breaking news
District and Sessions Judge
-
పెళ్లి కేసులో ఇమ్రాన్‌కు ఊరట
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు భారీ ఊరట. ఇస్లాం నిబంధనలకు వ్యతిరేకంగా పెళ్లాడారన్న కేసులో ఇమ్రాన్ (71), బుష్రా బీబీ (49) దంపతులను న్యాయస్థానం నిర్దోషులుగా తేలి్చంది. వారిపై మోపిన అభియోగాలను ఇస్లామాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు శనివారం తోసిపుచి్చంది. ఈ కేసులో ట్రయల్ కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను కొట్టేసింది. మత ప్రబోధకురాలైన బుష్రా తన మొదటి భర్త ఖవర్ ఫరీద్ మనేకాతో 28 ఏళ్ల వైవాహిక బంధాన్ని తెంచుకుని ఇమ్రాన్‌ను పెళ్లా డారు. అయితే విడాకులకు, పునర్వివాహానికి మధ్య ముస్లిం మహిళ విధి గా పాటించాల్సిన 4 నెలల గడువు (ఇద్దత్)ను ఆమె ఉల్లంఘించిందంటూ ఫరీద్ కేసు పెట్టారు. ఈ కేసులో గత ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికల ముంగిట ఇమ్రాన్ దంపతులకు ఏడేళ్ల శిక్ష పడింది. ఇమ్రాన్‌కు జైలు శిక్ష పడ్డ మూడు కేసుల్లో ఇదొకటి. తోషా ఖానా కేసులో జైలు శిక్షను కోర్టు ని లుపుదల చేయగా, సిఫర్ కేసుల్లో నిర్దోíÙగా బయటపడ్డారు. దాంతో గత ఆగస్టు నుంచీ జైల్లోనే ఉన్న ఇమ్రాన్ విడుదలవుతారని భావించారు. కానీ తాజా తీర్పు వెలువడ్డ కాసేపటికే అల్లర్ల కేసులో ఆయన అరెస్టుకు ఉగ్ర వాద వ్యతిరేక కోర్టు అనుమతినిచ్చింది. దాంతో ఆయన జైల్లోనే ఉండనున్నారు. -
లైంగిక దాడికి యత్నించిన ప్రొఫెసర్‌కు జైలు
హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించిన ప్రొఫెసర్‌కు ఐదేళ్ల జైలు, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ 5వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జీ బుధవారం తీర్పునిచ్చారు. అదనపు పబ్లిక్‌ప్రాసిక్యూటర్ సుమాంజలి కథనం ప్రకారం... 2011 నవంబరు 21న మొయినాబాద్‌లోని జేబీఆర్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి(20)ని అసిస్టెంట్ ప్రొఫెసర్ అమీర్షేక్ తన గదికి పిలి పించి అసైన్మెంట్, ఇంటర్నల్ మార్కుల గురించి అడుగుతూ ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రొఫెసర్‌పై కేసు నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 5వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జీ శ్రీనివాసరావు బుధవారం నిందితుడికి ఐదేళ్లు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.