breaking news
Debina Bonnerjee
-
టాలీవుడ్ నటి ఇంట చోరీ.. అందరూ ఇంట్లో ఉన్నప్పుడే!
బుల్లితెర జంట గుర్మీత్ చౌదరి (Gurmeet Choudhary) - దెబీనా బెనర్జీ (Debinna Bonnerjee) ఇంట దొంగతనం జరిగింది. అది కూడా గుర్మీత్ ఇంట్లో ఉన్న సమయంలోనే కావడం గమనార్హం. ఈ చోరీ విషయాన్ని నటుడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అలర్ట్: కొత్తగా చేరిన ఓ పనిమనిషి మా ఇంట్లో కొన్ని వస్తువులు దొంగిలించి పారిపోయాడు. అయితే మా ఇంట్లో ఎవరు పనిలో చేరుతున్నా వారి వివరాలను ఒకటికి రెండుసార్లు చెక్ చేస్తాను. దానివల్ల పోయిన వస్తువులు తిరిగి రాబట్టుకోవడం సులువైంది. చోరీ సమయంలో ఇంట్లోనే..దొంగతనం జరిగినప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను. నా పిల్లలు వారి రూమ్‌లో సురక్షితంగా ఉన్నారు. ఇలా జరగడం మా దురదృష్టం. కానీ ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని నేర్చుకున్నాను. మీ ఇంట్లో ఎవరు పనికి చేరుతున్నా వారి గురించి ముందే అన్నీ తెలుసుకోండి. వారి వివరాలు సరిగా ఉన్నాయో, లేదో చెక్ చేసుకోండి అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు.డేటింగ్.. పెళ్లిటీవీ సెలబ్రిటీలు దెబీనా బెనర్జీ- గుర్మీత్ చౌదరి రామాయణ్ సీరియల్లో సీతారాముడిగా నటించారు. ఈ సీరియల్ కంటే ముందే వీరు సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. సీతారాముడిగా పాపులారిటీ పొందడంతో పాటు పెద్దల ఆశీర్వాదాలు అందడంతో 2011 ఫిబ్రవరి 15న పెద్దల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఐవీఎఫ్ ద్వారా లియానా జన్మించింది. తర్వాత దివిషా పుట్టింది. త్వరలోనే గుర్మీత్, దెబీనా.. పతీ పత్ని ఔర్ పంగా- జోడియాన్ కా రియాలిటీ అనే షోలో కనిపించనున్నారు. ఇకపోతే దెబీనా.. అమ్మాయిలు అబ్బాయిలు అనే తెలుగు సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. పేరరసు అనే తమిళ మూవీలో హీరోయిన్గా చేసింది. విజయ్‌కాంత్ హీరోగా నటించిన ఈ మూవీ తెలుగులో కాశీ విశ్వనాథ్‌గా డబ్ అయింది.చదవండి: మురళీమోహన్, అలీని తిట్టిన రాజేంద్రప్రసాద్.. అసలేం జరిగిందంటే -
రామాయణ నటికి బాడీ షేమింగ్.. 'చిన్న ఏనుగు' అంటూ!
బాలీవుడ్ బుల్లితెర నటి డెబినా బోనర్జీ ప్రస్తుతం మదర్‌హుడ్‌ను ఎంజాయ్ చేస్తోంది. గతేడాది నవంబర్‌లో రెండో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. టీవీ సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ భామ నటుడు గుర్మీత్ చౌదరి ప్రేమ వివాహాం చేసుకుంది. తెలుగులోనూ అమ్మాయిలు- అబ్బాయిలు చిత్రంలో కనిపించింది. అంతే కాకుండా జగపతిబాబు మూవీ సిక్స్ చిత్రంలో ఓ ఐటం సాంగ్‌లో కనిపించింది. ఏప్రిల్ 2022లో మొదటి బిడ్డ జన్మించగా.. మరో ఏడు నెలల్లోనే రెండో బిడ్డకు తల్లయ్యింది. అయితే తన యూట్యూబ్ వ్లాగ్స్‌లో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ప్రతి విషయాన్ని షేర్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. అయితే తాజాగా చేసిన వ్లాగ్స్‌లో తాను బాడీ షేమింగ్‌కు గురైనట్లు చెప్పుకొచ్చింది డెబినా బెనర్జీ. తన శరీర బరువు పట్ల విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయని తెలిపింది. నెటిజన్స్ చాలా మంది తనను "మినీ హాతీ"(చిన్న ఏనుగు) కామెంట్స్ చేస్తున్నారని చెప్పింది. అయితే నేను వాటిని పట్టించుకోనని చెబుతోంది. త్వరలోనే బికిినీ ధరించి మీ ముందుకొస్తానని అంటోంది. (ఇది చదవండి: చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. కేసు నమోదు చేసిన పోలీసులు!) డెబినా మాట్లాడుతూ.. 'సమాజం మిమ్మల్ని ద్వేషించినప్పుడు వాటిని సానుకూలంగా తీసుకోవాలి. అప్పుడే మరింత ఉత్తమంగా పని చేస్తారు. ప్రస్తుతం నేను చాలా లావుగా ఉన్నా. తగ్గడం చాలా కష్టమైన పనే కానీ నేను ప్రయత్నిస్తాను. నాపై ట్రోల్స్ వచ్చినా పర్లేదు. ఇంకా వాటి నుంచి నేను మరింత ప్రేరణ పొందుతా.' అని పేర్కొంది. కాగా.. 'రామాయణం' సీరియల్లో డెబినా సీతగా నటించింది. రాముడి పాత్రలో గుర్మీత్ కనిపించారు. ఆ సీరియల్ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఫిబ్రవరి 15, 2011న వివాహం చేసుకున్నారు. దాదాపు పెళ్లయిన పదేళ్ల తర్వాత ఈ జంట తల్లిదండ్రులయ్యారు. (ఇది చదవండి: హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. అప్పుడే గేమ్ మొదలెట్టారా?) View this post on Instagram A post shared by Debina Bonnerjee (@debinabon) View this post on Instagram A post shared by Debina Bonnerjee (@debinabon) View this post on Instagram A post shared by Debina Bonnerjee (@debinabon) -
పనికిమాలినదంతా వాగుతున్నారు, నేను పాలిచ్చే తల్లిని: నటి
అమ్మాయిలు అబ్బాయిలు సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైంది దెబీనా బొనర్జీ. తర్వాత అడపాదడపా చిత్రాలు చేసినా పెద్ద గుర్తింపు రాలేదు. దీంతో బుల్లితెరకు షిఫ్ట్ అయిపోయింది. హిందీ రామాయణం సీరియల్లో సీతగా ఎక్కడలేని గుర్తింపు వచ్చింది. ఇదే సీరియల్లో రాముడిగా నటించిన గుర్మీత్ చౌదరిని 2006లో రహస్యంగా, 2011లో పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లాడింది. వీరికి గతేడాది ఇద్దరు పిల్లలు జన్మించారు. ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న ఆమె సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై స్పందించింది. 'నాక్కూడా ఫిట్‌గా ఉండాలనుంది. అందుకే మీరు చెప్పేకంటే ముందే నేను వ్యాయామాన్ని మొదలుపెట్టాను. అందుకు నా శరీరం కూడా సహకరిస్తోంది. అలా అని అందరు తల్లులు ఎక్సర్సైజ్ చేయాల్సిందేనని నేను చెప్పడం లేదు. ఎందుకంటే ఒక్కొక్కరి శరీరం ఒక్కోలా స్పందిస్తుంది. అయినప్పటికీ నేను బరువు తగ్గలేకపోతున్నాను. దీని గురించి సోషల్ మీడియాలో రోజూ ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. దీనివల్ల నాపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కానీ నేను అమ్మతనాన్ని హాయిగా ఆస్వాదించాలనుకుంటున్నాను. డైట్ విషయంలో మాత్రం నేను నిబంధనలు పెట్టుకోవడం లేదు. ఎందుకంటే నేను పాలిచ్చే తల్లిని. తిండి దగ్గర నోటికి సంకెళ్లు వేస్తే నా పిల్లలకు సరిపడా పాలు రావు. కాబట్టి ఇప్పుడు నేను నా పిల్లల గురించి మాత్రమే ఆలోచించాలనుకుంటున్నాను. ఆ తర్వాత నెమ్మదిగా బరువు తగ్గుతాను. నా గురించి పనికిమాలినది వాగేవాళ్లను పట్టించుకోను. వాళ్ల కోసం అనవసరంగా ఆలోచించి నా పిల్లలకు పాలివ్వడం మానేసి సన్నబడలేను' అని చెప్పుకొచ్చింది దెబీనా. చదవండి: ఆస్పత్రి నుంచి ఉపాసన డిశ్చార్జ్.. తన పోలికలేనన్న రామ్‌చరణ్