breaking news
DEVINENI umamahesvara rao
-
ఇంకా పట్టిసీమలోనే..
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం సందర్భంగా తీసుకొచ్చిన హంద్రీనీవా పాత మోటారు ఇంకా పట్టిసీమలోనే ఉంది. ఈనెల 18న హడావుడిగా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేందుకు ఈ మోటారును హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన 24 గంటల్లోనే జానంపేట వద్ద అక్విడెక్ట్‌కు గండి పడటంతో గోదావరి నుంచి నీటి తోడకాన్ని నిలిపివేశారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం 6వ నంబర్ వెల్‌కు బిగించిన హంద్రీనీవా పాత మోటారును తొలగించారు. దీని స్థానంలో చైనానుంచి తెచ్చిన మోటారును చైనా ఇంజినీర్లు బిగిస్తున్నారు. పాత మోటారును హంద్రీనీవాకు తరలిస్తామని జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించినా.. దానిని అక్కడికి తీసుకెళ్లలేదు. -
బొత్స వల్లే టీ నోట్ : ఉమా
కంచికచర్ల, న్యూస్‌లైన్ : పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ నిర్వాకం వల్లే కేంద్రం టీ నోట్‌ను ఆమోదించిందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మైలవరం శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. స్థానిక ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న అబ్బూరి రామారావు, దుడ్డు మురళివాసు, యనమదల రమేష్‌బాబును శనివారం సాయంత్రం ఎమ్మెల్యే ఉమ పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఉమ మాట్లాడుతూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేల మద్దతును తెలంగాణ తీర్మానానికి అనుకూలంగా తాను కూడగట్టానని చెప్పడంతోనే కేంద్రం టీ నోట్‌ను ఆమోదించిందన్నారు. ఈ విషయం తెలుసుకున్న విజయనగరం జిల్లా ప్రజలు బొత్స ఆస్తులపై దాడులు నిర్వహిస్తున్నారన్నారు. ఇలాంటి వ్యక్తుల కుయుక్తులను ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. కేంద్రం కళ్లు తెరిపించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం నుంచి ఢిల్లీలో ఆమరణ నిరాహారదీక్ష చేయనున్నారన్నారు. జేఏసీ కన్వీనర్ గంగిరెడ్డి రంగారావు, కందుల వెంకట్రావు, కాసరగడ్డ రామారావు, కోగంటి బాబు, నన్నపనేని లక్ష్మీనారాయణ, బుడ్డి సూర్యప్రకాష్, నాగవరపు రాజు పాల్గొన్నారు.