‘ధమాల్ 4’ ట్రైలర్.. నవ్వులే నవ్వులు
బాలీవుడ్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీలో ‘ధమాల్’ ఒకటి. ఈ ఫ్రాంచైజీ నుంచి రానున్న తాజా సినిమా ‘ధమాల్ 4’. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఈ అడ్వెంచరస్ కామెడీ ఎంటర్టైనర్కి ఇంద్రకుమార్ దర్శకుడు. అజయ్ దేవగన్, భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, అశోక్ థాకేరియా, ఇంద్రకుమార్, ఆనంద్ పండిట్, కుమార్ మంగత్ పాఠక్ నిర్మించిన ఈ మూవీ జూలై 10న విడుదల కానుంది. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు. ‘హెల్ప్ చేయండి’..., ‘సైతాన్ సింగ్ నిధికి చెందిన చిరునామాను కాస్త గట్టిగా చెప్పండి’, ‘అరె.., నిధికి సంబంధించిన మ్యాప్ దొరికింది’ అని తెలుగు అర్థం వచ్చే హిందీ డైలాగ్స్ ‘ధమాల్ 4’ ట్రైలర్లో ఉన్నాయి. ‘ధమాల్ 4’లో నాలుగింతల వినోదం ఉంటుందని ఇటీవల అజయ్ దేవగన్ పేర్కొన్నారు. ఇందుకు తగ్గట్లుగానే ట్రైలర్లో కామెడీ సీన్స్ కనిపిస్తున్నాయి.