ఆ రాజుకు అదో సరదా!
న్యూఢిల్లీ: ఒక దేశానికి రాజు కానీ సరదా కోసం పైలెట్ గా మారాడు. ఇప్పుడే కాదు గత 21 సంవత్సరాలుగా కో పైలెట్ గా సేవలందిస్తున్నాడు. కానీ ఈ విషయం ఆ దేశ పౌరులకు, ఆ విమానాల్లో ప్రయాణించిన ప్రయాణీకులకు సైతం తెలియదు. ఏ దేశ రాజు అబ్బా అనుకుంటున్నారా.. ఆ రాజు ఎవరో కాదు నెదర్లాండ్ రాజు విల్లెం అలెగ్జండర్.. అవును ఆయనే స్వయంగా టెలిగ్రాఫ్ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ రహస్యాన్ని వెల్లడించాడు.
కింగ్ అవ్వక ముందు గెస్ట్ పైలెట్ గా కొందరికి తెలిసిన ఈ రాజు అనంతరం రహస్యంగా నెలకు రెండు సార్లు కేఎల్ ఎమ్ రాయల్ డచ్ ఏయిర్ లైన్స్ వంటి కమర్షియల్ విమానాలకు కో పైలెట్ గా విధులు నిర్వర్తించేవాడని.. రాయల్ ఏయిర్ లైన్స్ బోయింగ్ 737 జెట్ ప్యాసెంజర్ ప్లైట్ శిక్షణ కూడా తీసుకుబోతున్నాడని డచ్ న్యూస్ పేపర్ ప్రచురించింది. ఎందుకుంటే ఈ రాజు ఇప్పటి వరకు కేఎల్ఎమ్ ఫోకర్ 70 వంటి చిన్న ప్లేన్ లోనే పైలెట్ గా చేశాడు. గెస్ట్ పైలెట్ గా కేఎల్ ఎమ్ 737 ప్లైట్ లో విధులు నిర్వర్తించాలని ఉందని కింగ్ విల్లెం అలెగ్జండర్ తన మనసులోని కోరికను వెల్లడించాడు.
ఏదైనా పెద్ద విమానంలో ఓ రాత్రంతా విధులు నిర్వర్తించి నెదర్లాండ్స్ లో అత్యవసర పరిస్తితులు ఏర్పడినపుడు తిరిగిరాకుండా ఉండాలనుందని ఈ 50 ఏళ్ల డచ్ కింగ్ పేర్కొన్నాడు. విమానాల్లో పైలెట్ గా విధులు నిర్వర్తించడం తనకు ఓ అలవాటని, రాజుగా విధులను పక్కకు పెట్టి పైలెట్ గా ప్లైయింగ్ పై దృష్టి సారించడంతో విశ్రాంతి దొరుకుతుందని ఈ కింగ్ అభిప్రాయపడ్డాడు. ఇక రాయల్ ఏయిర్ లైన్స్ మాత్రం యూనిఫాంలో ఉన్న కింగ్ ను ప్యాసెంజర్లు ఎప్పుడు గుర్తించ లేదని తెలిపింది.