breaking news
divison cricket
-
అఖిల్ విజృంభణ
పీకేఎంసీసీ 234 ఆలౌట్ హైదరాబాద్ టైటాన్స్‌తో మ్యాచ్ సాక్షి, హైదరాబాద్: ఎ–2 డివిజన్ రెండు రోజుల లీగ్‌లో హైదరాబాద్ టైటాన్స్ బౌలర్ అఖిల్ శ్రీనివాస్ అద్వితీయ ప్రదర్శన చేశాడు. పీకేఎంసీసీ జట్టుతో ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో 8వికెట్లతో చెలరేగాడు. మొదట పీకేఎంసీసీ జట్టును తొలి ఇన్నింగ్స్‌లో 60.1 ఓవర్లలో 234 పరుగులకే కట్టడి చేశాడు. బ్యాటింగ్‌లో రోహ న్ (109; 21 ఫోర్లు) సెంచరీ చేయగా, వికాస్ (62) అర్ధసెంచరీతో రాణించాడు. అనంతరం హైదరాబాద్ టైటాన్స్ తొలిరోజు ఆట ముగిసేసరికి 27 ఓవర్లలో 6 వికెట్లకు 73 పరుగులు చేసింది. తేజ 4 వికెట్లు దక్కించుకున్నాడు. ఇతర లీగ్ మ్యాచ్‌ల వివరాలు గౌడ్స్ ఎలెవన్: 139 (తపస్ మిశ్రా 44; దివేవ్ సింగ్ 5/52), బడ్డింగ్ స్టార్: 140/3 (అమీర్ మలిక్ 82). జిందా తిలిస్మాత్: 362 (రాజ్ మిశ్రా 78, అజహర్ అలీ 105, అజహరుద్దీన్ 75; రిషబ్ (5/117), కొసరాజు సీసీ: 44/2. బాలాజీ సీసీ: 235 (సూరజ్ 50, శశాంక్ 60; అఫ్సర్ 4/57), సీసీఓబీ: 60/3 Üఅవర్స్: 281 (ప్రశాంత్ 67, సత్య ప్రణవ్ 62; శివంగ్ యాదవ్ 5/48), శ్రీ శ్యామ్: 31/1 (9 ఓవర్లలో). రాజు సీసీ: 181 (నిర్భయ్ సాయిరెడ్డి 73; నీలేశ్ 5/73, అశ్విన్ 4/33), నేషనల్ సీసీ: 184/3 (అశ్విన్ 52, మొహమ్మద్ అసదుద్దీన్ 97). ఫ్యూచర్ స్టార్: 157 (రమావత్ రాజేశ్ 5/40), తెలంగాణ: 147/2 (హర్షవర్ధన్ 91, నితిన్ 35 బ్యాటింగ్). ఉస్మానియా: 336 (సిద్ధాంత్ 65, జగదీశ్ 67, దీపాంకర్ 52), ఎంసీసీ: 48/0 (9 ఓవర్లలో). -
ఆశిష్ రెడ్డి డబుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రా బ్యాంక్ బ్యాట్స్‌మన్ ఏ. ఆశిష్ రెడ్డి (178 బంతుల్లో 205 నాటౌట్; 22 ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగడంతో ఎ–1 డివిజన్ మూడు రోజుల క్రికెట్ లీగ్‌లో ఆ జట్టు భారీస్కోరు సాధిం చింది. ఎస్బీఐ జట్టుతో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో 116.2 ఓవర్లలో 600 పరుగులకు ఆలౌలైంది. ఎస్బీఐ బౌలర్లలో ఆకాశ్ భం డారి 7 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఎస్బీఐ జట్టు రెండో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి 60 ఓవర్లలో 2 వికెట్లకు 190 పరుగులు చేసింది. అనిరుధ్‌సింగ్ (182 బంతుల్లో 103 నాటౌట్; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ సెంచరీతో సత్తా చాటాడు. ఎవర్గ్రీన్, ఇండియా సిమెంట్స్ జట్ల మధ్య జరిగిన మూడు రోజుల మ్యాచ్ డ్రాగా ముగిసింది. మొదట ఇండియా సిమెంట్స్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 193 పరుగులు చేయగా, ఎవర్గ్రీన్ జట్టు 83.1 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. అనంతరం మూడో రోజు గురువారం రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇండియా సిమెంట్స్ ఆటముగిసే సమయానికి 62 ఓవర్లలో 8 వికెట్లకు 193పరుగులతో నిలిచింది. ఎవర్ గ్రీన్ బౌలర్ పి. మనీశ్ 5 వికెట్లు పడగొట్టాడు. ఇతర మ్యాచ్‌ల వివరాలు బీడీఎల్: 133 (తొలి ఇన్నింగ్స్), 281 (చంద్రశేఖర్ 38, కె. సుమంత్ 67, సందీప్ గౌడ్ 84; హిమాన్షు 3/46, విద్యానంద్ 3/57); ఇన్‌కం ట్యాక్స్: 226/9 (70.5 ఓవర్లలో), స్పోర్టింగ్ ఎలెవన్: 417 (తొలి ఇన్నింగ్స్), 37/3 (అజయ్ దేవ్ గౌడ్ 3/12); ఈఎంసీసీ: 266 (బెంజమిన్ థామస్ 84; సయ్యద్ అహ్మద్ 6/83), జై హనుమాన్: 353 (అనిరుధ్ రెడ్డి 87; వరుణ్ గౌడ్ 4/79); డెక్కన్ క్రానికల్: 147/4 (వరుణ్ 56 బ్యాటింగ్), హైదరాబాద్ బాట్లింగ్: 322 (95.3 ఓవర్లలో); కాంటినెంటల్: 243/9 (ఆశిష్ 68; ముజమ్మిల్ 3/37), జెమిని ఫ్రెండ్స్: 366 (తొలి ఇన్నింగ్స్), 189 (మెహదీ హసన్ 3/40); కేంబ్రిడ్జ్ ఎలెవన్: 248, 191 (మల్లికార్జున్ 70, నీలేశ్ 50; సంకీర్త్ 3/66, రాధాకృష్ణ 3/57), ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ: 162 (తొలి ఇన్నింగ్స్), 141 (సాగర్ శర్మ 3/58, ఎస్. పాండే 5/18); ఏఓసీ: 142 (తొలి ఇన్నింగ్స్), 162/8 (రాహుల్ సింగ్ 78, సుఫియాన్ 51; షేక్ కమ్రుద్దీన్ 3/36, సుధాకర్ 4/44)