breaking news
dts
-
సరికొత్త డీటీయస్
‘నాటకం’ మూవీ ఫేమ్ ఆశిష్ గాంధీ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘డీటీయస్’. పూజా జవేరి కథానాయిక. అభిరామ్ పిల్లాను దర్శకునిగా పరిచయం చేస్తూ గంగారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్లో ప్రారంభమైంది. ఆశిష్ గాంధీ మాట్లాడుతూ– ‘‘నాటకం’ తర్వాత కొత్త కథల కోసం ఎదురు చూస్తున్న సమయంలో అభిరామ్ చెప్పిన కథ నచ్చింది. గంగారెడ్డిగారికి కాన్సెప్ట్ నచ్చడంతో సినిమా ప్రారంభించారు’’ అన్నారు. ‘‘ఇప్పటి వరకూ తెలుగు తెరమీద చూడని సరికొత్త కథతో ఈ సినిమా ఉంటుంది. ఈ నెల చివరి వారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది’’ అన్నారు. ‘‘యంగ్ టీమ్ చేస్తోన్న చిత్రమిది. ఇలాంటి కథకు సంగీతం అందించడం సంతోషంగా ఉంది’’ అన్నారు సాయి కార్తీక్. -
పది మంది డీటీల బదిలీ
ఖమ్మం జెడ్పీసెంటర్ : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ డీఎస్.లోకేష్కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా 10 మందిని బదిలీ చేశారు. అలాగే సెలవులో ఉన్న చండ్రుగొండ తహసీల్దార్ ఎన్.అరుణకు డిప్యూటేషన్పై కలెక్టరేట్లో పోస్టింగ్ ఇచ్చారు. కాగా.. డీటీల బదిలీల వివరాలు ఇలా ఉన్నాయి. ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– పేరు ప్రస్తుత స్థానం బదిలీ స్థానం –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– కె.ప్రమీలæ నేలకొండపల్లి(లీవ్) డీఎం సివిల్æసప్లై, ఖమ్మం ఎంఏ.రాజు సెలవులో అశ్వాపురం డీటీ టి.వేణుగోపాల్ జూలూరుపాడు డీఎం సివిల్ సప్లై బి.వెంకటేశ్వరరావు ఎస్డీసీ కంతనపల్లి రికవరీ ఆఫీసర్ ఎస్వీ.నారాయణమూర్తి చింతకాని ఎస్డీసీ కంతనపల్లి జీఎల్ఎస్.స్వామి దుమ్ముగూడెం జూలూరుపాడు డీటీ ఆర్ఏ.రామకష్ణ ఖమ్మం అర్బన్ ఎలక్షన్ చింతకాని డిప్యూటేషన్ కలెక్టరేట్ బి.భద్రాకాళి ఇల్లెందు తల్లాడ డీటీ బి.విజయ ఎలక్షన్ డీటీ ఇల్లెందు ఇల్లెందు డీటీ ఎస్.అంజమ్రాజు వైరా డీటీ ఇల్లెందు ఎలక్షన్ డీటీ ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––