కంటితో కాదు... మనోనేత్రంతో చూసి..!
గురి తప్పరు
గురి చూసి.. కొమ్ము విసిరితే బోర్డ్‌పై గమ్యాన్ని చేరాలి. అదే ‘డార్ట్‌గేమ్’. చూపు ఉన్నా గురి కుదరడం అంత సులభం కాదు. ఆ గేమ్‌కు విదేశాల్లో మంచి ఆదరణ. కార్నివాల్స్‌లో డార్ట్గేమ్దే ప్రధాన ఆకర్షణ. మరి ఇలాంటి ఆటను అంధులు ఆడితే?
యూరప్‌లో అనేక దేశాల్లో కార్నివాల్స్‌లో డార్ట్‌గేమ్ అడుతారు. విషయం ఏమిటంటే... చూపున్న వారికంటే అంధులు ఈ ఆటను బాగా ఆడుతున్నారు. ఇందుకు డార్ట్‌గేమ్ నిర్వాహకుల ప్రోత్సాహం కూడా బాగానే ఉంటోంది. అంధులు ఉత్సాహంగా ఈ గేమ్ ఆడుతున్నారని... వారు డార్ట్ ఆడుతున్నప్పుడు గురి తప్పి గోడలకు, ఇతర వస్తువులకు తగిలి నష్టం జరిగేదేమీ లేదని.. వారి గురి కుదురుతోందని.. ప్రాక్టీస్‌తో పర్ఫెక్షన్ సాధిస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.