డ్రైఫ్రూట్ విభాగంలోకి ఎఫ్‌సీఈఎల్
హైదరాబాద్: ఫ్యూచర్ గ్రూప్ అనుబంధ సంస్థ ఫ్యూచర్ కన్సూమర్ ఎంటర్ ప్రైజ్ (ఎఫ్‌సీఈఎల్) తాజాగా డ్రైఫ్రూట్ విభాగంలోకి ప్రవేశించింది. కొత్తగా ‘కార్మిక్’ బ్రాండ్‌ను ఆవిష్కరించినట్లు సంస్థ ఒక ప్రకటన లో తెలిపింది. ఇది కాలిఫోర్నియా ఆల్మండ్స్, పిస్తాచియోస్, వాల్నట్ కెర్నల్స్, జీడిపప్పు అనే నాలుగు వేరియంట్లలో వినియోగదారులకు లభ్యమవుతుందని పేర్కొంది. న్యూట్రిషన్, ఆరోగ్యం, రుచి తమ కార్మిక్ బ్రాండ్ ప్రత్యేకతలు అని ఫ్యూచర్ గ్రూప్ ఫుడ్ అండ్ ఎఫ్ఎంసీజీ ప్రెసిడెంట్ దేవేంద్ర చావ్లా తెలిపారు.