breaking news
disposes
-
నోట్ దిస్ పాయింట్..! ఐదు నోట్లలో ఒకటే కొత్తది
సాక్షి, స్పెషల్ డెస్క్: మనం వాడుతున్న నోట్లలో అత్యధికం పాత నోట్లే ఉంటాయి. ఐదింటిలో ఒకటి మాత్రమే తళతళ మెరుస్తూ కొత్తది ఉంటోంది. దేశవ్యాప్తంగా చెలామణిలో ఉన్న నోట్లు, ఏటా కొత్తగా విడుదలవుతున్న నోట్ల సంఖ్య ఈ విషయాన్ని చెబుతోంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏటా డిస్పోజ్ చేస్తున్న పాత నోట్ల సంఖ్య ఎంతో తెలుసా? జస్ట్ 2,000 కోట్లకు పైగానే. అజాగ్రత్తగా వాడకం దేశంలో గత ఆర్థిక సంవత్సరంలో 3,030 కోట్ల కొత్త నోట్లు రంగ ప్రవేశం చేస్తే.. 2,385 కోట్ల పాత నోట్లను ఆర్బీఐ డిస్పోజ్ (పారవేయడం) చేసింది. ఏడాదిలో డిస్పోజ్ అయిన నోట్ల సంఖ్య 12.27% పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్–అక్టోబర్ మధ్య కాలంలో 884 కోట్ల నోట్లు డిస్పోజ్ అయ్యాయి. జనం ఏ స్థాయిలో నోట్లను అజాగ్రత్తగా వాడుతున్నారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.చేతులు మురికిగా ఉన్నా పట్టుకోవడం, ఇష్టం వచ్చినట్టు మడతపెట్టి జేబు, పర్సులో దూర్చడం వంటి కారణాల వల్ల నోట్ల జీవిత కాలం తగ్గుతోంది. ఉపయోగించలేని విధంగా ఉన్న పాత నోట్లు వివిధ బ్యాంకుల ద్వారా ఆర్బీఐకి చేరతాయి. ఆర్బీఐ వీటిని చిన్నచిన్న ముక్కలుగా చేసి ఇటుకల (బ్రిక్వెట్స్) మాదిరిగా కుదించి డిస్పోజ్ చేస్తుంది. ఇలా ఏటా 15,000 టన్నుల బ్రిక్వెట్స్ పేరుకుపోతున్నాయని కేంద్ర బ్యాంక్ వెల్లడించింది.కాయినైజేషన్, యూపీఐ..ఆర్బీఐ డిస్పోజ్ చేస్తున్న నోట్లలో సింహభాగం రూ.500 నోట్లు ఉంటున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో వీటి సంఖ్య 898 కోట్లుగా ఉంది. రూ.100 నోట్లు 583 కోట్లు ఉన్నాయి. డిస్పోజ్ చేస్తున్న రూ.20, రూ.10 నోట్ల సంఖ్య భారీగా తగ్గింది. ఈ రెండు డినామినేషన్లలో రెండేళ్లలో డిస్పోజ్ అయిన నోట్ల సంఖ్య 664 కోట్ల నుంచి 373 కోట్లకు పడిపోయింది. దీనికి కారణం వీటి స్థానంలో కాయిన్స్ వచ్చి చేరడంతోపాటు యూపీఐ వాడకం పెరగడమే.అయినా నోట్ల వెల్లువ.. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) రాకతో భారత్‌లో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. అయినప్పటికీ మన దేశంలో కరెన్సీ నోట్ల వాడకం ఏమాత్రం తగ్గడం లేదు. ఆర్బీఐ ఏటా వ్యవస్థలోకి కొత్తగా ప్రవేశపెడుతున్న నోట్లే ఇందుకు నిదర్శనం. 2022–23తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లోకి వచ్చి చేరిన కొత్త నోట్ల సంఖ్య 2,260 కోట్ల నుంచి 3,030 కోట్లకు ఎగబాకింది. అంటే ఏకంగా 34% అధికం అయ్యాయన్నమాట. ఈ మూడేళ్లలో రూ.500, రూ.100 విలువచేసే నోట్లే అత్యధికంగా వ్యవస్థలోకి వెల్లువెత్తుతున్నాయి. పార్టికల్ బోర్డ్ తయారీలో.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు పాడైపోయిన నోట్ల ముక్కలు లేదా బ్రిక్వెట్స్ను భూమిలో పాతిపెట్టడం లేదా కాలుస్తున్నాయి. నోట్ల తయారీ, ముద్రణలో వాడే సెక్యూరిటీ థ్రెడ్స్, ఫైబర్స్, సెక్యూరిటీ ఇంక్స్, ఇతర రసాయనాల వల్ల తలెత్తే పర్యావరణ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని.. నోట్ల ముక్కలు, బ్రిక్వెట్స్ను పారవేయడానికి బదులుగా బోర్డ్ ప్యానెల్స్, ఇంటీరియర్ డిజైన్ మెటీరియల్, పార్టికల్ బోర్డ్ ఫర్నిచర్, అకౌస్టిక్ అప్లికేషన్లలో వినియోగించవచ్చని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉడ్ సైన్స్, టెక్నాలజీ అధ్యయనం కనుగొంది. ఈ నేపథ్యంలో పారి్టకల్ బోర్డ్ తయారీ కంపెనీలతో ఇప్పటికే ఆర్బీఐ చర్చలు ప్రారంభించింది. స్థూల–ఆర్థిక అంశాలే.. ప్రజల నుంచి డిమాండ్, పాడైన వాటి స్థానంలో కొత్తవి మార్చడం.. ఈ అంశాల ఆధారంగా ఒక సంవత్సరంలో ముద్రించాల్సిన నోట్ల పరిమాణం, విలువ ఆధారపడి ఉంటుంది. జీడీపీ అంచనా వృద్ధి, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, నగదు రహిత (డిజిటల్) చెల్లింపు పద్ధతుల్లో పెరుగుదల వంటి స్థూల–ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని చెలామణిలో ఉండే నోట్ల సంఖ్య పెరుగుదలను అంచనా వేస్తారు. ప్రజల వద్ద ఉన్న నోట్ల పరిమాణం, నోట్ల సగటు జీవితకాలం ఆధారంగా ఏటా కొత్త నోట్లను జారీ చేస్తారు. -
మాజీ సీజేఐపై ఆరోపణలు.. పిటిషన్‌ను కొట్టేసిన లోక్‌పాల్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయ మూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్‌పై అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసును లోక్‌పాల్ కొట్టివేసింది. తన న్యాయ పరిధికి మించిన అంశమని ఒక ఉత్తర్వులో పేర్కొంది. ఓ రాజకీయ పార్టీని, ఓ రాజకీయ నేతను కాపాడేందుకు తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ గతేడాది అక్టోబర్ 18వ తేదీన అప్పటి సీజేఐ జస్టిస్ చంద్రచూడ్‌పై ఫిర్యాదు అందింది. గతేడాది నవంబర్ 10వ తేదీన పదవి నుంచి ఆయన రిటైరయ్యారు. లోక్‌పాల్, లోకాయుక్త చట్టంలోని సెక్షన్–14 ప్రకారం సిట్టింగ్ సీజేఐ, సుప్రీంకోర్టు జడ్జీలు తమ న్యాయపరిధిలోకి రారని, ఈ అంశాన్ని పరిశీలించరాదని నిర్ణయించుకున్నామని లోకా యుక్త ఈ నెల 3న జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. చట్ట ప్రకారం ఇతర మార్గాలను అనుసరించే స్వేచ్ఛ పిటిషనర్‌కు ఉందని తెలిపింది. -
వీరి సాహసానికి గుర్తింపేదీ?
సాక్షి, సిటీబ్యూరో: ఆ ముగ్గురూ నగర పోలీసు విభాగంలో పని చేసిన/చేస్తున్న అధికారులు... 2007 మే 18న మక్కా మసీదులో బాంబు పేలుడు జరిగిందని తెలిసిన మరుక్షణం అక్కడికి చేరుకున్నారు... మసీదు ప్రాంగణంలో ఉన్న మరో బాంబును గుర్తించి, రక్షణ సాధనాలు లేకపోయినా ధైర్యంగా నిర్వీర్యం చేశారు... నగర పోలీసు ఉన్నతాధికారులు వీరిని పొగడ్తలతో ముంచెత్తడమేగాక పదోన్నతులు ఖాయమనీ ప్రకటించారు. అంతే... కథ అక్కడితో ఆగిపోయింది... ఇది జరిగి పదకొండేళ్లు అయినా... కేసు విచారణ పూర్తై వీగిపోయినా... వీరి పదోన్నతుల ఫైలు మాత్రం ఒక్క అడుగూ ముందుకు పడలేదు. మక్కా మసీదులో ఉగ్రవాదులు అత్యంత శక్తిమంతమైన సెల్‌ఫోన్ బాంబులను అమర్చారు. ఆర్డీఎక్స్, టీఎన్టీ మిశ్రమంతో కూడిన ఈ బాంబులతో ఉన్న ఓ బ్యాగ్‌ను మసీదు ప్రాంగణంలోని ఆరంగుళాల మందమున్న రాతి బల్ల కింద పెట్టారు. ఈ పేలుడు ధాటికి బండ తునాతునకలైంది. నిపుణుల అంచనా ప్రకారం పేలుడు తీవ్రతలో బయటకు వచ్చింది కేవలం 30 శాతం మాత్రమే. అయినా ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతే శక్తివంతమైన మరో బాంబును మసీదు పరిపాలనా కార్యాలయం సమీపంలో గ్రిల్స్‌కు వేలాడదీశారు. ఇది పేలి ఉంటే ప్రాణనష్టం అపారంగా ఉండేది. మసీదులో తొలి బాంబు పేలిన వెంటనే అప్రమత్తమైన నగర పోలీసులు సిటీ సెక్యూరిటీ వింగ్ (సీఎస్‌డబ్ల్యూ)లోని బాంబు నిర్వీర్య బృందాలతో పాటు... క్లూస్ టీమ్‌ను ఘటనా స్థలికి పిలిపించారు. అప్పట్లో సిటీ క్లూస్ టీమ్ అధికారిగా ఉన్న తరువు సురేష్, సీఎస్డబ్ల్యూలో పనిచేస్తున్న రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ సీహెచ్.ఎన్.ఎస్.వి.రమణ, కానిస్టేబుల్ హెచ్.అనిల్‌కుమార్ ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే మసీదు ప్రాంగణంలో అనుమానాస్పదంగా ఉన్న మరో బ్యాగును గుర్తించిన మసీదు సిబ్బంది వీరి దృష్టికి తెచ్చారు. అయితే బాంబ్సూట్, మరే ఇతర రక్షణ సాధనాలు లేకపోయినా వేగంగా స్పందించారు. బాంబును మసీదు సమీపంలోని కిల్వత్ గ్రౌండ్లోకి తరలించి అందుబాటులో ఉన్న సాధారణ పరికరాలతోనే నిర్వీర్యం చేశారు. ఆ సందర్భంగా వీరి సాహసాన్ని అందరూ కొనియాడారు. పోలీసు ఉన్నతాధికారులు హామీల వర్షం కురిపించారు. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో అప్పట్లో ప్రతి నెలా ఇచ్చే రివార్డులను ఇచ్చి సరిపుచ్చారు. రమణ, అనిల్‌లకు పదోన్నతికి సిఫారసు చేస్తూ అదే ఏడాది జూన్‌లో అప్పటి కమిషనర్ బల్వీందర్‌సింగ్ ప్రభుత్వానికి లేఖ (నెం. ఎల్ అండ్ ఓ ఎం 7ఆర్ఆర్255907) రాశారు. ఈ ప్రతిపాదన ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. ఆ లేఖలో క్లూస్ అధికారి సురేష్ ప్రస్తావన సైతం లేకపోవడం గమనార్హం. ఈ ఫైల్‌కు ఇప్పటికీ మోక్షం లభించలేదు. దర్యాప్తులో ఎన్ఐఏ విఫలం చాదర్‌ఘాట్: మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తులో ఎన్ఐఏ విఫలమైనందున దర్యాప్తు బాధ్యతలు మరో సంస్థకు అప్పగించాలని ఎంబీటీ అధికార ప్రతినిధి, మాజీ కార్పొరేటర్ అంజదుల్లాఖాన్ అన్నారు. సోమవారం చంచల్‌గూడ లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా పేర్కొన్న వారిని నిర్ధోషులుగా విడుదల చేసిన నేపథ్యంలో కేసుపై హైకోర్ట్‌లో అప్పీల్ వేయాలన్నారు. ఈ పేలుళ్లతో ఎలాంటి సంబంధం లేకపోయినా వంద మంది మైనారిటీ యువకులను నెలలు జైళ్లల్లో నిర్భందించారన్నారు. అసలు నిందితులను పట్టుకోవటంలో ఎన్ఐఏ విఫలమైందని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత కూడా కారణమని ఆరోపించారు. తమను అన్యాయంగా జైల్లో ఉంచి తమ జీవితాలతో ఆడుకున్నారని బాధితుడు సయ్యద్ ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. -
లోక్ అదాలత్‌లో 1.25 కోట్ల కేసులు పరిష్కారం
బాధితులకు రూ. 3 వేల కోట్ల నష్టపరిహారాల పంపిణీ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా శనివారం జరిగిన రెండో జాతీయ లోక్ అదాలత్‌లో 1.25 కోట్లకు పైగా కేసులు పరిష్కారమయ్యాయి. వాహన ప్రమాదాలు, ఇతర కేసుల బాధితులకు రూ. 3 వేల కోట్ల నష్ట పరిహారం కూడా పంపిణీ జరిగింది. జాతీయ న్యాయ సేవల అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ లోక్ అదాలత్ ద్వారా అన్ని రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు సగటున 9 శాతం తగ్గిపోయాయి. శనివారం లోక్ అదాలత్‌ను సుప్రీంకోర్టులో న్యాయమూర్తి జస్టిస్ ఏఆర్ దవే ప్రారంభించగా, 53 కేసుల్లో 28 కేసులను మూడు సుప్రీం ధర్మాసనాలు పరిష్కరించాయి. కుటుంబ వివాదాలు, వైవాహిక సంబంధ, ప్రమాదాల కేసులు, బ్యాంకు రికవరీలు, రెవెన్యూ వివాదాలు, ఉపాధి హామీ, ఇతర పథకాల్లో నిధుల పంపిణీ వంటి కేసులు పరిష్కారమయ్యాయి.


