీ కామేశ్వరరావు చెప్పారు. తరచూ ప్రమాదాలు... నాగార్జున అగ్రికెం కెమికల్ పరిశ్రమలో తరచూ ప్రమాదాలు జరుగుతుండటం స్థానికుల్లో ఆందోళన కల్గిస్తుంది. గురువారం యూసిడ్ పైపు లీక్ వల్ల ఐదుగురు గాయపడ్డారన్న అంశం చర్చనీయాంశంగా మారింది. మ రో పక్క పరిశ్రమలో పెద్ద పేలుడు జరిగిందని ప్రచారం జరిగింది. పరిశ్రమ యాజమాన్యం స్పందించే వరకు ప్రమాద సంఘటనపై స్పష్టత రాలేదు. గతంలో ఓ రెండు పెద్ద ప్రమాదాలు చోటు చేసుకున్న సంఘటనను స్థానికులు గుర్తు చేసుకున్నారు. 2002 జూన్ 30న ఐదో బ్లాక్‌లో రియాక్టర్ పేలుడు చోటు చేసుకొని 18 మంది గాయపడ్డారు. 2014 జనవరి 1న రెండో బ్లాకులో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలయ్యాయి. రియాక్టర్ మూడో ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌పై పడింది. ప్రస్తుతం పైప్ లీక్ సంఘటనలో కార్మికులు క్షేమంగా బయటపడటంతో పరిశ్రమ యాజమాన్యం, కార్మికుల కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి.