breaking news
desperation
-
ఆ వజ్రమూ రాయీ ఒకటే!
ఒక భార్య, భర్త ఇద్దరూ సంసారం పట్ల విరక్తి చెందారు. వారిద్దరూ కలిసి తీర్థయాత్రలకు బయలు దేరారు. ఒక తోవలో నడిచిపోతున్నారు. భర్త ముందు నడుస్తున్నాడు. భార్య వెనకగా వస్తోంది. అప్పుడు అతనికి నేలమీద ఒక వజ్రం కనిపించింది. తన భార్య దానిని చూస్తే దానిమీద ఆశపడి తన వైరాగ్యాన్ని పోగొట్టుకుంటుందేమోనని అతనికి అనుమానం కలిగింది. వెంటనే అతడు దానిని పూడ్చివేద్దామని గుంట తియ్యసాగాడు. ఇంతలో భార్య అక్కడికి వచ్చింది. ‘‘ఏమి చేస్తున్నారు?’’అని అడిగింది. భర్త సరైన సమాధానం చెప్పకుండా మాట దాటవేయడానికి ప్రయత్నించాడు. అయితే భార్య ఆ వజ్రాన్ని చూసి, అతని మనసులోని ఆలోచనను కనిపెట్టింది. ఆమె భర్తతో ‘‘మీకు ఆ వజ్రానికి, మట్టికీ ఇంకా తేడా కనిపిస్తున్నట్లయితే ఎందుకు సన్యసించారు?’’ అని అడిగింది. కొందరు తమలో ఉన్న బలహీనతలే ఇతరులకూ ఉంటాయనుకుంటారు. ముందు మన మనసు స్వచ్ఛంగా ఉంచుకుంటేనే ఇతరుల మనసులో మంచిని చూడగలం. -
నిరాశా నిస్పృహలు వేధిస్తున్నాయా?
ఉపశమనం ఎంత కష్టపడినా ఫలితం దక్కక, అనుకున్న పనులు జరగక, ఇంట్లో అశాంతి, నిరాశా నిస్పృహలతో ఉన్న పరిస్థితులను అధిగమించడానికి కొన్ని పరిహారాలు.. ∙ప్రతి శుక్రవారం మేడిచెట్టు చుట్టూ ఇరవై ప్రదక్షిణలు చేయాలి. లక్ష్మీదేవిని తామరపూలతో అర్చించాలి. పాయసం వంటి తెల్లని తీపి పదార్థాలను నివేదించాలి ∙ఇరవై శుక్రవారాలు శివాలయంలో ఆవునేతిని, తెల్లని వస్త్రాలను, పత్తిని, పెరుగును దానం చేయాలి. నానబెట్టిన బొబ్బర్లను ఆవులకు తినిపించాలి. ఆలయం వద్ద ఉండే పేదలకు పొంగలి పెట్టాలి ∙వాన నీటిని సేకరించి, నీటితో ఉన్న ఆ పాత్రను ఇంట్లో ఈశాన్య దిశగా ఉంచాలి. డబ్బు, ఇతర విలువైన వస్తువులను భద్రపరచుకునే బీరువాను నైరుతి దిశలో ఉంచాలి ∙ స్త్రీలతో దురుసుగా ప్రవర్తించకుండా ఉండాలి. పొరపాటుగానైనా, స్త్రీలను బాధపెడితే మనస్ఫూర్తిగా వారి క్షమాపణలు కోరండి. ∙ఏదైనా శుక్రవారం రోజున కొత్త తాళం కప్పను కొని, దిండు కింద పెట్టుకుని నిద్రించండి. మర్నాటి ఉదయం ఇంటికి దగ్గర్లోని ఆలయానికి ఆ తాళం కప్పను కానుకగా ఇవ్వండి. ∙ప్రతి శనివారం సాయంత్రం రావి చెట్టు మొదట ఆవునేతి దీపాన్ని వెలిగించాలి. అనాథ బాలలకు పాలు దానంగా ఇవ్వాలి. – పి.జగన్నాథదాసు