breaking news
	
		
	
  duckworth-lewis
- 
      
                   
                                                       పాకిస్తాన్ అవుట్కొలంబో: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో సెమీఫైనల్ అవకాశాలు కోల్పోయిన రెండో జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. సోమవారమే బంగ్లాదేశ్ నిష్క్రమించగా... ఇప్పుడు పాకిస్తాన్ వంతు వచ్చింది. కొలంబోలో వాన బారిన పడిన మరో మ్యాచ్‌లో ఫాతిమా సనా సారథ్యంలోని పాక్ జట్టు చిత్తుగా ఓడింది. ఆ జట్టుకిది నాలుగో పరాజయం. మంగళవారం జరిగిన ఈ పోరులో దక్షిణాఫ్రికా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 150 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించి 10 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలవడం ఇదే మొదటిసారి. టాస్ ఓడిన దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. అయితే 2 ఓవర్లకే వర్షం రావడంతో ఆట ఆగిపోయింది. దాదాపు రెండు గంటల తర్వాత ఆట మళ్లీ మొదలు కాగా... మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. దక్షిణాఫ్రికా నిర్ణీత 40 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు సాధించింది. అన్ని వరల్డ్ కప్‌లలో కలిపి దక్షిణాఫ్రికాకు ఇదే అత్యధిక స్కోరు. కెపె్టన్ లారా వోల్వర్ట్ (82 బంతుల్లో 90; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) త్రుటిలో శతకం చేజార్చుకోగా... మరిజాన్ కాప్ (43 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూన్ లూస్ (59 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. ఓపెనర్ తజ్మీన్ బ్రిట్స్ (0) టోర్నీలో మూడోసారి డకౌటైన అనంతరం వోల్వర్ట్, లూస్ కలిసి రెండో వికెట్‌కు 93 బంతుల్లోనే 118 పరుగులు జోడించారు. చివర్లో డి క్లెర్క్ (16 బంతుల్లో 41; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో సఫారీ టీమ్ భారీ స్కోరు నమోదు చేయగలిగింది. ఆఖరి 5 ఓవర్లలో దక్షిణాఫ్రికా 72 పరుగులు సాధించింది. పాకిస్తాన్ బౌలర్లలో నష్రా సంధు, సాదియా ఇక్బాల్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. పాకిస్తాన్ ఇన్నింగ్స్ మొదలయ్యాక వాన కారణంగా పలు మార్లు అంతరాయం ఏర్పడటంతో మళ్లీ మళ్లీ లక్ష్యాన్ని మార్చాల్సి వచ్చింది. చివరకు పాక్ లక్ష్యాన్ని 20 ఓవర్లలో 234 పరుగులుగా నిర్దేశించారు. అయితే పాక్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 83 పరుగులే చేయగలిగింది. సిద్రా నవాజ్ (22 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచింది. కెప్టెన్ ఫాతిమా సనా రెండు పరుగులే చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మరిజాన్ కాప్ 3 వికెట్లు పడగొట్టగా, షాంగసే 2 వికెట్లు తీసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన మరిజాన్ కాప్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకుంది. ఇండోర్‌లో నేడు జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాతో ఇంగ్లండ్ తలపడుతుంది.
- 
      
                   
                                 మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. డక్‌వర్త్ లూయిస్ ప్రకారమయితే బంగ్లాదే గెలుపుT20 WC 2022 IND VS BAN: టీమిండియా నిర్ధేశించిన 185 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. 7వ ఓవర్ తర్వాత ఒక్కసారిగా భారీ వర్షం మొదలు కావడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. వర్షం అంతరాయం కలిగించే సమాయానికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. లిట్టన్ దాస్ 59, హొస్సేస్ షాంటో ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇదిలా ఉంటే, వర్షం ఎంతకు తగ్గకపోతే డక్‌వర్త్ లూయిస్ ప్రకారం విజేతను ప్రకటించాల్సి ఉంటుంది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం చూస్తే బంగ్లాదేశ్ 17 పరుగులు ముందంజలో ఉంది. దీంతో బంగ్లాదేశ్‌నే విజేతగా ప్రకటిస్తారు. అంతకుముందు భీకరమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లి మరోసారి రెచ్చిపోవడంతో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. కోహ్లి ఈ ఇన్నింగ్స్‌లో.. 44 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చాలాకాలం తర్వాత ఓపెనర్ కేఎల్ రాహుల్ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. రాహుల్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. ఫలితంగా టీమిండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
- 
      
                   
                                 డక్‌వర్త్ ‘లూయిస్’ కన్నుమూతలండన్: అంతర్జాతీయ క్రికెట్‌కు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిని పరిచయం చేసిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ టోనీ లూయిస్(78) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యం బాధపడుతున్న లూయిస్ కన్నుమూసిన విషయాన్ని ఇంగ్లండ్-వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రకటించింది. ప్రపంచ క్రికెట్లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి గురించి అందరికీ తెలిసిందే. వర్షం కారణంగా మ్యాచ్‌లు ఆగినప్పుడు, తిరిగి లక్ష్యాన్ని నిర్దేశించడానికి ఈ పద్థతిని వాడుతారన్న సంగతి తెలిసిందే. 1997లో ఫ్రాంక్ డక్‌వర్త్‌తో కలిసి టోనీ లూయిస్ ఈ పద్ధతిని ప్రతిపాదించారు. దీనికి అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) 1999లో ఆమోద ముద్ర వేయగా, దాన్ని 2004 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రధానంగా వర్షం కురిసి మ్యాచ్‌లు సగంలో ఆగిపోతే అప్పుడు ఈ పద్ధతిని ఉపయోగించి విజేతను ప్రకటించడం నేటికీ ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం దీన్ని డక్‌వర్త్ లూయిస్ స్టెర్న్ పద్ధతిగా పిలుస్తున్నారు. మరోవైపు లూయిస్ మరణంపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కూడా సంతాపం వ్యక్తం చేసింది. క్రికెట్‌కు ఆయన ఎంతగానో సేవ చేశారని అభిప్రాయపడింది. ఇంగ్లండ్ కెప్టెన్‌గా సేవలందించిన లూయిస్.. ఆపై జర్నలిస్టుగా సేవలందించారు. 1990వ దశకంలో బీబీసీ టెలివిజన్ కామెంటేటర్‌గా ఆయన పనిచేశారు. ఇక క్రికెట్ లా మేకర్ అయిన మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) అధ్యక్షుడిగా సైతం సేవలందించిన ఘనత టోనీ లూయిస్‌ది.
- 
      
                   
                                 అది ఐసీసీకే అర్థం కాదు!
 డక్‌వర్త్–లూయిస్‌పై ధోని 
 
 లండన్: డక్‌వర్త్–లూయిస్ నిబంధన అనేది ఒక బ్రహ్మ పదార్థం! వర్షం పడిన సమయంలో ఇది సరిగ్గా ఎలా పని చేస్తుందో అర్థం కాక ఎంతో మంది కెప్టెన్లు జుట్టు పీక్కుంటే... లెక్క సరిగ్గా తేలక మ్యాచ్‌లు కోల్పోయిన దక్షిణాఫ్రికాలాంటి జట్లు కూడా ఉన్నాయి. చివరకు అంపైర్ చెబితే తప్ప ఎన్ని పరుగులు చేయాలో, చేయాల్సి ఉందో తెలీదు.
 
 గతంలో భారత కెప్టెన్‌గా ధోని కూడా అనేక సందర్భాల్లో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. సోమవారం జరిగిన కోహ్లి డిన్నర్ కార్యక్రమంలో ధోనిని ఈ విషయంపై ప్రశ్నించగా, అతను ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘నేను అర్థం చేసుకోవడం సంగతి తర్వాత. నాకు తెలిసి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి కూడా డక్‌వర్త్–లూయిస్ నిబంధన అర్థం కాదు’ అని అందులోని క్లిష్టత గురించి చెప్పేశాడు.
- 
      
                   
                                 న్యూజిలాండ్ బోణి
 డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఇంగ్లండ్‌పై గెలుపు
 చిట్టగాంగ్: ఇటీవలి కాలంలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న న్యూజిలాండ్ జట్టు టి20 ప్రపంచకప్‌లోనూ బోణి చేసింది. ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన గ్రూప్ ‘1’ లీగ్ మ్యాచ్‌లో కివీస్ తొమ్మిది పరుగుల తేడాతో నెగ్గింది. 173 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన కివీస్... 5.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 52 పరుగులతో ఉన్న దశలో వర్షం అంతరాయం కలిగించింది. ఆ తర్వాత ఆట సాధ్యం కాకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన ఫలితాన్ని ప్రకటించారు. బ్రెండన్ మెకల్లమ్ (6 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్; 2 సిక్స్‌లు), విలియమ్సన్ (17 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు)దూకుడుగా ఆడారు.
 
 అంతకుముందు ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 172 పరుగులు చేసింది. మొయిన్ అలీ (23 బంతుల్లో 36; 6 ఫోర్లు; 1 సిక్స్), మైకేల్ లంబ్ (24 బంతుల్లో 33; 4 ఫోర్లు; 1 సిక్స్)తో రాణించారు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కు 72 పరుగులు జోడించారు. వరుస ఓవర్లలో వీరు అవుట్ కావడంతో ఇంగ్లండ్ జోరుకు బ్రేక్ పడింది. రెండు వికెట్లు తీసిన కివీస్ ఆల్‌రౌండర్ అండర్సన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం లభించింది.


