breaking news
Dr. vengamma
-
వెంగమ్మ రిలీవ్
{పొఫెసర్గా కొనసాగింపు ఇన్చార్జి డెరైక్టర్‌గా టీటీడీ జేఈవో పోలా భాస్కర్ తిరుపతి: శ్రీవెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) డెరైక్టర్ పదవి నుంచి డాక్టర్ వెంగమ్మ వైదొలిగారు. ఆమెను డెరైక్టర్ బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి ఎల్వీ.సుబ్రమణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్చార్జి డెరైక్టర్‌గా టీటీడీ జేఈవో పోలా భాస్కర్‌ను నియమించారు. ఇదిలావుండగా వెంగమ్మ ఇకపై ప్రొఫెసర్‌గా కొనసాగనున్నారు. వేధింపులే కారణమా? రాజకీయ ఒత్తిళ్లవల్లే డెరైక్టర్ పదవి నుంచి రిలీవ్ చేయాలని వెంగమ్మ ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శిని కోరినట్టు తెలిసింది. స్విమ్స్ మాజీ డెరైక్టర్ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ కొనసాగుతు న్న నేపథ్యంలో వాటిని కప్పిపుచ్చుకునేందుకు కొందరుమంత్రులు ప్రయత్నిస్తున్నా రు. తమకు అడ్డొస్తున్నారని ఆమెను తొలగించేందుకు విశ్వప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. ఫలించకపోవడంతో సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు రంగంలో కి దిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె స్వచ్ఛందంగా తప్పుకున్నట్లు సమాచారం. -
వెంగమ్మకు సీఎం బెదిరింపులు!
సాక్షి ప్రతినిధి, తిరుపతి : స్విమ్స్ (శ్రీవెంకటేశ్వర వైద్య విజ్ఞానసంస్థ) డెరైక్టర్ డాక్టర్ వెంగమ్మ తనను పదవి నుంచి రిలీవ్ చేయమని చెప్పడం వెనుక పెద్దకథే నడిచినట్టు సమాచారం. నాలుగు రోజుల క్రితం జిల్లా పర్యటనకు వచ్చిన వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రేణిగుంట ఎయిర్‌పోర్టుకు డాక్టర్ వెంగమ్మను పిలిపించుకుని పదవి నుంచి తప్పుకోవాలని హెచ్చరికలు చేసినట్టు సమాచారం. ఇంతకుమునుపే ఆమెను స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలగేలా చేసేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను ప్రభుత్వం పాచికగా ప్రయోగించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే స్విమ్స్‌లోని కొన్ని పైళ్లను తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ తనిఖీల్లో ఎలాంటి ఆరోపణలు, అవినీతి ఆధారాలు లభించకపోగా డెరైక్టర్ నిక్కచ్చిగా వ్యవహరించినట్టు ప్రాథమిక సమాచారం అందింది. రంగంలోకి బాబు స్విమ్స్ డెరైక్టర్ పదవి నుంచి వెంగమ్మను తప్పించి, తమకు అనుకూలమైన వారిని నియమించుకోనేందుకు వీలుగా చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే స్విమ్స్ డెరైక్టర్ వెంగమ్మను కుప్పానికి పిలిపించుకుని పదవి నుంచి తప్పుకోవాలని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుగుదేశం వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. పదవి నుంచి తప్పుకోకపోతే సస్పెండ్ చేస్తానని బెదిరించినట్లు విశ్వసనీయ సమాచారం. దీనివెనుక ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ హస్తం ఉన్నట్టు వినికిడి. ముఖ్యంగా లోకేష్ తమకు అనుకూలమైనవారిని తెచ్చుకునే విధంగా పావులు కదిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే వెంగమ్మ తనను పదవి నుంచి రిలీవ్ చేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలుస్తోంది. మూడు రోజుల క్రితమే హైదరాబాద్ వెళ్లి వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంను కలసి లేఖ అందించారు. ఈ విషయాన్ని స్విమ్స్ వర్గాలు సైతం ధ్రువీకరించాయి. దీంతోపాటు వైద్య ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాసులు సైతం తమ బంధువులను స్విమ్స్ డెరైక్టర్‌గా తెచ్చేందుకు పావులు కదుపతున్నట్టు సమాచారం.