breaking news
in duggirala
-
సౌత్‌జోన్ పోటీలకు ఐశ్వర్య
దుగ్గిరాల (పెదవేగి రూరల్): యూనివర్సిటీ 11వ సౌత్‌జోన్ ఆటల పోటీలకు తమ కళాశాల విద్యార్థిని మోటూరి ఐశ్వర్య ఎంపికయ్యిందని దుగ్గిరాల దంత కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ నెల్లి జార్జ్ తెలిపారు. కళాశాలలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ తృతీయ సంవత్సరం బీడీఎస్ విద్యార్థిని ఐశ్వర్య డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడలో జరిగిన సౌత్‌జోన్ పోటీల్లో సత్తాచాటిందన్నారు. ఈనెల 10 నుంచి 14 వరకు బాస్కెట్‌బాల్, 24 నుంచి 28వ తేదీవరకు వాలీబాల్ పోటీల్లో తలపడుతుందని చెప్పారు. ప్రిన్సిపాల్ ఎన్ స్లీవరాజ్, అడ్మినిస్టేటర్ ఫాదర్ బల్తజర్, పీడీ నిట్టా నల్లయ్య ఆమెను అభినందించారు. -
మరోసారి చింతమనేని బాధితుల ఆందోళన
సాక్షి ప్రతినిధి, ఏలూరు : చింతమనేని వైఖరిని నిరసిస్తూ దుగ్గిరాల రైతులు మరోసారి ఆందోళనకు దిగారు. ఇటీవల పట్టిసీమ నుంచి విడుదల చేసిన నీటికారణంగా మునిగిపోయిన తమ చెరువుల్లో గురువారం సాయంత్రం వారు పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామం పొలాల్లో ఆందోళన చేశారు. తాను చేపలు పెంచుతున్న చెరువుకు నీరు పెట్టేందుకు తమ పొలాలను ముంచేశాడని వారు ఆరోపించారు. పొలాలు మునిగిపోయాయని ఆందోళన చేసినా పట్టించుకోలేదని, పైగా బెదిరింపులకు దిగారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పొలాల్లో పంట పూర్తిగా పనికిరాకుండా పాడైపోయిందని, అధికారులు కూడా తమను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తాము తమకు అన్యాయం జరిగిందని ఆందోళన చేస్తే, తమకు వ్యతిరేకంగా బయట గ్రామాలకు చెందిన రైతు కూలీలను, రైతుల రూపంలో కూర్చొపెట్టి వారితో ఆరోపణలు చేయించాడని వారు ఆరోపించారు. పోలవరం కాలువ నీళ్లను చెరువులను నింపేందుకని అక్రమంగా తరలిస్తున్న ఫలితంగా దుగ్గిరాలలో పలువురి రైతుల పొలాలు మునిగిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ రైతులు గత శనివారం కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగిన సంగతి విదితమే.