లైంగిక దాడికి యత్నించిన ప్రొఫెసర్‌కు జైలు | Professor to jail for attempted sexual assault | Sakshi
Sakshi News home page

లైంగిక దాడికి యత్నించిన ప్రొఫెసర్‌కు జైలు

Jul 31 2014 3:20 AM | Updated on Sep 2 2017 11:07 AM

లైంగిక దాడికి యత్నించిన ప్రొఫెసర్‌కు జైలు

లైంగిక దాడికి యత్నించిన ప్రొఫెసర్‌కు జైలు

ఇంజనీరింగ్ విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించిన ప్రొఫెసర్‌కు ఐదేళ్ల జైలు, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ 5వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జీ బుధవారం తీర్పునిచ్చారు.

హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించిన ప్రొఫెసర్‌కు  ఐదేళ్ల జైలు, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ 5వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జీ బుధవారం తీర్పునిచ్చారు. అదనపు పబ్లిక్‌ప్రాసిక్యూటర్ సుమాంజలి కథనం ప్రకారం... 2011 నవంబరు 21న మొయినాబాద్‌లోని జేబీఆర్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి(20)ని అసిస్టెంట్ ప్రొఫెసర్ అమీర్‌షేక్ తన గదికి పిలి పించి అసైన్‌మెంట్, ఇంటర్నల్ మార్కుల గురించి అడుగుతూ ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రొఫెసర్‌పై కేసు నమోదు చేశారు.  కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 5వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జీ శ్రీనివాసరావు బుధవారం నిందితుడికి ఐదేళ్లు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement