breaking news
Distribution of scholarships
-
వారంలోగా స్కాలర్షిప్స్ పంపిణీ
♦ ఏపీ, తెలంగాణలో ఉపకార వేతనాల పంపిణీకి రంగం సిద్ధం ♦ 2013-14కి మినిట్స్ ఆధారంగా ఒప్పందం: ఏపీ మంత్రి రావెల కొరిటెపాడు (గుంటూరు): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యార్థుల స్కాలర్షిప్స్ పంపిణీకి రంగం సిద్ధమైందని, వారంలోగా పంపిణీ చేస్తామని ఏపీ సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. గుంటూరులోని టీడీపీ ఆఫీసులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యార్థుల స్కాలర్షిప్స్ విషయంలో అనేక అవాంతరాలు ఎదురయ్యాయని, దీంతో ఎంతో మంది ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం 1956కు ముందు స్థిరపడ్డవారే స్థానికులు అంటూ పేర్కొన్న దానిపై ఏపీ ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాడి విద్యార్థుల భవిష్యత్తును కాపాడిందన్నారు. తెలంగాణకు, ఏపీకి కామన్ డేటా ఉందని, ఈ-పాస్ విధానాన్ని అమలు చేయటానికి కూడా వారు సహకరించలేదన్నారు. ప్రస్తుతం 2013-14 సంవత్సరానికి జనాభా నిష్పత్తి ప్రకారం మినిట్స్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 52 శాతం, తెలంగాణ ప్రభుత్వం 48 శాతం స్కాలర్షిప్స్ పంపిణీ చేయటానికి అంగీకారం కుదిరిందని వెల్లడించారు. ఆర్టికల్ 371(డి) ప్రకారమే.. ఆర్టికల్ 371(డి) ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చిందని తెలిపారు. తెలంగాణలో చదువుతున్న ఏపీ విద్యార్థులు అక్కడ రిజిష్టర్ చేసుకోవాలని, కానీ ఇక్కడి వారే వెరిఫై చేసి స్కాలర్షిప్స్ పంపిణీ చేస్తారన్నారు. ఏపీలో కలిపిన 7 ముంపు మండలాలకు చెందిన విద్యార్థులకు కూడా 52:48 నిష్పత్తి వర్తిస్తుందన్నారు. విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారం రోజుల్లో స్కాలర్షిప్స్ పంపిణీ ఉంటుందన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు మన్నవ సుబ్బారావు, వట్టికూటి హర్షవర్ధన్, షేక్ లాల్‌వజీర్ తదితరులు పాల్గొన్నారు. -
సంఘాల్లో స్వాహాపర్వం
ఐకేపీ సిబ్బంది చేతివాటం ►అభయహస్తం, ఆమ్ ఆద్మీ, పథకాల్లో అక్రమాలు ►స్కాలర్‌షిప్‌ల పంపిణీ, బీమా చెల్లింపుల్లో కక్కుర్తి ►9 మండలాల్లో రూ.4.8 లక్షలు పక్కదారి.. ►సామాజిక తనిఖీల్లో బట్టబయలు ►రికవరీకి అధికారుల ఆదేశం హన్మకొండ అర్బన్ : జిల్లాలో మహిళా సంఘాల సభ్యుల పిల్లలకు ఉపకార వేతనాల పంపిణీ, బీమా డబ్బుల చెల్లింపుల్లో అక్రమాలు చోటుచేసుకున్నారుు. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో జిల్లావ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన సామాజిక తనిఖీల్లో ఐకేపీ సిబ్బంది చేతివాటం బహిర్గతమైంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికలు అందజేయూలని అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరికొన్ని చోట్ల స్వాహా అరుున మొత్తాన్ని రిక వరీ చేయూలని ఆదేశించారు. ఐకేపీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ క్రమంలో స్వాహాపర్వం వెలుగులోకి రావడంతో వారిలో కలవరం మొదలైంది. 9 మండలాల్లో రూ.4.81లక్షలు.. జిల్లాలో తొలివిడత సామాజిక తనిఖీలు నిర్వహించిన 9 మండలాల్లో రూ.4,81,875 దుర్వినియోగమైనట్లు తేలింది. ప్రభుత్వం నుంచి సంఘాల సభ్యులకు అందే ప్రతి నగదు చెల్లింపుల్లో అక్రమాలు జరిగినట్లు వెల్లడైంది. ఐకేపీ ద్వారా ప్రధానంగా అభయహస్తం, ఆమ్ ఆద్మీ, జేబీైవె వంటి బీమా పథకాలు అమలవుతున్నాయి. ఈ పథకాల్లో భాగంగా పొదుపు సంఘం సభ్యురాలి కు టుంబంలో 9, 10, ఇంటర్ చదివే ఇద్దరు పిల్లలకు సంవత్సరాని కి రూ.1,200 చొప్పున ఉపకార వేతనాలు చెల్లిస్తున్నారు. ఈ చె ల్లింపుల్లో పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగినట్లు సామాజిక తని ఖీల్లో తేలింది. అలాగే.. పొదుపు సంఘానికి చెందిన మహి ళ చనిపోరుునా, లేదా ఆమె భర్త చనిపోరుునా... బీమా పథకాల ద్వారా పరిహారం అందుతోంది. కుటుంబ పెద్దది సాధారణ మ రణమైతే రూ.37,500, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.75 వేలను బీమా కంపెనీ ఆ కుటుంబానికి పరిహారంగా ఇస్తోంది. బీమా చె ల్లింపుల్లో సిబ్బంది చేతివాటం ప్రదిర్శించినట్లు బట్టబయలైంది. ఎలా అంటే... సంఘంలో సభ్యురాలుగా ఉండి ఐకేపీ ద్వారా పాలసీ కట్టిన వారి కుటుంబంలో కుటుంబ పెద్ద మరణిస్తే నిబంధనల ప్రకారం బీ మా కంపెనీ పరిహారం చెల్లిస్తుంది. ఈ మేరకు జిల్లా సమాఖ్య నుంచి సంబంధిత మండల సమాఖ్యకు చెక్కు ఇస్తున్నారు. అ క్కడ బీమా మిత్ర ఆ మొత్తాన్ని సంబంధిత కుటుంబ సభ్యుల వ్యక్తిగత ఖాతాలో జమ చేస్తుంది. ఈ సమయంలో ముందస్తుగా బాధిత కుటుంబం నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అదేవి దంగా.. ఉపకార వేతన పంపిణీలో ఒక్కొక్కరికి రూ.1200 ఇచ్చే క్రమంలో కొంత తగ్గించి ఇస్తున్నట్లు తనిఖీల్లో రుజువైంది. రాజీయత్నాలు... ప్రస్తుతం సామాజిక తనిఖీల్లో బయట పడుతున్న అక్రమా ల్లో సంఘాల సభ్యులతోపాటు ఐకేపీ సిబ్బంది చేతివాటం ఉన్నట్లు వెల్లడి కావడంతో సదరు సిబ్బంది రాజీ యత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తమ నుంచి డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదు చేసిన వారితో సెటిల్మెంట్ చేసుకుంటున్నట్లు తెలిసింది. వసూలు చేసిన డబ్బులు తమకే ఖర్చు చేశారని... తెలియక ఫిర్యాదు చేశామని అధికారులకు చెప్పించే ప్రయత్నాలను ఐకేపీ సిబ్బంది ముమ్మరం చేసినట్లు వినికిడి. మొత్తంగా ఈ బాగోతంలో రూ.20 లక్షలకు పైగా ఐకేపీ అక్రమార్కులు దండుకున్నట్లు తెలుస్తోంది.