breaking news
destruction of evidence
-
సాక్ష్యాలను నాశనం చేశారు
కోల్‌కతా: దేశవ్యాప్త ఆగ్రహావేశాలకు, ఆందోళనలకు కారణమైన కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఉదంతం శనివారం కీలక మలుపు తిరిగింది. ఆర్.జి.కర్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఈ దారుణం జరిగిన సమయంలో ప్రిన్సిపల్‌గా ఉన్న సందీప్ ఘోష్ సాక్ష్యాధారాలను నాశనం చేశారని సీబీఐ కేసు నమోదు చేసింది. ఆస్పత్రి నిధుల దురి్వనియోగం కేసులో ఆయన ఇప్పటికే జ్యుడీíÙయల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. సాక్ష్యాలను నాశనం చేయడం, ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యంతో పాటు కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రయతి్నంచారని ఘోష్‌పై అభియోగాలు మోపింది. ఇవే అభియోగాలపై స్థానిక తలా పోలీసుస్టేషన్ సీఐ అభిజిత్ మండల్‌ను కూడా అరెస్టు చేసింది. ఆర్.జి.కర్ ఆసుపత్రి తలా పోలీసుస్టేషన్ పరిధిలోకే వస్తుంది. అభిజిత్ మండల్‌ను శనివారం సీబీఐ తమ కార్యాలయంలో కొన్ని గంటల పాటు ప్రశ్నించింది. సంతృప్తికరమైన సమాధానాలు రాకపోవడంతో మండల్‌ను అరెస్టు చేసింది. అతన్ని ప్రశ్నించడం ఇది ఎనిమిదోసారి అని. ప్రతిసారీ మండల్ భిన్నమైన కథనం చెబుతున్నాడని సీబీఐ వర్గాలు తెలిపాయి. సందీప్ ఘోష్‌ను కస్టడీ కోరుతూ సీబీఐ న్యాయస్థానంలో దరఖాస్తు చేసింది. సీబీఐ కస్టడీ నిమిత్తం ఘోష్‌ను హాజరుపర్చాల్సిందిగా కోర్టు జైలు అధికారులను ఆదేశించిందని సీబీఐ అధికారి ఒకరు శనివారం తెలిపారు. 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ ఆగస్టు 9న ఆస్పత్రి సెమినార్ హాల్లో శవమై కని్పంచడం తెలిసిందే. ఆమెపై పాశవికంగా అత్యాచారం జరిపి దారుణంగా హతమార్చినట్లు పోస్టుమార్టంలో తేలింది. ఒక రోజు అనంతరం ఆస్పత్రిలో పౌర వాలంటీర్‌గా పనిచేస్తున్న ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణంపై వైద్యలోకం భగ్గుమంది. దీనివెనుక చాలామంది ఉన్నారని, ఆ వాస్తవాలను తొక్కిపెట్టేందుకు మమత సర్కారు ప్రయతి్నస్తోందని డాక్టర్లు ఆరోపించారు. వైద్యశాఖ కీలక డైరెక్టర్లు, కోల్‌కతా పోలీసు కమిషనర్ తదితరుల రాజీనామా కోరుతూ పశి్చమ బెంగాల్ వ్యాప్తంగా నిరసనలతో వైద్యులు హోరెత్తిస్తున్నారు. అనంతర పరిణామాల్లో కేసు దర్యాప్తును సీబీఐకి కలకత్తా హైకోర్టు అప్పగించింది. దర్యాప్తు పురోగతిపై మూడు వారాల్లోగా నివేదిక సమరి్పంచాల్సిందిగా ఆదేశించింది. ఆ మేరకు సెపె్టంబర్ 17లోగా దర్యాప్తు సంస్థ నివేదిక సమరి్పంచనుందని సమాచారం. ఘోష్‌కు నేరగాళ్లతో లింకులు వైద్యురాలిపై దారుణం జరిగిన మర్నాడే సందీప్ ఘోష్ హడావుడిగా ఆస్పత్రిలో మరమ్మతులకు ఆదేశాలు జారీ చేసినట్టు సీబీఐ ఆరోపిస్తోంది. ఆ మేరకు ఘోష్ ఆదేశాలిచి్చ న లేఖను కూడా బెంగాల్ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ కేసు నిందితులతో ఘోష్‌కు నేరపూరిత బంధం ఉందని, వారితో కలిసి పలు తప్పుడు పనులకు కూడా పాల్పడ్డారని సీబీఐ గత వారమే అభియోగాలు మోపింది. -
సాక్ష్యాలు నాశనం చేయడానికే సీఐడీ దర్యాప్తు
సాక్షి,బెంగళూరు: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఐఏఎస్ అధికారి డీ.కే రవికి సంబంధించిన కేసులో సాక్ష్యాలు నాశనం చేయడానికే సీఐడీ దర్యాప్తు పేరుతో ఆధికార కాంగ్రెస్ పార్టీ నాటకాలు అడుతోందని శాసనసభలో జేడీఎస్ ఫ్లోర్ లీడర్ కుమారస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఓ రెండు ఫైల్స్‌లోని సమాచారం నాశనం చేయడానికే దర్యాప్తు పేరుతో సీఐడీలోని కొంతమంది అధికారులు తరుచుగా డీ.కే రవి కార్యాలయానికి వెలుతున్నారని పేర్కొన్నారు. బెంగళూరులో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఐడీ దర్యాప్తు మొత్తం నిబంధనలకు విరుద్ధంగా సాగుతోందన్నారు. డీ.కే రవి కేసుకు సంబంధించి ఓ మహిళా ఐఏఎస్ అధికారిని రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకూ ఎందుకు విచారణ చేశారు. మహిళ, అందులోనూ ఐఏఎస్ అధికారి అని చూడకుండా అర్ధరాత్రి వేళ విచారణ చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. అంతేకాకుండా దర్యాప్తునకు సంబంధించిన విషయాలను సీఐడీ అధికారులు కావాలనే కొన్ని మీడియాలను ఎంపిక చేసుకొని లీక్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడే సమయంలో దర్యాప్తు విషయాలను వెల్లడిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ‘మహిళా ఐఏఎస్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి. ఆమెకు కర్ణాటకలో ఓ వ్యక్తి నుంచి వేధింపులు ఉన్నాయని ఆమె అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సలహాదారుకు చెప్పారు. ఆయన సూచనల మేరకు కర్ణాటక ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కౌషిక్ముఖర్జీకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.’ అని సీఎం సిద్ధరామయ్య తనకు అనుకూలంగా ఉన్న ఓ పత్రికలో ప్రచురితం అయ్యేలా చూశారన్నారు.’ ఈ విషయాలనే తాను ప్రశ్నించానన్నారు. అయితే రాజకీయ దురుద్దేశంతోనే తానే దర్యాప్తునకు సంబంధించి అనవసర రాద్దాంతం చేస్తున్నానని సీఎం సిద్ధరామయ్య అనవసరంగా ఆరోపిస్తున్నారని కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోలారు నియోజకవర్గ ఎమ్మెల్యే వర్తూరు ప్రకాశ్ డీ.కే రవి బదిలీ అవుతారని చెబుతూ ఓ అధికారిపై బెదిరింపులకు పాల్పడిన సంఘటన కు సంబంధించిన ఓ సీడీని కుమారస్వామి ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేశారు. కాగా, ఈ సీడీలో ఉన్న గొంతు తనది కాదని వర్తూరు ప్రకాశ్ మీడియాతో పేర్కొన్నారు.