breaking news
Devineni Rajasekhar (Nehru)
-
మహామహులు ఏలిన పెనమలూరు
సాక్షి, కృష్ణా : పెనమలూరు నియోజకవర్గం విలక్షణమైనది. జిల్లాలో అత్యధిక ఓటర్లు గల నియోజకవర్గాల్లో రెండోది. 2009లో చేపట్టిన నియోజకవర్గ పునర్విభజనలో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ రెండు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గంలో పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం 41 గ్రామాలు, ఒక మున్సిపాలిటి, ఉయ్యూరు నగర పంచాయతీలు ఉన్నాయి. నియోజకవర్గం మొత్తం విస్తీర్ణం 68,208 ఎకరాలు. విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారికి ఇరువైపులా విస్తరించి ఉన్న నియోజకవర్గం. 41 గ్రామాలు, 1 మున్సిపాలిటీకి అన్నింటికీ రహదారి మార్గం, రవాణా సౌకర్యాలు ఉన్నాయి. నిత్యం విజయవాడ–మచిలీపట్నం, విజయవాడ–ఏలూరు, అవనిగడ్డ, గన్నవరం, గుడివాడ ప్రాంతాలకు రవాణా సదుపాయాలు ఉన్నాయి. నియోజకవర్గం మీదుగా ప్రధానంగా బందరు, రైవస్ కాలువలు, వాటికి అనుబంధ కాలువలు ప్రవహిస్తున్నాయి. కృష్ణానది ఏటిపాయ కూడా పెనమలూరు, కంకిపాడు మండలాల్లోని ఐదు గ్రామాల మీదుగా ప్రవహిస్తుంది. సాగునీరు వ్యవస్థ అం దుబాటులో ఉంది. ప్రధానంగా బోర్లు, కాలువ నీటిపై ఆధారపడి సాగు జరుగుతుంది. వ్యవసాయాధారిత గ్రామాలు ఎక్కువ. పెనమలూరు మండలం సెమీ అర్బన్ ప్రాంతం. పట్టణీకరణ వాతావరణం. ఉద్యోగులు, కార్మికులు ప్రధానంగా ఉన్నారు. రాజధా ని అమరావతి, విజయవాడకు కూతవేటు దూరంలోనే నియోజకవర్గ గ్రామాలు ఉన్నాయి. ప్రతి పనికీ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్తుంటారు. మూడవ పర్యాయం.. 2009లో జరిగిన నియోజకవర్గ పునర్విభజనతో పెనమలూరు నియోజకవర్గం ఏర్పడింది. తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కొలుసు పార్థసారథి, టీడీపీ అభ్యర్థి చలసాని వెంకటేశ్వరరావు (పండు)పై 177 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మంత్రివర్గంలో స్థానం పొంది అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో పార్థసారథి ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్, వైఎస్సార్సీపీ అభ్యర్థి కుక్కల విద్యాసాగర్‌పై 31,448 మెజారిటీతో గెలుపొందారు. రద్దయిన కంకిపాడు, ఉయ్యూరు నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా రెండో అతి పెద్ద నియోజకవర్గంగా ఉన్న కంకిపాడు, ఉయ్యూరు నియోజకవర్గాలు పునర్విభజనతో రద్దయ్యాయి. పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాలతో పెనమలూరు నియోజకవర్గం ఏర్పాటైంది. గతంలో ఉయ్యూరు నియోజకవర్గంలో ఉన్న పమిడిముక్కల, తోట్లవల్లూరు పామర్రు నియోజకవర్గంలో కలిశాయి. విజయవాడ రూరల్, అర్బన్ డివిజన్లు మైలవరం, విజయవాడ పరిధిలోకి వెళ్లాయి. కంకిపాడు నియోజకవర్గంలో... తొలి రోజుల్లో ఇక్కడ కమ్యూనిష్టులదే ప్రభావం. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించాక కంకిపాడు టీడీపీకి పెట్టని కోట అయ్యింది. 13 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఇక్కడి నుంచి ఐదు పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికైన నేత మాత్రం దేవినేని రాజశేఖర్ (నెహ్రూ). రాజకీయంగా కోనేరు రంగారావుకు విజయాన్ని అందించింది కూడా కంకిపాడు నియోజకవర్గమే. రద్దయిన ఉయ్యూరు నియోజకవర్గంలో సమరయోధుడు కాకాని వెంకటరత్నం మూడు సార్లుగెలిచారు. ఉయ్యూరుకు తలమానికం చక్కెర కర్మాగారం ఆసియా ఖండంలోనే అతిపెద్ద చెక్కర కర్మాగారాల్లో ఉయ్యూరు కేసీపీ కర్మాగారం కూడా ఒకటి. కర్మాగారం పరిధిలో 20 మండలాల్లో 26 వేల ఎకరాల్లో చెరకు సాగు జరుగుతోంది. 16 వేల మంది రైతులు కర్మాగారంలో 700 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు మొత్తం జనాభా : 3,55,277 మొత్తం ఓటర్లు : 2,58,586 పురుషులు: 1,26,239 మహిళలు : 1,32,324 ఇతరులు : 23 -
నేను నమ్మిన నిజాలే వంగవీటి సినిమా: వర్మ
విజయవాడ సిటీ:తాను నమ్మిన, తనకు తెలిసిన నిజాలు ‘వంగవీటి’ సినిమాలో ఉంటాయని సంచలన వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ చెప్పారు. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ), ప్రముఖ న్యాయవాది కర్నాటి రామ్మోహన్సహా పలువురిని కలవనున్నట్టు తెలిపారు. చిత్రీకరణకు ముందే సంచలనం రేపుతున్న వంగవీటి సినిమా నిర్మాణానికి ముందు అప్పటి పరిస్థితులతో ప్రత్యక్ష సంబంధం ఉన్న, తెలిసిన వారిని కలిసేందుకు శుక్రవారం సాయంత్రం నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఇక్కడ విలేకరుల సమావేశంలో రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ చలసాని వెంకటరత్నం హత్య మొదలు వంగవీటి రంగా హత్య వరకు తన చిత్ర కథాంశం ఉంటుందన్నారు. తన సినిమాలో నిజం మాత్రమే ఉంటుందే తప్ప ఏ ఒక్కరినో కించపరచడం, తప్పు చేసినట్టు చూపించడం ఉండదన్నారు. అప్పట్లో చోటుచేసుకున్న ఘటనలు, కారణాలు, పరిస్థితులు తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఇందుకోసం పలువురిని కలవాల్సి ఉందని, అయితే, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రత్నకుమారి, వంగవీటి రాధాకష్ణలు తమను కలవవద్దని చెప్పినట్టు తెలిపారు. కలవాలనుకోవడం తన ఇష్టమని, కలవవద్దనుకోవడం వారి ఇష్టమని ఆయన స్పష్టంచేశారు. అప్పటి పరిస్థితులతో ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయం ఉన్న వారి నుంచి కొన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉందన్నారు. వారిలో చిన్నపాటి వ్యక్తి మొదలు పేరొందిన నాయకులు, సన్నిహితులు ఉండొచ్చని చెప్పారు. ఎవరిని కలిసి, ఏం మాట్లాడతాననేది ఇప్పుడు చెప్పనన్నారు. మూడు రోజులు ఇక్కడే ఉండి ప్రతి ఒక్కర్నీ కలవనున్నానన్నారు. కలిసిన తర్వాత అవసరమైన పక్షంలో చెపుతానని తెలిపారు. తాను విజయవాడ కాలేజీలో చదివే రోజుల్లో జరిగిన అంశాలు అయినందున సినిమా తీయాలని నిర్ణయించుకున్నానన్నారు. సినిమా తీయాలనుకున్నప్పుడు ఏ ఒక్కరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని, రక్తచరిత్ర సమయంలో పరిటాల సునీత అనుమతి కూడా తీసుకోలేదని చెప్పారు. వంగవీటి సినిమా వల్ల కొందరికి, తనకు తప్ప ఆయా వర్గాల మధ్య విభేదాలు ఎందుకొస్తాయని ఆయన ప్రశ్నించారు. అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముంబైలోనే సినిమా షూటింగ్ జరుపుతానని అన్నారు. మరో పది రోజుల్లో సినిమా ప్రారంభించి జూన్ మొదటి వారంలో విడుదలకు నిర్ణయించామని చెప్పారు. విలేకరుల సమావేశంలో వంగవీటి సినీ నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ కూడా పాల్గొన్నారు.