breaking news
Development works in the city
-
వాకింగ్ స్ట్రీట్: డీసెంట్ రోడ్డు.. !
సాక్షి, అమరావతి: విజయవాడలోని బీసెంట్ రోడ్డు.. ఈ పేరు వినగానే కిటకిటలాడే దుకాణాలు గుర్తుకొస్తాయి. భిన్న రకాల వస్త్రాలు, వస్తువులు అందుబాటు ధరల్లో ఇక్కడ లభిస్తాయి. ప్రస్తుతం దానికి కొత్తరూపును తీసుకొచ్చేందుకు నగర పాలక సంస్థ సిద్ధమైంది. సుందరంగా తీర్చిదిద్దటంతో పాటు కేవలం ఈ రహదారిని పాదచారులే వినియోగించేలా మార్చబోతున్నారు. రూ. 25.84 కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇక్కడ 200కు పైగా శాశ్వత దుకాణాలు, 150కిపైగా తోపుడుబండ్లు్ల, చిరు వ్యాపారులున్నారు. ప్రస్తుతం బీసెంట్‌రోడ్డులో భవనాల మధ్య ఉన్న పాతకాలం నాటి చెట్లు తప్ప పచ్చదనం మచ్చుకు కూడా కనిపించదు. ఈ పరిస్థితిలో పూర్తి మార్పు తీసుకురానున్నారు. హరిత వర్ణం శోభిల్లేలా రోడ్డుకు రెండు వైపులా మొక్కలు నాటనున్నారు. పాదచారులకు ఆహ్లాదం కలిగించేలా వివిధ రకాల మొక్కల్ని పెంచనున్నారు. వాహనాలు తిరిగే అవకాశంలేని నేపథ్యంలో రోడ్డంతా సీసీ కబుల్ స్టోన్(టైల్స్)తో అమర్చాలని నిర్ణయించారు. నడకకు ఇబ్బంది కలిగించని, జారుడు లేని వాటిని అమర్చుతారు. చూడగానే ఆకట్టుకునేలా భిన్న డిజైన్లను ఎంచుకోనున్నారు. భూగర్భంలో తీగలు.. బీసెంట్ రోడ్డులో వెళ్తూ తలపైకెత్తి చూస్తే వివిధ రకాల తీగలు సాలీడు గూళ్లను తలపిస్తుంటాయి. కొన్ని చేతికందే ఎత్తులోనూ ప్రమాదకరంగా వేలాడుతుంటాయి. విద్యుత్ తీగలు, కేబుల్వైర్లతో గందరగోళంగా ఉంటుంది. అవన్నీ ఇక మన కంటికి కనిపించవు. కొత్త ప్రణాళిక ప్రకారం తీగలన్నింటినీ భూగర్భంలోకి మార్చుతారు. ఎక్కడా బయటకు కనిపించవు. షాపులు.. బోర్డులు ప్రస్తుతం ఉన్న దుకాణాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. కొన్ని ముందుకు, మరికొన్ని రోడ్డుపైకి చొచ్చుకొచ్చాయి. ఒక్కో చోట ఒక్కో రకంగా ఉన్నాయి. వాటని్నంటినీ క్రమపద్ధతిలోకి తీసుకురానున్నారు. మొదటి నుంచి చివరి వరకు రోడ్డు పక్కన నిర్దేశించిన స్థలం నుంచే ప్రారంభమవుతాయి. ఒకే వరుసలో కనిపిస్తా యి. అదే క్రమంలో బోర్డులు కూడా ఏర్పాటు చేయనున్నా రు. రంగులు, అక్షరాలు తదితరమైనవి సమానంగా ఉండనున్నాయి. తద్వారా బీసెంట్‌రోడ్డు ప్రత్యేకతను సంతరించుకుంటుందని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ చెబుతున్నారు. బీసెంట్ రోడ్డులో ఏర్పాటు చేయనున్న తోపుడుబండ్ల నమూనా చిత్రమిది తోపుడు బండ్లకు ప్రాధాన్యం.. ప్రస్తుతం బీసెంట్ రోడ్డులో శాశ్వత దుకాణాలతో సమానంగా తోపుడుబండ్లుదర్శనమిస్తాయి. నడకదారి పక్కనున్న చిరు వ్యాపారులు వాటికి తోడవుతున్నారు. వెరసి రహదారి సగానికిపైగా వాహన, పాదచారులకు అందుబాటులో లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తోపుడుబండ్లను కూడా క్రమబద్ధీకరించబోతున్నారు. రోడ్డంతా కాకుండా కొన్ని ప్రాంతాల్ని నిర్దేశించనున్నారు. ఒకే విధంగా ఉండేలా ప్రత్యేక డిజైన్‌తో ఆకట్టుకునేలా సిద్ధం చేయబోతున్నారు. పార్కింగ్‌కు ప్రత్యేకం.. వాహనాలు ఎక్కపడితే అక్కడ నిలుపుతుండటంతో రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోంది. ముందుకెళ్లేందుకు పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించనున్నారు. అన్ని రకాల వాహనాలు అక్కడికే తీసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆక్రమణల తొలగింపు.. ప్రస్తుతం ఉన్న రోడ్డు చాలా ఇరుకుగా ఉంటోంది. దుకాణదారులు రహదారిని ఆక్రమించేశారు. చిరు వ్యాపారులు, తోపుడుబండ్లతో మరింత ఇరుగ్గా మారింది. పండుగలు, ఇతర శుభ సందర్భాల్లో అడుగు వేయాలంటేనే కష్టతరంగా ఉంటోంది. ఆక్రమణలు తొలగించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. తద్వారా సాఫీగా సాగేందుకు వీలవుతుందని అధికారులు చెబుతున్నారు. -
రూ.100 కోట్లకు ఈ-‘టెండర్’!
సాక్షి, ముంబై: నగరంలో అభివృద్ధి పనులకు గాను చేపట్టిన ఈ-టెండరింగ్ ప్రక్రియలో భారీగా అవకతవకలు జరిగాయి. మహా నగర పాలక సంస్థ (బీఎంసీ) పరిధిలోని వార్డుస్థాయిలో చేపట్టిన సుమారు రూ.600 కోట్ల విలువైన పనుల్లో రూ.100 కోట్ల మేర అవినీతి చోటుచేసుకున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన నివేదిక బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటేకు సమర్పించారు. ఈ అవినీతిలో హస్తమున్న 20 మంది ఇంజినీర్లతోపాటు మరికొంత మంది బీఎంసీ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడే అవకాశాలున్నాయి. అలాగే కొందరు కాంట్రాక్టర్లపై కూడా చర్యలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిప్యూటీ కమిషనర్ వసంత్ ప్రభును సీతారాం కుంటే ఆదేశించారు. ఈ మేరకు ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా నియమించారు. ఈ కమిటీ నివేదికను ఆధారంగా చేసుకుని ఎంతమందిపై చర్యలు తీసుకోవాలనేది నిర్ణయం తీసుకుంటారు. బీఎంసీలో 227 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ప్రతియేటా ఆయా వార్డుల్లో మరుగుదొడ్లకు మరమ్మతులు, గుంతలు పూడ్చడం, మురికి కాల్వలు, నాలాలు శుభ్రం చేయడం, నీటి పైపులకు మరమ్మతులు తదితర పనులు జరుగుతుంటాయి. దీంతో ఆయా వార్డుల స్థాయిలో అభివృద్ధి పనులు పారదర్శకంగా జరిగేందుకు ఈ-టెండర్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. గతంలో బీఎంసీ అధికారులు ఈ పనులన్నీ తమకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లకే అప్పగించేవారు. దీని వల్ల అవినీతి, అవకతవకలు జరుగుతున్నాయని అప్పట్లో అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో పనులు పారదర్శకంగా జరగాలంటే ఆ ప్రక్రియకు పూర్తిగా స్వస్తి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని కుంటే భావించారు. అందుకు ఈ-టెండర్ ప్రక్రియ అమలుచేయాలని నిర్ణయించారు. కాగా, ‘ఈ-టెండరింగ్’ను అప్పట్లో చాలామంది కార్పొరేటర్లు వ్యతిరేకించారు. అయినప్పటికీ కుంటే బలవంతంగా దీన్ని అమలు చేశారు. ఇటీవల రూ.600 కోట్లతో పూర్తిచేసిన అభివృద్ధి పనులన్నీ ఈ-టెండర్ ద్వారా చేపట్టినవే. కాని ఇందులో కూడా గతంలో లాగే తమకు నచ్చిన కాంట్రాక్టర్లకే బాధ్యతలు అప్పగించినట్లు తేలిసింది. దీనిపై విజిలెన్స్ అధికారులు పరిశీలించగా రూ.100 కోట్ల మేర అవకవతకలు జరిగినట్లు ఆరోపించారు. దీంతో బీఎంసీ పరిపాలన విభాగం అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య జరుగుతున్న అవినీతి బాగోతం మరోసారి బయటపడినట్లయ్యింది.