breaking news
Denied Ambulance
-
అంబులెన్స్ ఇచ్చేందుకు నిరాకరించిన ఆస్పత్రి..
ముంబై: అస్థవ్యస్థమైన ఆరోగ్య వ్యవస్థ అత ని కూతురు ప్రాణాలు తీసింది. ప్రభుత్వ ఆస్పత్రుల నిర్లక్ష్యంతో తల్లి కడుపులోనే బిడ్డ ప్రాణాలు పోయాయి. పసికందు శవాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వడానికి ఆస్ప త్రి వర్గాలు నిరాకరించాయి. కూతురు మృతదేహాన్ని సంచిలో వేసుకుని 90 కిలోమీటర్లు ప్రయాణించాడు మహారాష్ట్రకు చెందిన ఓ గిరిజనుడు. జూన్ 12న నాసిక్ జిల్లాలో జరిగి న అత్యంత అమానవీయ ఘటన సోమవా రం వెలుగులోకి వచ్చింది. పాల్ఘర్ జిల్లాలోని జోగల్వాడి కుగ్రామానికి చెందిన సఖారామ్ కవార్ భార్య అవిత జూన్ 11న ప్రసవ వేదనకు గురైంది. సమీపంలోని ఖోడాలా ప్రాథ మిక ఆరోగ్య కేంద్రానికి తరలించడానికి అంబులెన్స్ దొరకలేదు. 108కు కాల్ చేస్తే స్పందన రాలేదు. ప్రైవేట్ వాహనంలో పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. గంటసేపు ఎదురుచూసినా డాక్టర్లు రాలేదు. సమీపంలోని మోఖడా గ్రా మీణ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యు లు నాసిక్ సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అంబులెన్స్ అందుబాటులో లేక మళ్లీ ఆలస్యమైంది. జూన్11న అర్ధరాత్రి దాటిన తరువాత ఆస్పత్రికి చేరుకుంది. తెల్లవారుజామున ఆమెకు చనిపోయిన ఆడ శిశువును ప్రసవించింది. ఆస్పత్రి జూన్ 12న శిశువు మృతదేహాన్ని సఖారామ్‌కు అప్పగించింది. కానీ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ ఇచ్చేందుకు నిరాకరించింది. బిడ్డను బట్టలో చుట్టుకుని, బస్టాండ్‌కు వెళ్లి.. రూ. 20 క్యారీ బ్యాగ్ కొనుక్కుని, అందులో పెట్టుకుని ఎమ్ఎస్ఆర్టీసీ బస్సులో దాదాపు 90 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఏమి మోసుకెళ్తున్నావని ఆయనను ఎవరూ అడగలేదు. ఆ దుఃఖాన్ని ఆయన కూడా ఎవరితో పంచుకోలేదు. అదే రోజు శిశువును ఖననం చేసి.. జూన్ 13న మళ్లీ ఆస్పత్రిలో ఉన్న భార్యకోసం నాసిక్‌కు తిరిగి వచ్చాడు. ఈసారి కూడా అంబులెన్స్ ఇచ్చేందుకు నిరాకరించారు. పచి్చబాలింత అయిన భార్యను.. బస్సులోనే ఇంటికి తీసుకెళ్లాడు. ‘ఆస్పత్రి ఉదాసీనత వల్ల నేను బిడ్డను కోల్పోయాను. ఏ తల్లిదండ్రులకూ ఇలాంటి బాధ ఎదురు కాకూడదు’అంటూ నిస్సహాయతతో కూడిన బాధతో చెప్పాడు సఖారామ్. -
తండ్రి శవాన్ని చేతులపై మోస్తూ..
ఫిలిబిత్: మొన్న ఒడిషాలోని కాలామండిలో భార్య శవాన్ని భుజంపై మోసిన మాంఝీ ఘటన ఇంకా మరువకముందే మరో దారుణం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్ జిల్లా ఆస్పత్రిలో చనిపోయిన ఓ వృద్ధునికి ఆంబులెన్స్ నిరాకరించడంతో అతని కుమారుడు తండ్రి శవాన్ని చేతులపై మోసుకెళ్లాడు. ఈ వీడియో దృశ్యాలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. ఫిలిబిత్‌లోని మదినషా ప్రాంతానికి చెందిన రోజువారీ కూలీ చేసుకునే సూరజ్ అతని తండ్రి తులసీరామ్(70) జిల్లా ఆస్పత్రికి శనివారం ఉదయం తీసుకెళ్లాడు. దాదాపు గంటన్నర తర్వాత పేషెంటును చూసేందుకు వచ్చిన డాక్టర్ అతను చనిపోయాడని నిర్ధారించారు. శవాన్ని వెంటనే అక్కడ నుంచి తీసుకెళ్లమని ఆస్పత్రి వర్గాలు సూరజ్‌కు సూచించాయి. ఆంబులెన్స్ కోసం సూజత్ ఎంత విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోకపోవడంతో చేసేదేంలేక తండ్రి శవాన్ని చేతులమీద మోస్తూ సూజత్ తీసుకెళ్లాడు. ఈ ఘటనపై జిల్లా మేజిస్టేట్ విచారణకు ఆదేశించారు.