breaking news
delhi youth
-
రూ.2000 నోట్లు కూడా రద్దు కాకముందే..
న్యూఢిల్లీ: ‘పావుగంటలో తిరిగొస్తానని అమ్మకు చెప్పా. కానీ వచ్చాక తెలిసింది.. నేను కుంభమేళా లోకి ప్రవేశించానని. మా బ్యాంక్ ముందు క్యూ కట్టినవాళ్లలో సగం మందిని లెక్కించినా శ్రీలంక జనాభా కంటే ఎక్కువే తేలతారు. గంటకు అడుగైనా కదలని క్యూలైన్ లో రెండు రోజులు నిల్చుంటే ఎలా ఉంటుందో తెలుసా? అందుకే తమ్ముడికి ఫోన్ చేసి దుప్పటి తెమ్మన్నా. పనిలోపనిగా పొల్యూషన్ మాస్క్, నాలుగైదు కేజ్రీవాల్ కామెడీ వీడియోలూ, మ్యాగీ నూడుల్స్ పట్టుకురమ్మన్నా. బహుశా డిసెంబర్ 30కిగానీ నేను బ్యాంక్ లోపలికి పోయి కొత్త నోట్లు తీసుకోలేనేమో. కొత్త నోట్లకు కూడా నకిలీవి తయారయ్యాయని జనం అనుకుంటున్నారు. ఏమో, రూ.2000 నోట్లు కూడా రద్దు చేసేలోపే వాటిని సాధించాలని అనుకుంటున్నా. క్యూలైన్లో ముందు నిల్చున్న ఒకరు భారంగా వెన్కి వచ్చేస్తుంటే అడిగా..‘ఏంది కొత్త నోట్లు అయిపోయాయా?’ అని కాదట, జియో సిమ్ కోసం కట్టిన లైన్ అనుకుని ఇందులో దూరాడట పాపం! రెండు రోజుల క్యూ అనుభవంతో నాకో విషయం బోధపడింది.. బ్యాంక్ ఉద్యోగులు లంచ్ టైమ్ ను 9AM-5PM నుంచి 1PM-2PMకు మార్చుకున్నారు. అయినాసరే క్యూ కదలట్లేదు’ ఇదీ ఢిల్లీ సగటు యువకుడు అమన్ ఆవేదన. దబ్రీ ప్రాంతానికి చెందిన అతను బుధవారం ఉదయం స్థానిక ఎస్బీఐకి వచ్చాడు. శనివారం నాటికి ఇంకా కొత్త నోట్లు దొరకలేదు. పలకరించిన మీడియాకు అమన్ తనదైన శైలిలో జవాబులు చెప్పాడు. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా ఇలాంటి అమన్ లే కనిపిస్తున్నారు. ఏమంటారు? -
పుణేలో ఢిల్లీ యువత అరెస్టు
పింప్రి (మహారాష్ట్ర), న్యూస్‌లైన్: పుణేలో అనుమతి లేకుండా నడుపుతున్న ఓ హుక్కా పార్లర్‌పై పోలీసులు దాడులు నిర్వహించి 39 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున దువాది కబాబ్ హట్లో చోటుచేసుకుంది. అనుమతి లేకుండా నడుస్తున్న ఈ హుక్కా పార్లర్లో ఢిల్లీ నుంచి వచ్చిన యువతీ యువకులు ఉన్నారనీ ముండువ స్టేషన్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఈ పార్లర్‌పై దాడులు నిర్వహించి అందులో ఉన్న సిబ్బందితోపాటు యువతీయువకులను అరెస్టు చేశారు. -
మాకేం కావాలంటే...
ఉపాధి కల్పన, సామాజిక సమస్యల పరిష్కారానికి ప్రయత్నించే వారికే తమ మద్దతు ఉంటుందని ఢిల్లీ యువత చెబుతోంది. దేశరాజధానిలో నరేంద్ర మోడీ హవా చాలా తక్కువగా ఉంటుందని, ఆమ్ ఆద్మీ పార్టీవైపు మొగ్గుచూసే వారి సంఖ్యే అధికమని తొలిసారిగా ఓటు వేస్తున్న యువతీయువకులు అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల తరువాత వచ్చే ప్రభుత్వంపై ఢిల్లీ యువత ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఉపాధి చూపి, నగరాన్ని మహిళలకు సురక్షితంగా తీర్చిదిద్దగల వారికి ఓటు వేస్తామని చెబుతోంది. అవినీతి, ఆహార పదార్థాల ధరలను నియంత్రించగలిగిన వాళ్లకే మద్దతు ఇస్తామంటోంది. వచ్చే నెల 10న నిర్వహించే పోలింగ్‌లో ఎవరికి ఓటు వేయా లో ఇప్పటికే నిర్ణయించుకున్నామని 18-25 ఏళ్ల మధ్య వయసున్న పలువురు యువతీయువకులు చెబుతున్నారు. ఒక్కొక్కరికీ ఒక్కో తరహా రాజకీయ భావాలు ఉన్నా అత్యధికులు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వైపు చూస్తున్నారు. మొదటిసారిగా ఓటు వేయబోతున్న అన్మోల్ గుప్తా మాట్లాడుతూ సామాజిక అంశాల పరిష్కారానికి యత్నించే వారికే తన ఓటు పడుతుందని అన్నాడు. ఆప్ అభ్యర్థులంతా చదువుకున్న వాళ్లు, భవిష్యత్ ప్రణాళికలు ఏమిటో చెప్పారు కాబట్టే తను ఆ పార్టీవైపే మొగ్గుచూపుతానని చెప్పాడు. ఢిల్లీలో నరేంద్రమోడీ హవా ఉండకపోచ్చని ఢిల్లీ ఐఐటీలో చదివే ఈ యువకుడు అభిప్రాయపడ్డాడు. ఆయన ప్రభావం ఎల్లకాలం ఉండబోదన్నాడు. రాజకీయ పార్టీలు విద్యాభివృద్ధిపై దృష్టి సారించాలని పేర్కొన్నాడు. దేశవ్యాప్తంగా తొలి సారి ఓటు హక్కు ఉపయోగించుకుంటున్న 2.3 కోట్ల మందిలో గుప్తా ఒకడు. ఇతనిలాగే మొదటిసారి పోలింగ్‌బూత్‌కు వెళ్లబోతున్న సోనియా తల్వా ర్, దివ్యాగుప్తా కూడా ఆప్కే తమ ఓటు పడుతుం దని స్పష్టం చేశారు. వీళ్లిద్దరూ తరచూ రాజకీయాల గురించి మాట్లాడుకోవడమే కాదు..ఫేస్బుక్ ద్వారా అభిప్రాయాలను పంచుకుంటారు. ‘అన్నిం టికంటే ముఖ్యం ఉద్యోగాలు. ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం చాలా కష్టంగా మారింది. కాంగ్రెస్, బీజేపీ అవినీతి పార్టీలు. ఇప్పుడు ఆప్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీ ప్రభుత్వం కూడా కొన్ని పొరపాట్లు చేసి ఉండవచ్చు. నేర్చుకోవడానికి కాస్త సమయం పడుతుంది’ అని కాస్ట్ అకౌంటెంట్ ట్రెయినీగా పనిచేసే తల్వార్ వాదించింది. తాను కూడా ఆప్కే ఓటు వేస్తానని, అయితే మోడీ సర్కారు వస్తే ఉపాధి కల్పన పెరుగుతుందని గుప్తా చెప్పింది. గుజరాత్ అల్లర్లలో ఎంతోమంది మరణానికి కారకుడైన మోడీని అంత సులువుగా మర్చిపోలేమని స్పష్టం చేసింది. అన్ని ప్రాంతాల్లో శాంతి, మతసామరస్యాన్ని బీజేపీ తెస్తుందన్న నమ్మకం తనకు లేదని కుండబద్దలు కొట్టింది. జామియా మిలియా యూ నివర్సిటీలో ఇంజనీరింగ్ చదివే 22 ఏళ్ల అద్నాన్ హుస్సేన్ కూడా బీజేపీపై మండిపడ్డాడు. అది మైనారిటీలను ద్వేషిస్తోందని విమర్శించాడు. ఇటీవలే డిగ్రీ పూర్తి చేసుకొని చిన్న ఉద్యోగం తో నెలకు రూ.14 వేలు సంపాదించే మణికంఠ్ ఓ ఝాకు మాత్రం రాజకీయాల కంటే ధరలే ము ఖ్యాంశం. ఇంతకుముందు కాంగ్రెస్‌కు ఓటు వేశానని, ధరల స్థిరీకరణ గురించి బీజేపీ వాగ్ధానం చేసింది కాబట్టి ఈసారి దానికే మొగ్గుచూపుతానని చెప్పా డు. టెలికాం సంస్థలో పనిచేసే 31 ఏళ్ల తరుణకు సహజంగానే మహిళల భద్రత కీలకాంశంగా మా రింది. ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్‌కు మాత్రమే ఈ సమస్యను పరిష్కరించగల సత్తా ఉం దని ఈమె విశ్వసిస్తోంది. ముస్లిమ్‌ల అభ్యున్నతికి కృషి చేసే వారికి ఓటు వేస్తానని ఆటోరిక్షా డ్రైవర్ మహ్మ ద్ ఇమ్రాన్ అన్నాడు. ‘మా కుటుంబం చాలా ఏళ్లుగా కాంగ్రెస్‌కు ఓటేస్తోంది. ఇప్పుడు మార్పు అవసరం. బీజేపీ భారతీయులను విడదీసి పాలి స్తోంది. ముందు మనందరం మనుషులం’ అని ఇమ్రాన్ అన్నాడు. ఎనిమిదేళ్ల క్రితం ఢిల్లీ వచ్చి స్థిరపడ్డ 24 ఏళ్ల మోహిత్ కుమార్ కూడా మహిళల భద్రత చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. మోడీ ప్రభుత్వం వస్తేనే మహిళలు క్షేమంగా ఉండగలుగుతారని స్పష్టం చేశాడు. ఉపాధి కోసం ఇక్కడికి వచ్చిన బీహార్, ఉత్తరప్రదేశ్ యువత ఓటింగ్ కోసం స్వస్థలాలకు వెళ్తున్నామని చెబుతోంది.