breaking news
durgamallesvara Swamy temple
-
దుర్గగుడిలో విజిలెన్స్ తనిఖీలు
సాక్షి,విజయవాడ/ఇంద్రకీలాద్రి: దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో బుధవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై గత నెలలో ఏసీబీ అధికారుల తనిఖీల నేపథ్యంలో ఇప్పుడు విజిలెన్స్ అధికారులూ తనిఖీలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ఉదయం ప్రారంభమైన తనిఖీలు రాత్రి ఏడు గంటల వరకూ కొనసాగాయి. అన్నదాన, పరిపాలన విభాగంతో పాటు ప్రోవిజన్స్ స్టోర్స్‌లోనూ తనిఖీలు చేపట్టారు. విజిలెన్స్ అధికారులు మూడు బృందాలుగా విడిపోయి విచారణ చేశారు. తొలుత అన్నదాన విభాగానికి వెళ్లిన అధికారులు.. ఏఈవో వెంకటరెడ్డిని రికార్డులు, బిల్లులపై ఆరా తీశారు. గత నెలలో మంజూరైన బిల్లులు, కాంట్రాక్టర్లకు చెల్లింపులపై ప్రశ్నించినట్టు తెలుస్తోంది. గతేడాది అన్నదానం టెండర్లపై వివరాలు సేకరించినట్టు సమాచారం. సెక్యూరిటీ టెండర్లలో జరిగిన అవకతవకలపైనా విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. సస్పెన్షన్‌కు గురైన టెండర్ల విభాగం సూపరింటెండెంట్ రవిప్రసాద్ స్టేట్‌మెంట్‌నూ రికార్డు చేసినట్టు తెలిసింది. దుర్గగుడిలో కొంతమంది నకిలీ సర్టిఫికెట్లపై విధులు నిర్వహిస్తున్నారంటూ గతంలో విజిలెన్స్ విచారణ జరిగింది. ఈ నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై ఈవో ఎంవీ సురేష్‌బాబును ప్రశ్నించినట్టు తెలిసింది. సర్టిఫికెట్లను వెరిఫికేషన్‌కు పంపామని, ఆ వివరాలు వచ్చాక తగు చర్యలు తీసుకుంటామని ఈవో చెప్పినట్టు తెలిసింది. సస్పెండ్ అయిన వారే విధుల్లో.. అయితే విజిలెన్స్ అధికారులు తనిఖీల నిమిత్తం బ్రాహ్మణవీధిలోని జమ్మిచెట్టు వద్ద ఉన్న కార్యాలయానికి వెళ్లిన క్రమంలో గతంలో సస్పెండ్ అయిన వారిలో కొంతమంది విధులు నిర్వహిస్తూ కనిపించడంతో విస్మయానికి గురయ్యారు. -
క్యూలైన్లో స్పృహ కోల్పోయిన చిన్నారి
ఆదివారం ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తడంతో.. వీఐపీ క్యూ లైన్లో ఓ చిన్నారి స్పృహతప్పింది. సెలవు రోజు కావడంతో ఆలయానికి భారీగా అనధికార వీఐపీలు పోటెత్తారు. ఆసహనానికి గురైన ఆలయ ఈవో వేణు వీఐపీ క్యూలైన్ గేట్లకు తాళాలు వేశాడు. ఇదే సమయంలో మచిలీపట్నం ప్రాంతానికి చెందిన భవ్యశ్రీ(8) స్పృహతప్పింది. ఆమెను వెంటనే ప్రధమ చికిత్సాకేంద్రానికి తరలించారు. ఈవో చర్య వల్ల అర్చకులు సైతం గేట్లు దూకి గర్భగుడిలోకి వెళ్లాల్సి వచ్చింది. ఈవో తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఆదివారం మధ్యాహ్నానికి 80 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ధర్మ దర్శనానికి 3 గంటలు, రూ.100, రూ.250 టికెట్ల దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.