breaking news
donate eyes
-
నేత్రదానం చేసిన టాప్ కమెడియన్!
దేశంలోనే నంబర్ వన్ కమెడియన్‌గా పేరొందిన కపిల్ శర్మ ఓ స్ఫూర్తిదాయకమైన నిర్ణయం తీసుకున్నాడు. మరణానంతరం తన కళ్లను దానం చేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. అంధుల టీ-20 క్రికెట్ వరల్డ్ కప్‌ను ఇటీవల గెలుపొందిన భారత అంధుల క్రికెట్ జట్టు తాజాగా ద కపిల్ శర్మ షోలో పాల్గొన్నది. ఈ నేపథ్యంలోనే ఆయన నేత్రదానం ప్రకటన చేశారు. 'మనం చేసే ఒక చిన్న పని కూడా ఎవరికో ఒకరికి గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. నా కళ్ల ద్వారా ఎవరు ఒకరు లోకాన్ని చూడగలరు అనుకుంటే.. నేను ఎంతో సంతోషంగా అందుకు ఒప్పుకుంటాను' అని ఆయన పేర్కొన్నారు. ఆయన ప్రకటనతో స్ఫూర్తి పొందిన పలువురు ఆయన అభిమానులు కూడా నేత్రదానానికి ముందుకొస్తున్నారు. -
నేత్రదానానికి 80 మంది సిద్ధం
బుక్కరాయసముద్రం : తమ తదనంతరం నేత్రదానం చేసేందుకు 80 మంది అంగీకారం తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని కేవీకేలో శ్రీసాయి హెల్త్‌కేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేత్రదాన నమోదు శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ చమన్‌సాహెబ్, అనంతపురం డిఎస్పీ మల్లికార్జున వర్మ, జెడ్పీటీసీ రామలింగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చమన్‌సాహెబ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మరణానంతరం నేత్రదానం చేసి మరొకరికి చూపు ఇవ్వాలని సూచించారు. అనంతరం 80 మంది మరణానంతరం నేత్ర దానం చేస్తామని అంగీకార పత్రాన్ని నిర్వాహకులకు ఇచ్చారు.