breaking news
Dhanush prabhu solomon
-
ఫారిన్ గ్యాంగ్‌స్టర్
ధనుష్ హీరోగా ‘పిజ్జా, పేట’ చిత్రాల ఫేమ్ కార్తీ్తక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందని కోలీవుడ్‌లో ఎప్పట్నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన శుక్రవారం వెల్లడైంది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి ఈ సినిమా నిర్మించనున్నట్లు వై నాట్ స్టూడియో సంస్థ తెలిపింది. ఇందులో ఐశ్వర్యాలక్ష్మీ హీరోయిన్గా నటించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఆగస్టులో ప్రారంభం కానుంది. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. షూటింగ్ మొత్తాన్ని యూకేలో జరుపనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించనున్నారు. -
ధనుష్‌తో మేఘా ఆకాష్ రొమాన్స్
వర్ధమాన నటి మేఘా ఆకాష్‌కు నటుడు ధనుష్‌తో రొమాన్స్ చేసే లక్కీఛాన్స్ వరించింది. ధనుష్ ప్రభుసాలమన్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రాన్ని పూర్తి చేశారు. తదుపరి వెట్ట్రిమారన్ దర్శకత్వంలో వడచెన్నై చిత్రంలో నటించాల్సి ఉంది. అయితే ఆ చిత్రాన్ని వెనక్కు నెట్టి గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అయ్యారు ధనుష్. దర్శకుడు గౌతమ్‌మీనన్, నటుడు ధనుష్‌ల రేర్ కాంబినేషన్లో ఇక చిత్రం తెరకెక్కనుందన్న విషయం ఇప్పటికే ప్రకటించారు. దీనికి ఎన్నై నోక్కి పాయుమ్ తూటా అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చిత్రం షూటింగ్ సోమవారం చెన్నైలో నిరాడంబరంగా ప్రారంభమైంది. ఇందులో వర్ధమాన నటి మేఘా ఆకాష్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈమె బాలాజీ ధరణీధరణ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఒక పక్క కథై చిత్రం ద్వారా కథానాయికగా కోలీవుడ్‌కు పరిచయం అయ్యారన్నది గమనార్హం. ఆ చిత్రం ఇంకా విడుదల కాకుండానే స్టార్ హీరో ధనుష్‌తో రొమాన్స్ చేసే అవకాశాన్ని దక్కించుకోవడం విశేషమే. ఎన్నై నోక్కి పాయుమ్ తూటా చిత్రం కోసం దర్శకుడు గౌతమ్‌మీనన్ చెన్నై శివారు ప్రాంతంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ధనుష్, మేఘా ఆకాష్‌లపై ప్రేమ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.