breaking news
dibrugadh University
-
80 చెంపదెబ్బలు కొట్టిన సీనియర్లు.. రెండో అంతస్తు నుంచి దూకిన విద్యార్థి
దిస్పూర్: అస్సాం డిబ్రూగఢ్ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. సీనియర్ల టార్చర్ భరించలేక ఓ విద్యార్థి హాస్టల్ రెండో అంతస్తు నుంచి కిందకు దూకాడు. తీవ్రగాయాల పాలైన అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితుడ్ని శివసాగర్ జిల్లా అమ్గూరికి చెందిన ఆనంద్ శర్మగా గుర్తించారు. ఈ యూనివర్సిటీలో ఎంకామ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే తమ కుమారుడ్ని సీనియర్లు వారం రోజులుగా వేధిస్తున్నారని అతని తల్లి తెలిపింది. ఆదివారం కూడా 80 చెంపదెబ్బలు కొట్టారని, కర్రలు, బాటిళ్లతో టార్చర్ చేశారని వెల్లడించింది. అది భరించలేకే తన కుమారుడు భవనం పైనుంచి దూకేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ర్యాగింగ్ విషయం గురించి హాస్టల్ వార్డెన్‌ను ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆనంద్ శర్మ తల్లి వాపోయింది. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జితెన్ హజారికా చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం స్పందన.. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు. అయితే ప్రధాన నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని సీఎం హిమంత బిశ్వ శర్మ సూచించారు. పోలీసులు తక్షణమే విచారణ చేపట్టి ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చదవండి: పెళ్లి చేసుకోకపోతే.. ముక్కలు ముక్కలు చేస్తా.. అమ్మాయికి బెదిరింపులు.. -
నకిలీ చెక్కుల ముఠాకు చెక్
నర్సీపట్నం టౌన్: నకిలీ చెక్కులతో బ్యాంకు అధికారులను బురిడీ కొట్టించి దాదాపు అర కోటి రూపాయలను కైంకర్యం చేసిన కేసులో అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు ముగ్గురికి యలమంచిలి కోర్టు రిమాండు విధించింది. దీంతో వారిని సోమవారం విశాఖపట్నంలోని సెంట్ర ల్ జైలుకు పోలీసులు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి... అస్సాంలోని దిబ్రుగఢ్ యూనివర్సిటీ పేరుతో సుమారు రూ. 9.86 లక్షలకు, విజయవాడ జేకే టైర్స్ పేరుతో రూ. 39.86 లక్షలకు సృష్టించిన నకిలీ చెక్కులను ఉప్పు కేశవరావు, సోమల నాగేంద్ర 2013, ఏప్రిల్ 29న నర్సీపట్నంలోని ఒక బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ మొత్తాన్ని డ్రా చేశారు. అయితే అవి నకిలీవని తేలడంతో సంబంధిత బ్యాం కు మేనేజరు ఫిర్యాదు మేరకు పోలీసు లు ఈ కేసును దర్యాప్తు చేశారు. నింది తులైన కేశవరావు, నాగేంద్రలను గత ఏడాది మే 23న అరెస్టు చేశారు. ఈ వ్య వహారం వెనుక అంతర్రాష్ట్ర ముఠా హ స్తం ఉందని తేలడంతో ఆ దిశగా దర్యా ప్తు చేశారు. బీహార్‌లోని పాట్నాకు చెంది న సన్ని ప్రియదర్శి, విశ్వవిజేత సిన్హా, అభయకుమార్ సిన్హా, ఉత్తమకుమార్ సాహులపై కేసు నమోదు చేశారు. అ యితే అప్పటికే వారు ఇదే నకిలీ చెక్కు ల వ్యవహారంలో బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు మరో మూ డు రాష్ట్రాల్లోనూ వారిపై ఇదే తరహా కేసులు ఉన్నాయి. పాట్నా సెంట్రల్ జై లులో ఉన్న ప్రియదర్శి, విశ్వవిజేత సి న్హా, అభయకుమార్ సిన్హాలను నర్సీపట్నం కోర్టులో హాజరుపరిచేందుకు బీ హార్ పోలీసులు సోమవారం తీసుకొచ్చారు. నర్సీపట్నం కోర్టు జడ్జి సెలవు లో ఉండడంతో యలమంచిలి కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు కోర్టు రిమాండ్ విధించడంతో వారిని పోలీసులు విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో వీరిని నర్సీపట్నం పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు.